Niharika konidela : నేను సింగిల్ కాదు రిలేషన్ లో ఉన్న… నిహారిక కొణిదల…!

Authored By aruna | The Telugu News | Published on: January 27, 2024, 2:00 pm
  •  Niharika konidela : నేను సింగిల్ కాదు రిలేషన్ లో ఉన్న... నిహారిక కొణిదల...!

Niharika konidela : గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. మరికొందరు ఆమె పేరును పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్య తో నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత నుండి సోషల్ మీడియా నిహారికను ఒక రేంజ్ లో ఏకేసింది. అయితే ఇప్పుడిప్పుడే అవి తగ్గు మొహం పడుతున్నాయి అనుకుంటున్నా సమయంలో మరలా ఒక యూట్యూబ్ ఛానల్ కి తాజాగా నిహారిక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన విడాకులపై నిహారిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ,చర్చనియాంశంగా మారాయి. దీంతో ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక మాట్లాడుతూ…పెళ్లి అయిన తర్వాత జీవితం అనుకున్నంత సింపుల్ గా ఉండదని…మనుషులు మారిపోతారని…ఈ క్రమంలోనే మనుషులను నమ్మడం తప్పని తెలుసుకున్నట్లుగా నిహారిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే నిహారిక వ్యాఖ్యలు పరోక్షంగా జోలగడ్డ చైతన్య పై నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేసింది. దీంతో తాజాగా ఈ వ్యాఖ్యలపై జొన్నలగడ్డ చైతన్య కూడా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే విడాకుల విషయంలో నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని , ఎప్పుడూ కూడా ఒకేవైపు జడ్జిమెంట్ తీసుకోకూడదు అంటూ కాసింత ఘాటుగానే చైతన్య రెస్పాండ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది. ఇది ఇలా ఉంటే ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ..నేను విడాకులు తీసుకున్న తర్వాత సింగిల్ గా లేను అంటూ చెప్పుకోచ్చారు.

నేను మా అమ్మానాన్నలతో , అన్నా వదినలతో హ్యాపీగా కలిసి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. వారందరూ నాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారని…అందుకే నేను సింగిల్ గా ఉన్నానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నానని..మరోవైపు సినిమాలు కూడా నిర్మిస్తున్నట్లు ఆమె తెలియజేసింది. దీంతో ప్రస్తుతం నా లైఫ్ చాలా బిజీగా ఉందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫ్యూచర్ లో నిహారిక రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించ‌ని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!"

  2. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  3. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  4. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

  5. "Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు"

  6. "Scene Movie Review : సీన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  7. "Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp