nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : గత కొద్ది రోజులుగా డీఏ పెంపుపై అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను జనవరి 2022 నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏను 3 శాతం పెంచాలని నిర్ణయించారు. 7వ వేతన సంఘం డీఏ పెంపు జూలైలో వస్తుందని ఆశించారు. కానీ డీఏ పెంపుపై కీలక నిర్ణయం ఆగస్టు నెలలో తీసుకోనున్నారని తెలుస్తోంది. కరవు భత్యం పెంపు దాదాపు ఖరారైనా, ఎంతమేరకు పెంచుతారనేది కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 40 వేలవరకూ పెరగవచ్చని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2022 నుండి అమలులోకి వచ్చే ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిర్ణయించారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9.38 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై రూ.1400 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి.
7th pay commission da 3 percent increased
త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.523.80 కోట్ల భారం పడనుంది. అలాగే ఈ నిర్ణయంతో మొత్తం 1,88,494 మంది లబ్ధి పొందనున్నారు. ఇందులో ప్రస్తుతం ఉన్న 1,04,683 మంది ఉద్యోగులతో పాటు 80,855 మంది పెన్షనర్లు ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరువు భత్యం పెంపుపై మోదీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దీని కోసమే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుడ్ న్యూస్ ఎప్పుడు ఎలా వస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.