Prabahs comes with 2 movies in 2023
Prabahs : ప్రభాస్ సినిమాలపై ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాధే శ్యామ్ సినిమా తర్వాత ఆయన సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రకటనలు పెద్దగా రాలేదు. ఇండిపెండన్స్ డే సందర్భంగా సలార్ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. ‘కేజీఎఫ్’ను తెరకెక్కించిన హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైనింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ విలన్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ నటించే క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ప్రాజెక్ట్ కె కూడా ఒకటి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.రెబల్ స్టార్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అంతేకాదు ఈ చిత్రాన్ని 2023 జనవరి వరకు టాకీ పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమాను అక్టోబర్ 18న ప్రభాస్ బర్త్ డే వీక్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు చిత్ర నిర్మాత అశ్వనీదత్ ప్రకటించారు.
Prabahs comes with 2 movies in 2023
తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న అశ్వినీ దత్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ బర్త్ డే పాటు దసరా రెండు చూసుకొని విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ప్రియాంకా దత్, స్వప్పా దత్ ఇద్దరు కూడా సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని అశ్విని దత్ అన్నారు. ప్యాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ఇతరత్రా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు చాలా సమయం కావాలి. అందుకే ఈ సినిమా షూట్ కంప్లీటైన 10 నెలల తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఏదేమైన సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రభాస్ వరుస సినిమాలతో సందడి చేస్తుండడం విశేషం.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.