Intinti Gruhalakshmi 10 May Today Episode : ప్రవళిక ఎవరో తెలుసుకొని నందు, లాస్య షాక్.. తులసి కోసం ప్రవళిక ఇదంతా ఎందుకు చేసింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 10 May Today Episode : ప్రవళిక ఎవరో తెలుసుకొని నందు, లాస్య షాక్.. తులసి కోసం ప్రవళిక ఇదంతా ఎందుకు చేసింది?

 Authored By gatla | The Telugu News | Updated on :10 May 2022,9:30 am

Intinti Gruhalakshmi 10 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 628 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్నవాళ్లలో కొంతమంది తమ బిడ్డలను కాదనుకున్నవాళ్లు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమను పట్టించుకోని ఉన్నారు. కానీ.. నా పిల్లలు మాత్రం అమ్మ మనసు తెలుసుకున్న బిడ్డలు అని చెబుతాను. ఒక మొక్కకు నీళ్లు పోసి పెంచినప్పుడు అది ఎదిగి పూలు పూసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తన పెంపకంలో ఎదిగిన బిడ్డలను చూసి తల్లి కూడా అంతే సంతోషపడుతుంది. అదే ప్రేమ అని తులసి మాతృదినోత్సవ వేడుకల్లో చెబుతుంది. దీంతో అందరూ నిలబడి తనకు చప్పట్లు కొడతారు.

intinti gruhalakshmi 10 may 2022 full episode

intinti gruhalakshmi 10 may 2022 full episode

ఇంత మంచి మనిషిని మోసం చేసి దూరం చేసుకున్న వాడు నిజంగా అన్ లక్కీ ఫెలో. అతడు ఎవరో మీరు చెబుతారా అని నిర్వాహకురాలు తులసిని అడుగుతుంది. దీంతో తులసి మాత్రం ఆయన పేరు అంటూ ఏదో చెప్పబోతుంది. దీంతో నందుకు టెన్షన్ అవుతుంది. తన పేరు ఎక్కడ చెబుతుందో అనుకుంటాడు. లాస్య కూడా అదే అనుకుంటుంది. ఆయన పేరు నా నోటితో పలకడం నాకు ఇష్టం లేదు అంటుంది తులసి. ఇంతటితో ఈ కాంపిటిషన్ ముగిసింది అని అని చెబుతుంది నిర్వాహకురాలు. కాసేపట్లో విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తాం అని చెబుతుంది. దీంతో తులసి, పిల్లలు అందరూ స్టేజ్ దిగి కిందికి వస్తారు.

మరోవైపు ప్రవళిక ఎక్కడుందో అని తన కోసం వెతుకుతూ ఉంటుంది తులసి. కానీ.. తను కనిపించదు. తర్వాత కాంపిటిషన్ లో ఎవరు గెలిచారో చెబుతారు. తులసి గారు అని చెబుతారు. దీంతో తులసి ఆశ్చర్యపోతుంది. అందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు.

ఇంతలో ఆపండి అని ఒకావిడ అంటుంది. మేము ఒప్పుకోవడం లేదు అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏం ఎందుకు ఒప్పుకోరు అని దివ్య అడుగుతుంది. దీంతో విన్నర్స్ ను అనౌన్స్ చేసేముందే మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చూడాలి. పిల్లలను ఇంట్లో నుంచి తరిమేసిన తులసి ఉత్తమ తల్లి ఎలా అవుతుంది అంటుంది.

ఇంతలో మరో మహిళ లేచి కన్నకొడుకులతో మాట్లాడని ఆవిడ బెస్ట్ మదర్ ఎలా అవుతుంది అంటుంది. అయితే.. ఇదంతా లాస్య వేసిన ప్లాన్. బ్రేక్ టైమ్ లో లాస్య చేసిన ప్లాన్ ఇది. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారని చెబుతుంది. అందరి ముందు నిలదీయండి అంటుంది.

Intinti Gruhalakshmi 10 May Today Episode : లక్కీ విషయంలో లాస్య నిర్లక్ష్యం

మేము నమ్మం అంటారు నిర్వాహకులు. దీంతో మీరే తులసిని అడిగి తెలుసుకోండి అంటుంది లాస్య. తల్లీకొడుకులు కలిసి లేనంత మాత్రాన వాళ్ల బంధం విడిపోయినట్టేనా అని ప్రశ్నిస్తుంది అనసూయ. ఇంతలో తులసి పైకి లేస్తుంది. తన రెండో కొడుకు ప్రేమ్ తో కూడా మాట్లాడటం లేదు. తన ముఖం కూడా చూడటం లేదు అవునో కాదో మీరే అడగండి అంటుంది లాస్య.

ఇంతలో లక్కీకి కడుపునొప్పి వస్తుందని.. టాయిలెట్ కు వెళ్లాలని చెప్పినా కూడా లాస్య వినదు. మేము ఇంతగా గొంతు చించుకొని అరుస్తున్నాం. తులసి సమాధానం చెప్పడం లేదు. దాని అర్థం ఏంటి.. తప్పు తులసి వైపు ఉన్నట్టే కదా అంటుంది లాస్య.

తులసికి బెస్ట్ మదర్ అవార్డు ఇవ్వడం అంటే.. మా పార్టిసిపెంట్స్ అందరినీ అవమానించినట్టే అంటుంది లాస్య. అందరూ లాస్యకే వత్తాసు పలుకుతారు. దివ్య, అనసూయ మాత్రం కుదరదు. ఆ అవార్డు తులసికి ఇవ్వాల్సిందే అంటారు. ఇంతలో లక్కీని బాత్ రూమ్ కు తీసుకెళ్తుంది తులసి.

దీంతో చూశారా.. నా కొడుకును ఎలా లాక్కెళ్తోందో అంటుంది లాస్య. తనకు మాట్లాడాలంటే భయం అంటుంది. ఎవ్వరూ గొడవ చేయకండి. తులసి గారు ఎక్కడికి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో ఆవిడ వచ్చాక చూద్దాం అంటారు నిర్వాహకులు. ఇంతలో లక్కీని తీసుకొని తులసి హాల్ లోకి వస్తూ ఉంటుంది.

పదా.. అని లక్కీని తీసుకెళ్లి తన తల్లి దగ్గరికి పంపిస్తుంది. వీళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారని వీళ్లు ఆరోపిస్తున్నారు అంటారు నిర్వాహకులు. మీరు నిర్లక్ష్యంగా, పొగరుగా బిహేవ్ చేస్తున్నారని లాస్య గారు అంటున్నారు అంటారు. బెస్ట్ మదర్ అవార్డుకు మీకు అర్హత లేదని వాళ్లు చెబుతున్నారు అంటారు.

బెస్ట్ మదర్ సంగతి పక్కన పెట్టండి.. అసలు తల్లి అనిపించుకునే అర్హతే ఆమెకు లేదు అంటుంది తులసి. దీంతో తులసి అని సీరియస్ అవుతుంది లాస్య. ఒక పక్క బాబు టాయిలెట్ కోసం వెళ్లాలని ఎంతో బతిమిలాడుతున్నాడు. తనకు కడుపు నొప్పి వచ్చిందని అంటున్నాడు. అయినా కూడా బాబును పట్టించుకోకుండా.. అవార్డు కోసం కొట్లాడుతోంది అంటుంది.

ఆ అవార్డు తనకే ఇచ్చేయండి. సంతోషపడనివ్వండి. ఆ అవార్డుతోనైనా తనను తల్లిగా నటించడం కాదు.. తల్లిగా జీవించమని చెప్పండి అంటుంది తులసి. తల్లి మనసు అంటే అది అని నిర్వాహకులు అంటారు. ఇది ఒక్కటి చాలు.. తులసి గారికి బెస్ట్ మదర్ అవార్డు ఇవ్వడానికి అంటారు నిర్వాహకులు.

ఆ తర్వాత ఈ ఫంక్షన్ కు గెస్ట్ గా జిల్లా కలెక్టర్ వస్తున్నారని నిర్వాహకులు చెబుతారు. ఇంతలో జిల్లా కలెక్టర్ వస్తూ ఉంటుంది. తను ఎవరో కాదు.. ప్రవళిక. తనను చూసి తులసితో పాటు అందరూ షాక్ అవుతారు. తను డైరెక్ట్ గా తులసి దగ్గరికి వెళ్లి తన తల మీద మొట్టికాయ వేస్తుంది ప్రవళిక.

కలెక్టర్ ప్రవళిక చేతుల మీదుగా బెస్ట్ మదర్ అవార్డు అందుకోవాలని తులసి గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం అని నిర్వాహకులు చెబుతారు. దీంతో ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు. తర్వాత తనకు ప్రవళిక.. అవార్డు అందజేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది