Intinti Gruhalakshmi 10 Dec Today Episode : శృతికి వార్నింగ్ ఇచ్చిన లాస్య.. తులసి ముడుపును విప్పి ఏం రాసిందో చూసి సామ్రాట్ షాక్.. అందులో ఏం రాసి ఉంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 10 Dec Today Episode : శృతికి వార్నింగ్ ఇచ్చిన లాస్య.. తులసి ముడుపును విప్పి ఏం రాసిందో చూసి సామ్రాట్ షాక్.. అందులో ఏం రాసి ఉంది?

 Authored By gatla | The Telugu News | Updated on :10 December 2022,9:30 am

Intinti Gruhalakshmi 10 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 812 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెకండ్ ర్యాంక్ కూడా తక్కువ కాదు కదా అంటాడు సామ్రాట్. దీంతో నాకు కావాల్సింది ఓదార్పు కాదు. ఫస్ట్ ర్యాంక్ అంటుంది హనీ. రేపే ఎగ్జామ్. ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానని చెప్పా అంటుంది హనీ. మరి.. నా ఫస్ట్ ర్యాంక్ ను ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటుంది హనీ. దీంతో దేవుడు అంటాడు. దీంతో మనసు పెట్టి దేవుడిని అడిగితే ఏదైనా చేస్తాడు అని నువ్వు మొన్న తులసి ఆంటితో చెప్పావు కదా. అందుకే ఇప్పుడు నువ్వు నాకోసం దేవుడిని అడుగు. నువ్వే అడగాలి. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలి. లేకపోతే నేను స్కూల్ కు వెళ్లను. ఎగ్జామ్ రాయను అంటుంది హనీ. దీంతో సరే నేను వేడుకుంటానులే నువ్వు ఆడుకోపో అంటే బొమ్మలను తీసుకొని వెళ్తుంది హనీ. నేను ఎక్కడి నుంచి ఫస్ట్ ర్యాంక్ పట్టుకొస్తాను అని అనుకుంటాడు సామ్రాట్.

intinti gruhalakshmi 10 december 2022 full episode

intinti gruhalakshmi 10 december 2022 full episode

కట్ చేస్తే సరస్వతి దగ్గరికి వెళ్తుంది తులసి. జీడిపప్పు ఉప్మా చేసుకొని తీసుకెళ్లి తనకు తినిపిస్తుంది. నువ్వు చేసిందేమీ బాగోలేదు అని అంటుంది సరస్వతి. దీంతో ఏంటి.. ఉప్మా బాగోలేదా అని అంటుంది తులసి. నేను చెప్పేది ఉప్మా గురించి కాదు.. అంటుంది సరస్వతి. ఉప్మా గురించి అయితే ఏమైనా చేయగలను కానీ.. నా జీవితం గురించి నేను ఏం చేయలేను అంటుంది తులసి. ముందు నువ్వు సరిగ్గా కూర్చో. నీ ఒడిలో పడుకుంటా అంటుంది తులసి. ఒడిలో పడుకొని తన తల్లితో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఒడి చాలా ప్రశాంతతను ఇస్తుంది అంటుంది తులసి. ఆకాశంలో ఎగిరే పక్షి ఒంటరిగానే ఎగురుతుంది. అలా అని సంతోషంగా లేదా. సంతోషం ఎప్పుడూ మనల్ని వెతుక్కుంటూ రాదు. మనమే వెతుక్కుంటూ వెళ్లాలి. అప్పుడు ఎక్కడ వెతుక్కున్నా దొరుకుతుంది. అప్పుడు ఎప్పటికీ ఎవ్వరికీ దూరం అవ్వాలనిపించదు అంటుంది తులసి.

కాలం దూరం చేయాలన్నా వాటికి మనం దూరం కాము.. అంటుంది తులసి. దీంతో నీకు పుట్టిన ఊరు మీద, పుట్టింటి మీద ఉన్న ఆపేక్ష నాకు తెలుసు అంటుంది సరస్వతి. నువ్వు పుట్టిన ఇల్లు కోర్టు లిటిగేషన్ లో ఇరుక్కుపోతుంది. కేసులో ఆ ఇంటిని గెలిచి నీకు పుట్టింటి ఆస్తిగా దాన్ని ఇవ్వాలని నా ఆశ అంటుంది సరస్వతి.

దీంతో ఆ ఇల్లు మన సొంతం అయ్యాక మనం అక్కడికే వెళ్దాం అంటుంది తులసి. దీంతో నేను ఉండగా ఆ ఇల్లు మన సొంతం కాదు అంటుంది సరస్వతి. అది సరే.. ఆఫీసు లేదా అని అంటుంది సరస్వతి. దీంతో అమ్మ దగ్గర ఉన్నాను. ఇక్కడికి వచ్చి పికప్ చేసుకో అని చెప్పా సామ్రాట్ గారికి అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 10 Dec Today Episode : హనీ గురించే టెన్షన్ పడ్డ సామ్రాట్ కు తులసి ఐడియా

ఇంతలో సామ్రాట్ వస్తాడు. ఇక లేవాల్సిందే అంటాడు సామ్రాట్. ఈ పెద్దమనిషి బయట అందరికీ సూక్తులు చెబుతుంటారు. కానీ ఇంట్లో చూస్తే ఎప్పుడూ అమ్మ ఒడిలోనే ఉంటారు అంటాడు సామ్రాట్.

అమ్మను చూడగానే నేనే చిన్నపిల్లను అయిపోతాను అంటుంది తులసి. ఇక బయలుదేరుదామా అంటాడు సామ్రాట్. ఇద్దరూ కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుంటారు. కానీ.. సామ్రాట్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది తులసికి.

దీంతో పాటలు ఆన్ చేస్తుంది. అయినా కూడా సామ్రాట్ మాత్రం చలించకుండా కారు డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. తను పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటుంది. దీంతో సాంగ్ ను ఆపేసి.. సాంగ్ భలే హుషారుగా ఉంది కదా అంటుంది.

దీంతో అవును అవును అంటాడు సామ్రాట్. ఏ పాట అది అని అడుగుతుంది. దీంతో బోటనీ పాటముంది పాటే కదా అంటాడు. దీంతో కారు పక్కకు తీసుకోండి అంటుంది తులసి. కారు ఎందుకు ఆపమన్నారు అంటే కారు డ్రైవ్ చేస్తున్నారు కానీ.. మీ మనసు మనసులో లేదు అంటుంది తులసి.

పరద్యానంగా ఎందుకు ఉన్నారు.. అంటుంది. దీంతో హనీ గురించి చెబుతాడు. హనీ నన్ను ఇరికించింది. ఎగ్జామ్స్ ఎంత బాగా రాసినా ఎప్పుడూ సెకండ్ ర్యాంకే వస్తుంది. ఈసారి ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ రావాలని ముడుచుకొని కూర్చొంది అంటాడు.

ఇప్పుడు నేను చేసిన పొరపాటుకే నేనే గిలగిలా కొట్టుకుంటున్నాను అంటాడు సామ్రాట్. ఫస్ట్ ర్యాంక్ దేవుడు డిసైడ్ చేస్తాడు అని చెప్పా అంటాడు. దీంతో దేవుడిని వేడుకోమని చెప్పింది అంటాడు సామ్రాట్.

మీరు చెప్పిన ప్రకారం ఫస్ట్ ర్యాంక్ రాలేదనుకోండి అప్పుడు హనీ చెంపలు వాయిస్తుంది అంటుంది తులసి. నేను ఏదో సరదాకు దేవుడి గురించి చెప్పాను. దేవుడి వల్ల ఆ పని కాదు అని ఫోన్ చేసి చెబుతా అంటాడు సామ్రాట్.

దీంతో ఇక జీవితంలో మిమ్మల్ని హనీ ఎప్పుడూ నమ్మదు అంటుంది తులసి. దీంతో ఏం చేయమంటారు అంటాడు సామ్రాట్. దీంతో దేవుడిని నమ్ముకోవడంలో తప్పు లేదు.. జరిగేది జరుగుతుంది అంటుంది తులసి.

మరోవైపు కిచెన్ లో ప్రేమ్ కోసం వండుతున్న శృతిపై చిరాకు పడుతుంది లాస్య. వంట ఇప్పటికే అయిపోయింది కదా.. మళ్లీ మీ ఆయనకు కావాల్సింది వండిపెట్టాలా? ఇలా ఎవరికి పడితే వాళ్లకు సపరేట్ గా వండుకుంటే ఎలా అంటుంది లాస్య.

ఏం కావాలన్నా.. ఏం చేయాలన్నా ముందు నా పర్మిషన్ తీసుకోవాలి. ఇది నా ఇల్లు అంటుంది లాస్య. దీంతో తులసి ఆంటి ఎవ్వరికీ ఇలా చెప్పలేదు.. అంటుంది శృతి. దీంతో నేను తులసిని కాదు లాస్యను అంటుంది.

కట్ చేస్తే దేవుడి గుడి దగ్గర కారు ఆపుతాడు సామ్రాట్. దేవుడి మీదనే బారం వేస్తా అంటాడు సామ్రాట్. తర్వాత దేవుడికి ముడి కడతాడు సామ్రాట్. తులసి కూడా కడుతుంది. ఆ ముడుపులో ఏం రాశారు తెలుసుకోవచ్చా అని అడుగుతాడు.

దీంతో దేవుడికి రాసిన మొక్కులు పైకి చెప్పొద్దు అని మా అమ్మమ్మ చెప్పింది అంటుంది తులసి. దాన్ని చెట్టుకు కడుతుంది. తులసి అటు వెళ్లిపోగానే దాన్ని చూడాలని విప్పుతాడు. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది