Hyper Aadi : నవ్యస్వామి పరువుతీసేశాడు.. హైపర్ ఆది మామూలోడు కాదు
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది ఇప్పుడు ఢీ షోలో చేస్తోన్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే ఇంతకు ముందు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షో అంటూ సందడి చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్నాడు. కారణాలు ఏంటో తెలియడం లేదు గానీ.. ఆది మాత్రం ఆ షోలో కనిపించడం లేదు. ఇప్పుడు ఆది రెండు షోల్లోనే సందడి చేస్తున్నాడు. ఇక ఢీ టీంలో రైటర్‌గానూ ఆది వ్యవహరిస్తున్నట్టున్నాడు. మొత్తానికి ఢీ షో మీద మాత్రం ఆదిపై ఆదిపత్యం ఉన్నట్టుంది. ఇక ఆది అందులో వేసే స్కిట్లలోనూ తనదే పై చేయి అయ్యేట్టు చూసుకుంటాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ అదే కనిపించింది.
ఆది, రవికృష్ణ, నవ్యస్వామి, పాపీ మాస్టర్‌లు కలిసి స్కిట్ వేశారు. ఇందులో ఆది వరుసగా పంచ్‌లు వేశాడు. కాలేజ్‌లో సీనియర్లుగా ఆది, రవికృష్ణలు నటించారు. అప్పుడే కొత్తగా వచ్చిన స్టూడెంట్లలా నవ్య స్వామి, పాపీ మాస్టర్లు కనిపించారు. ఇక ఈ ఇద్దరినీ చూస్తూ ఆది సీరియస్‌గా ఏదో అనబోతాడు. ఇంతలో నవ్యస్వామి తన డైలాగ్ ముందే చెప్పేస్తుంటుంది. దీంతో ఆది సీరియస్‌గా చూస్తాడు. మిగతా వాళ్లంతా పగలబడినవ్వేస్తుంటారు. హేయ్ ఇటు రా అని నవ్య స్వామిని ఆది పిలుస్తాడు. ఆమె వస్తుంది. ఏ క్లాస్ అని అడిగితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని అంటుంది. ఓ కాలేజా?

Hyper Aadi Satires on Navya Swamy Walking in Dhee Show
అని ఆది ప్రశ్నిస్తే .. కాదు స్కూల్ అని వెటకారంగా నవ్యస్వామి కౌంటర్ వేస్తుంది. దీంతో అందరూ నవ్వుతారు. ఆవిడ ఎవరు.. మీ అత్తయ్యా? కాలేజ్‌కు ఎందుకు తీసుకొచ్చావ్ అని పాపీ మాస్టర్ గురించి ఆది సెటైర్ వేస్తాడు. ఏం లేదు మా తాతయ్య ఉన్నాడైతే వచ్చాను అని ఆదికే రివర్స్ పంచ్ వేస్తుంది. కానీ ఆది మాత్రం ఆ పంచ్‌ను రవికృష్ణ మీదకు వేసేస్తాడు. ఏ రా నువ్ వాళ్ల తాతయ్యవా? అని అంటాడు. దీంతో అందరూ విరగబడి నవ్వేస్తారు. ఇక నవ్యస్వామిని వాక్ చేయమని అడిగితే.. సిగ్గు పడుతూ నడుస్తుంది. ఏంట్రా.. ఏమైనా పోయిందా.. వెతుక్కుంటున్నావా? అంటూ నవ్యస్వామి వాకింగ్ మీద కౌంటర్లు వేస్తాడు ఆది.
