Home » Entertainment » Indraja Comments On Nagarjuna
Entertainment

Indraja : ఆ ప‌ని ఇష్టం ఉండి ఎవ‌రు చేస్తారు.. నాగార్జున‌తో ఆ విష‌యంపై మాట్లాడితే లేనిపోని గొడ‌వ‌లు..!

Authored By
Sam C
The Telugu News | Updated on: August 16, 2022 3:18 pm
Advertisement

Indraja : ఇంద్ర‌జ‌..ఈమె ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుని ఓ ఊపు ఊపేసిన విష‌యం తెలిసిందే. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ఇంద్ర‌జ ఇటీవ‌ల త‌న పెళ్లి గురించి చెప్పుకొచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ‘మా పెళ్లికి వచ్చింది 13 మంది.. ఓన్లీ రూ. 7,500 మాత్రమే ఖర్చు అయ్యింది’ అని తన సింపుల్ మ్యారేజ్ గురించి చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఇంద్రజ భర్త కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. రైటర్, యాడ్ ఫిల్మ్ మేకర్.. సీరియల్స్ కూడా చేశారు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి పెద్ద టైం పట్టలేదు. పైగా రెండు కుటుంబాల మధ్య బిజినెస్ డీల్స్ కూడా ఉండటంతో ఎఫెక్షన్ బాగా కుదిరింది.

Advertisement

Indraja : షాకింగ్ వ్యాఖ్య‌లు..

అయితే పెళ్లి త‌ర్వాత సినిమాలు త‌గ్గించిన ఇంద్ర‌జ ఇప్పుడు సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తూనే జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుంది. అయితే ఆ నాటి సంగ‌తుల‌కి సంబంధించి ప‌లు విష‌యాలు చెప్పుకొస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అప్ప‌ట్లో నాగార్జున సరసన కన్నెపిట్టరో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అలరించింది. అలాగే ఓ తమిళ సినిమా లో కూడా ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. వీటి గురించి తాజాగా స్పందిస్తూ “నిజానికి అలాంటి సాంగ్స్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు. పెద్ద వాళ్ల రిక్వెస్టుపైనే ఎక్కువగా చేస్తాం. పెద్ద బ్యానర్‌ అడిగినప్పుడు మనం నో చెప్పితే.. బాగుండదు. పెద్ద బ్యానర్ కదా అనే చాలా మంది ఒప్పుకోవాల్సి వస్తుంది.

indraja comments on nagarjuna

Advertisement

నేను ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను. వాటి గురించి ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా లేనిపోని వివాదాలు వస్తాయి. అందుకే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువగా మాట్లాడను..” అని చెప్పుకొచ్చింది. పెద్ద బ్యాన‌ర్ల బ‌ల‌వంతం వ‌ల్ల‌నే తాను చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌క‌నే చెప్పింది. కాగా, ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా.. బ్రాహ్మిణ్‌గా ఉంది ఇంద్రజ. ‘‘ నేను నా మనసుకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.. అతను హిందు.. ముస్లిం అని చూడలేదు.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదు. మతాలతో సంబంధం లేకుండా ఒకర్నొకరు ఇష్టపడ్డాం.. మతం చూసి, కులం చూసి ఇష్టపడితే అది ప్రేమ ఎలా అవుతుంది అని అంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి