
Hyper Aadi Is Back in Jabardasth Latest Promo
Hyper Aadi : జబర్దస్త్ షోలో హైపర్ ఆది కనిపించకపోవడం ఓ వార్తే.. ఆది లేకపోవడం వల్లే టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయన్నదీ వార్తే.. ఆది లేకపోవడంతో మధ్యలో చాలా మందికి టీం లీడర్లు అయ్యే చాన్స్ వచ్చింది.. కానీ వాళ్లెవ్వరూ కూడా తమకిచ్చిన అవకాశాన్ని నిలుపుకోలేకపోయారు. రోహిణి, దొరబాబు, బాబు ఇలా అందరికీ చాన్సులు వచ్చాయి. కానీ వారెవ్వరూ కూడా తమ తమ టాలెంట్‌లను నిరూపించుకోలేకపోయారు.
జబర్దస్త్ నుంచి ఆది ఎందుకు వెళ్లిపోయాడో ఎవ్వరికీ తెలియదు. కారణాలు కూడా ఎక్కడా చెప్పలేదు. అన్ని షోలు చేస్తుండటంతో టైం సరిపోకపోవడం వల్లే జబర్దస్త్ షోకు దూరంగా ఉన్నానని, మళ్లీ త్వరలోనే ఎంట్రీ ఇస్తానని ఆ మధ్య ఓ సారి ఆది చెప్పుకొచ్చాడు. అయితే ఆది ఇప్పుడు జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో ఆది కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు కనిపిస్తోంది.
Hyper Aadi Is Back in Jabardasth Latest Promo
ఆది వస్తుంటే.. ఏదో పెద్ద వీఐపీ వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. పూల బాట వేశారు. వస్తుంటే పూలు చల్లుతూ వచ్చారు. ఇలా సపరేట్ సాంగ్ పెట్టి ఆది ఎంట్రీని పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు. ఈ మాత్రం దానికే ఇంత చేయాలా? అనే కామెంట్లు వస్తాయని ముందే ఊహించి.. ఆది కూడా ఓ కౌంటర్ ముందుగానే వేసుకున్నాడు. అందుకే అలాంటి ఓ డైలాగ్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
మళ్లీ వచ్చినోడికి పూలు చల్లమంటే.. చచ్చినోడి మీద చల్లినట్టు చల్లుతున్నావ్ ఏంట్రా అని ఆది కౌంటర్లు వేస్తాడు. మొత్తానికి ఆది రాకతో జబర్దస్త్ ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తోంది. ఇక ముందు ఆది వేసిన పంచులు, దొరబాబు, పరదేశీల మీద కౌంటర్లు ఉంటాయోమో చూడాలి. అనసూయ లేదు కాబట్టి రష్మీ మీదే కౌంటర్లు వేస్తాడేమో. అన్నట్టు ఈ ప్రోమోలోనే రష్మీ సుధీర్ మీద కలిపి ఆది ఓ పంచ్ వేశాడు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.