Samantha : ఇప్పటికే 30 కోట్లు ఖర్చుపెట్టా .. ప్లీజ్ ఇక ఆపండి .. సమంత ఎమోషనల్ పోస్ట్ ..

Authored By aruna | The Telugu News | Published on: August 7, 2023, 11:00 am

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తుంది. అంతే కాకుండా ఇటీవల బాలీవుడ్ లో కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియన్ మూవీ ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తుంది. అయితే సమంత చాలాకాలంగా మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ సమస్య నుంచి బయటపడడానికి సమంత సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత మయోసైటీస్ వ్యాధి కోసం 25 కోట్లు ఖర్చు పెడుతుందని, ఆ డబ్బు కూడా ఓ స్టార్ హీరో దగ్గర నుంచి అప్పు తీసుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సమంత తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది. మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లా, మీతో ఎవరో బ్యాడ్ డీల్ కుదుర్చుకున్నారు, అందులో నేను చాలా అంటే చాలా తక్కువ ఖర్చు చేస్తున్నా, నా సంగతి నేను చూసుకోగలను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Interesting news about Samantha

Interesting news about Samantha

అలాగే ఈ వార్తలు రాసేవారికి కూడా కౌంటర్ ఇచ్చింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు రాసే తప్పుడు వార్తలు వలన ట్రీట్మెంట్ కి వెళ్లేవారు ఆగిపోతారు. కొంచెం బాధ్యతగా వ్యవహరించండి. ప్రస్తుతం సమంత ఇండోనేషియాలోని బాలిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉదయం యోగాలు ఆసనాలు చేస్తూ ప్రకృతి మధ్యలో గడుపుతూ ఫిజికల్గా రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఖుషి సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మొత్తానికైతే సమంతపై వస్తున్న వార్తలకి ఆ పోస్టుతో చెక్ పడినట్లు అయింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp