Hyper Aadi : జానీ మాస్టర్ పరువుతీసేశాడు.. హైపర్ ఆది ఓవర్ యాక్షన్

Authored By Sam C | The Telugu News | Published on: March 4, 2022, 7:30 pm

Hyper Aadi: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చి ప్ర‌స్తుతం అన్ని షోల‌లో దుమ్ము రేపుతున్న క‌మెడీయ‌న్ హైప‌ర్ ఆది. జబర్దస్త్ షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరి ని కవర్ చేస్తూ అందరి పై పంచులు వేస్తూ ఉంటాడు.జబర్దస్త్ లో కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం చూసే వారు ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో, ఢీ షోలోను మ‌నోడు తెగ సంద‌డి చేస్తుంటాడు. హైపర్ ఆది స్క్రీన్ మీదకు వచ్చాడంటే చాలు పడి పడి నవ్వుతుంటారు ఆడియన్స్. అంతగా పంచులు వేస్తుంటాడు ఈయన. అప్పుడప్పుడూ తన కడుపు మంటను కూడా అలాగే బయటపెడుతుంటాడు ఆది. కావాల్సిన వాళ్లపై కూడా పంచులు వేస్తుంటాడు.

ముఖ్యంగా ఢీ షోలో జ‌డ్జిగా ఉన్న జానీ మాస్ట‌ర్ తో పాటు అఖిల్‌ల‌పై తెగ సెటైర్స్ వేస్తూ వ‌స్తున్నాడు ఆది. శేఖర్ మాస్టర్ ఢీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. చాలా మంది జడ్జిలు మారుతున్నారు. మధ్యలో కొన్ని రోజులు గణేష్ మాస్టర్ వచ్చాడు. ఇప్పుడు కొన్ని వారాల నుంచి జానీ వస్తున్నాడు. ఆయన కూడా అక్కడున్న అమ్మాయిలతో పులిహోర బాగానే కలుపుతున్నాడు. గ‌తంలో జానీ మాస్ట‌ర్‌పై తెగ సెటైర్స్ వేసి ఆది తాజా ఎపిసోడ్‌లోను త‌న‌దైన శైలిలో కామెంట్స్ చేశాడు.

hyper aadi satires on jhony master

hyper aadi satires on jhony master

Hyper Aadi  : పంచ్‌లే పంచ్‌లు..

తాజాగా ఢీ షోలో ఇద్ద‌రు క్యూట్ ప‌ర్‌ఫార్మెన్స్ చేయ‌గా, వారిపై ఆది సెటైర్స్ వేస్తూ.. మీకు ఢీ లేక‌పోయిన మంచి ఆర్కెస్ట్రా పెట్టుకోవ‌చ్చు. త‌ణుకు సాయి, వ‌ణుకు నైనిక అంటూ ఆర్కెస్ట్రా పెట్టుకోవ‌చ్చు అని అన్నాడు. ఆ త‌ర్వాత జానీ మాస్ట‌ర్ వేదిక‌పై అమ్మాయితో డ్యాన్స్ చేస్తుండ‌గా, దానికి ఆది తెగ పంచ్‌లు వేశాడు. ఎలా చేయాలో కూడా చేసి చూపించాడు. అంతే కాదు జానీ మాస్ట‌ర్ ఏదో లాగుతున్న‌ట్టు డ్యాన్స్ చేస్తున్నాడు అంటూ సెటైర్ వేశాడు. ఏదేమైన మ‌నోడి పంచ్‌ల‌కు జ‌డ్జెస్‌తో పాటు ఆడియన్స్
ప‌గ‌ల‌బ‌డి నవ్వారు. ప్ర‌స్తుతం ప్రోమో వైర‌ల్‌గా మారింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp