ఎన్టీఆర్ ‘ దేవర ‘ సినిమా కోసం పక్క రాష్ట్రాల నుంచి ఇసుక, బండరాళ్లు తెప్పించిన కొరటాల ..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ దేవర ‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా కొరటాల భారీ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పీటర్ హెయిన్స్, కెన్నీ బేట్స్ లాంటి వాళ్లు పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీన్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఆ సన్నివేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారట. అందుకోసం నెలల తరబడి సమయం కేటాయించారు. సముద్ర గర్భంలో జరిగే యాక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ బ్లూ మ్యాట్ ని వేశారు. అచ్చం సముద్రాన్ని చూసినట్లుగా ఉంటుంది.
ఈ సీన్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వందల మంది ఫైటర్లు పనిచేశారు. ఆ యాక్షన్ సన్నివేశానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో వేసిన ఒక సెట్లో జరుగుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఎమోషనల్ సీన్లలో మునుపెన్నడూ లేని విధంగా తారక్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. ఇది ఒక మత్స్యకార గ్రామం చుట్టూ తిరిగే కథ. జాలరి యువకుడి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
తీర ప్రాంతం సెట్ కోసం ప్రత్యేకంగా బీచ్ సెట్ ని రూపొందించారు. ఇది అచ్చం బీచ్ తీర ప్రాంతాన్ని తలపించేలా ఉంటుందని చూసినవారు చెబుతున్నారు. ఆర్ట్-ఎఫెక్టివ్‌నెస్- రియలిస్టిక్ లుక్-సెట్‌లో ఒక చివర నీటి తరంగాలను అనుకరించే విధానం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందిట. ఇందులో వాడే ఇసుక కూడా బయట రాష్ట్రాల నుంచి తెప్పించారట. టన్నుల కొద్దీ ఇసుకను కర్ణాటక నుంచి ప్రముఖ బీచ్ ల నుంచి తీసుకొచ్చారట. అలాగే అవసరమైన కొన్ని బండ రాళ్ళను కూడా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చారట.