Hyper Aadi : మలక్ పేట్ శైలజ పరువుపాయే.. నా లుంగీ కూడా అంటూ హైపర్ ఆది దారుణం

Authored By aruna | The Telugu News | Published on: August 22, 2022, 7:00 pm

Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎలాంటి డైలాగ్స్ వేస్తుంటాడో అందరికీ తెలిసిందే. అయితే తన మీద తానే పంచులు కూడా వేసుకుంటాడు. తాను ఏమీ చేయలేనివాడంటూ అప్పుడప్పుడు స్కిట్లో కౌంటర్లు వేసుకుంటూ ఉంటాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఈ మధ్య ఎక్కువగా ఆంటీలు వస్తున్నారట. ఆంటీలను ఎందుకు పిలుస్తున్నారంటూ మల్లెమాల టీం మీద ఆది ఫైర్ అవుతున్నాడు. తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో ఆది రెచ్చిపోయాడు. సౌందర్య లహరి అంటూ బొడ్డు మీద మచ్చ అంటూ ఇలా ఓ కాన్సెప్ట్‌తో ఈ సారి షో ఎపిసోడ్‌ను లాగించేశారు.

అయితే ఇందులో భాగంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ లేడీస్ అందరినీ ఒకే సారి పిలిపించారు. అందులో తనకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందా? ఆ నడుము మీద మచ్చ ఎక్కడుందా? అని వెతుకుంటాడు ఆది. వర్ష, ఐశ్వర్య, రీతూ ఇలా అందరి మీద ఆది తన స్టైల్లో పంచులు వేస్తాడు. అసలే ఆది శోభనపు గదిలోకి వెళ్లే కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయి ఉంటాడు. తెల్ల పంచె కట్టుకుని, చేతికి మల్లెపూలు చుట్టుకుని ఉంటాడు.అలా ఆది పంచెకట్టుతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే మలక్ పేట్ శైలజ ముందుకు వస్తుంది.. నాకు మచ్చ ఉందేమో చూడు అని అంటుంది. నిన్నూ, నీ పుట్టు మచ్చను నేను కాదు కదా? నా లుంగీ కూడా చూడదని దారుణంగా పరువుతీస్తాడు.

Hyper Aadi Satires on Malakpet Sailaja in Sridevi Drama Company

Hyper Aadi Satires on Malakpet Sailaja in Sridevi Drama Company

ఇంకో సందర్భంలోనూ అలాంటి డైలాగే వేస్తాడు. మిమ్మల్ని నేను కాదు కదా? మన మేనేజర్ కూడా చూడడు అంటూ మలక్ పేట్ శైలజ మీద కామెంట్లు వేస్తాడు ఆది. చివరకు ఇలాంటి ఆంటీలను ఎందుకు తీసుకొచ్చారు.. వీళ్లను ఎందుకు పెట్టారంటూ ఆది కౌంటర్లు వేస్తాడు. మొత్తానికి నటకుమారి, శైలజలు ఆదికి చుక్కలు చూపించేశారు. ఇక ఇందులో వకీల్ సాబ్ సినిమాలో సూపర్ వుమెన్ బ్యూటీ కూడా వచ్చింది. ఆమెను కూడా ఆది వదిలిపెట్టలేదు. సుధీర్‌ను పంపించి ఇక్కడు వచ్చిందని రష్మీ మీద మచ్చ ఉందంటూ ఆది మెల్లిగా కౌంటర్లు వేశాడు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp