Intinti Gruhalakshmi 12 Nov Today Episode : అనసూయకు కనువిప్పు.. లాస్య అసలు నిజం తెలుసుకొని అనసూయ షాకింగ్ నిర్ణయం.. తులసిని సపోర్ట్ చేస్తుందా?
Intinti Gruhalakshmi 12 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 నవంబర్ 2021, శుక్రవారం 475 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు.. ఈ ప్రాజెక్టు నెపంతో నా కంపెనీకి బాస్ కావాలని చూస్తున్నావా? ఇప్పుడు లాస్యను వద్దన్నారు.. రేపు నన్ను కూడా వద్దంటారు.. అంటూ తులసిపై సీరియస్ అవుతాడు నందు. రెస్టారెంట్ లో తినడం కోసం అని వెళ్లిన ఇద్దరు తినడం పక్కన పెట్టి పోట్లాడుకుంటారు.
నాకు, నీ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక.. నువ్వెవరో.. నేనెవరో.. అంటూ ఖరాఖండిగా చెప్పేస్తుంది తులసి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలోనే లాస్య ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అంటుంది. రెస్టారెంట్ కు వచ్చాను తినడానికి అంటాడు. తులసితో కలిసి వచ్చావా? అని అడుగుతుంది. నీ అనుమానం ఏంటో నాకు అర్థం కావడం లేదు.. అంటాడు నందు. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. లాస్య కూడా చిరాకు పడుతుంది. నందు ఫోన్ కట్ చేస్తాడు.
ఇంతలో.. లాస్య వస్తున్నావా? అంటూ అనసూయ అడుగుతుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్లావు. వెన్నపూస తేవడానికి ఇంతసేపా.. అంటుంది. దీంతో లాస్యకు చిర్రెత్తుకొస్తుంది. నాకు ఇదొక్కటే పని అనుకున్నావా? నాకేం పనిలేదనుకుంటున్నారా? అంటుంది. కాస్త వెన్న రాయమ్మా అంటుంది అనసూయ. సరే.. అంటుంది. ఇంతలో తనకు ఏదో గుర్తొస్తుంది.
మరోవైపు భాగ్య ఫోన్ చేసి.. మొత్తానికి నందు.. తులసి దారిలోకి వచ్చాడన్నమాట. అదే అనిపిస్తోంది కదా.. అని ఇంకాస్త లాస్యను ఎక్కిస్తుంది భాగ్య. దీంతో లాస్యకు ఇంకా చిరాకు వస్తుంది. ట్యాబ్లెట్లు తెస్తానని చెప్పి ఇది తిరిగొచ్చేలా లేదు అని అనుకుంటుంది అనసూయ. ఎలాగోలా వెళ్లి నేనే తెచ్చుకుంటాను అని తన రూమ్ లోకి వెళ్తుంది అనసూయ.
Intinti Gruhalakshmi 12 Nov Today Episode : లాస్య మాటలు విని అనసూయ షాక్
ఇంతలో ఫోన్ లో లాస్య మాట్లాడటం వింటుంది. తనకు కామన్ సెన్స్ లేదు. తను బతికి ఉండి ఎవరిని ఉద్దరించాలి. చస్తే బాగుండు. ఈ ఇంటికి కోడలు అవగానే నేనే చేసే మొదటి పని.. ఈ ముసలి బ్యాచ్ ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తా.. అంటూ భాగ్యతో చెప్పడం అనసూయ విని షాక్ అవుతుంది.
ఒక్కసారిగా అనసూయకు అన్నీ గుర్తొస్తాయి. దీనికోసమా.. నేను నా ఫ్యామిలీకి ఎదురు తిరిగింది.. దీనికోసమా.. నేను నందుకు సపోర్ట్ చేసి.. తులసికి ఎదురు తిరిగింది అని అనుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అనసూయ. సోఫా మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో పరందామయ్య వచ్చి ఎలా ఉంది ఇప్పుడు అంటాడు. దీంతో అవసరం లేదు తగ్గిపోతుంది అంటుంది అనసూయ.
ఇంతలో తులసి ఫోన్ చేస్తుంది పరందామయ్యకు. దీంతో అమ్మ తులసి ఎలా ఉన్నావమ్మా అంటాడు పరందామయ్య. ఎలా ఉన్నావమ్మా.. నీకు అక్కడ అంతా సవ్యంగానే ఉంది కదా అమ్మా.. అని అడుగుతాడు. మీ అత్తయ్యకు టీ కాల్ మీద పడి కాలు కాలిందమ్మా అని చెబుతుంది. దీంతో తులసి టెన్షన్ పడుతుంది. ఒకసారి అత్తయ్యకు ఫోన్ ఇవ్వు అంటుంది తులసి.
చెప్పు అంటుంది.. ఎలా ఉంది అత్తయ్య అంటే. వదిలేసి వెళ్లావు కదా.. ఎలా ఉంటే నీకెందుకు అంటుంది అనసూయ. మీరు వెంటనే అభికి ఫోన్ చేయండి అత్తయ్య. వెంటనే వాడు వచ్చి మిమ్మల్ని చూసుకుంటాడు. నాకు తెలుసు అత్తయ్య. మీకు నాతో ఎక్కువ సేపు మాట్లాడటం ఇష్టం లేదని. మీకు నేనంటే ఇష్టం లేకపోయినా.. మీరంటే నాకు ఎంతో అభిమానం అత్తయ్య అంటుంది తులసి.
దీంతో అనసూయకు చాలా బాధేస్తుంది. తులసి అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఏం లేదు జాగ్రత్త అంటుంది.. ఉంటాను అంటుంది. దీంతో తులసికి సంతోషం అనిపిస్తుంది. పరందామయ్యకు కూడా ఏం అర్థం కాదు. అత్తయ్య ఏంటి.. ఇలా తేడాగా మాట్లాడారు. ఏమైంది అని అనుకుంటుంది. అనసూయ.. మనిషి మీద కోపాన్ని దాచుకోవాలి కానీ.. ప్రేమను దాచుకోకూడదు అని అంటాడు పరందామయ్య.
వెంటనే లాస్య.. టాబ్లెట్ తెచ్చి ఇదిగో అంటుంది. దీంతో అక్కడ పెట్టు అంటుంది. అదేంటి.. ఇప్పటిదాకా టాబ్లెట్ అంటూ అరిచావు కదా.. ఇప్పుడు ఇస్తే తీసుకోవట్లేదు ఏంటి.. అని అడుగుతుంది లాస్య. లాస్యను సమయం వృథా చేసుకోవద్దని చెప్పండి. తన పనేదో తనను చూసుకోమనండి.. అంటుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.