Chiranjeevi : మెగాస్టార్ గత సినిమా ‘ భోళాశంకర్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ జైలర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ కొల్లగొట్టారు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన జైలర్ సినిమా ముందుగా చిరంజీవి వద్దకు వచ్చిందట. జైలర్ దర్శకుడు నెల్సన్ కుమార్ ఈ కథను ముందుగా చిరంజీవికి చెప్పారట. ‘ బీస్ట్ ‘ సినిమా షూటింగ్ సమయంలో నెల్సన్ జైలర్ గురించి నెరేషన్ చేశారట. అయితే ఈ సినిమా లో సాంగ్స్, డ్యాన్స్ ఏమీ లేకపోవడం ఆలోచించి చెబుతానని చిరంజీవి అన్నారట.
ఆ తర్వాత బీస్ట్ సినిమా రిలీజై ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవి ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టేశారట. తన దగ్గర ఉన్న ఇతర తెలుగు సినిమాల కమింట్ మెంట్ తో ముందుకు వెళ్లారు. ఇక నెల్సన్ రజినీకాంత్ తో జైలర్ తీశారు. అది కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. అటు రజినీకాంత్ కి ఇటు నెల్సన్ కి గట్టి కం బ్యాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దర్శకుడు నెల్సన్ హైదరాబాద్ రానున్నారని సమాచారం. ఆయన మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలవబోతున్నారట. అయితే కథ చెప్పడానికి వస్తున్నారా లేక ఇంకా వేరే పని మీద వస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఆయన చెప్పిన చెప్పకపోయినా చిరంజీవి నెల్సన్ ను లైన్లో పెట్టడం మంచిదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రెండోసారి కూడా ఆయన నెల్సన్ తో ఛాన్స్ మిస్ అయితే అది చిరు తప్పే అవుతుంది అని అంటున్నారు. మరీ చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టతో కలిసి సోషియో ఫాంటసీ సినిమాతో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. అలాగే ఇంకొకటి తన కూతురితో కలిసి మరో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. ఈసారి వచ్చే సినిమాతో నైనా చిరంజీవి హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. మరి చిరంజీవి ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడో చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.