Hyper Aadi : ఇంకా నువ్వ్ ఇక్కడెందుకున్నావ్.. సుడిగాలి సుధీర్ పరువుతీసిన హైపర్ ఆది

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 24, 2022, 4:20 pm

Hyper Aadi : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల్లోనూ సుధీర్ కనిపించేవాడు. సుధీర్ కనిపిస్తే చాలు ఆ షో హిట్ అన్నట్టుగా మారిపోయింది. మల్లెమాలలో ఓ కట్టప్పలా సుధీర్ ఉండేవాడు. తాను మల్లెమాలను, జబర్దస్త్ షోను వదిలి పెట్టి ఎక్కడికి వెళ్లను అంటూ చెబుతుండేవాడు. చివరకు సుధీర్ హ్యాండ్ ఇచ్చేశాడు. మల్లెమాల నుంచి బయటకు వెళ్లాడు. పక్క చానెల్ అయిన స్టార్ మాలో సింగింగ్ షోకు హోస్ట్‌గా మారాడు. అయితే సుధీర్ వెళ్లిపోవడం శ్రీదేవీ డ్రామా కంపెనీకి రష్మీ యాంకర్‌గా వచ్చింది. సుధీర్ వెళ్లినా కూడా పరోక్షంగా అతని ప్రస్థావన అందులో ఉంటుంది. ఇక ఇప్పుడు మళ్లీ ఈటీవీ, మల్లెమాల ఈవెంట్లోకి సుధీర్ వచ్చేశాడు. 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈటీవీ స్పెషల్ ఈవెంట్ చేసింది.

మల్లెమాల నిర్వహించిన ఈ ఈవెంట్‌లో సుధీర్ వచ్చాడు. భలే మంచి రోజులు అనే రాబోతన్న ఈ ఈవెంట్‌లో సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆది సహా అందరూ సుధీర్ మీద పంచ్‌లు వేశారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. సుధీర్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఆయనతో పాటు జబర్దస్త్ గ్యాంగ్ అంతా వచ్చి పిచ్చి పిచ్చి స్టెప్పులు వేస్తారు. మీరంతా ఎందుకు వచ్చారు అన్నట్టుగా సుధీర్ చూస్తాడు. ఒక్కసారి మారితే అందరూ మారుతారు మరి..అని కౌంటర్ వేస్తాడు ఆది. మీ అందరినీ ఒక్కచోట ఉంచుతాడు..అని సుధీర్‌ని చూపిస్తూ ప్రదీప్ కామెంట్ చేస్తాడు. ముందు ఆయన్ని ఒక చోట ఉండమను..అని ఆది ఇంకో కౌంటర్ వేస్తాడు.

Hyper Aadi Satires on Sudigali Sudheer in ETV 27 Years Bhale Manchi Roju Event

Hyper Aadi Satires on Sudigali Sudheer in ETV 27 Years Bhale Manchi Roju Event

మరో స్కిట్‌లో భాగంగా సర్ మనకు బ్రేక్ ఎప్పుడుంది.. అని సుధీర్ డైలాగ్ వేస్తాడు. మేం నీకు ఎప్పుడో బ్రేక్ ఇచ్చాం.. ఇంకా నువ్వ్ ఇక్కడెందుకున్నావ్.. అని ఆది ఇంకో కౌంటర్ వేస్తాడు. మరో స్కిట్‌లో భాగంగా ఇప్పుడు నేను మారిపోయాను.. అని సుధీర్ రాజా సినిమాలో వెంకీ మాదిరిగా అంటాడు. పక్క చానెల్‌కా..అంటూ వెంటనే ఆది కౌంటర్లు వేస్తాడు. ఇక అదే స్కిట్లో ఇమాన్యుయల్ తన తలకు మర్దనా చేయమని సుధీర్‌కు ఆర్డర్ వేస్తాడు. దీంతో సుధీర్ వచ్చి అతని తలకు మసాజ్ చేస్తుంటాతడు. ఏ స్టేజ్‌కు వచ్చావ్.. అని సుధీర్ మీద జాలి పడతాడు ఇమాన్యుయేల్. ఈ మోకాలు.. అంటూ ఆది అంటాడు. దీంతో మోకాలి మీద కూర్చుంటాడు సుధీర్. కావాలని కిందకు వస్తాడు.. మనల్ని బ్యాడ్ చేసేందుకు అని ఆది అంటాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp