Intinti Gruhalakshmi 13 June Today Episode : ప్రేమ్ కు 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న అంకిత.. ఇంతలో తులసికి షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 13 June Today Episode : ప్రేమ్ కు 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న అంకిత.. ఇంతలో తులసికి షాక్

Intinti Gruhalakshmi 13 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 657 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలను కనగలం కానీ.. వాళ్ల జాతకాలను కనలేము అంటారు. మా జాతకంలో అలా రాసిపెట్టి ఉంది. అందుకే అలా జరుగుతోంది. అనుభవించాలి కదా ఆంటి అని ప్రేమ్ గురించి తులసికి శృతి చెబుతుంది. శృతి.. నువ్వు పనిమనిషిగా చేస్తున్నావని ప్రేమ్ కు […]

 Authored By gatla | The Telugu News | Updated on :13 June 2022,9:30 am

Intinti Gruhalakshmi 13 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 657 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలను కనగలం కానీ.. వాళ్ల జాతకాలను కనలేము అంటారు. మా జాతకంలో అలా రాసిపెట్టి ఉంది. అందుకే అలా జరుగుతోంది. అనుభవించాలి కదా ఆంటి అని ప్రేమ్ గురించి తులసికి శృతి చెబుతుంది. శృతి.. నువ్వు పనిమనిషిగా చేస్తున్నావని ప్రేమ్ కు తెలుసా అని అడుగుతుంది అంకిత. చెప్పలేదా అంటుంది. దీంతో తెలియదు అంటుంది శృతి. మరి ఏమని చెప్పావు అంటే.. ఏదో ప్రైవేటు ఆఫీసులో పనిచేస్తున్నానని మేనేజ్ చేశాను అంటుంది శృతి. మిమ్మల్ని ఇలా చూడటానికా నేను బతికి ఉంది అంటుంది తులసి. మాకు తెలుసు ఆంటి.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు తల వంచి బతకడం మీదగ్గరే నేర్చుకున్నాను. అదే ఇప్పుడు మాకు పనికొస్తుంది. పని కోసం ఎంతో మంది కాళ్లు పట్టుకున్నాడు. అయినా లాభం లేకపోయింది అంటుంది శృతి.

intinti gruhalakshmi 13 june 2022 full episode

intinti gruhalakshmi 13 june 2022 full episode

దీంతో కాళ్లు పట్టుకోవడం కాదు.. తనను తాను నిరూపించుకోవాలి అని చెబుతుంది తులసి. దీంతో అందుకోసమే ప్రేమ్ ప్రయత్నాలు చేశాడు అని చెబుతుంది. తనను తాను నిరుపించుకోవాలంటే.. ఆల్బమ్ చేయాలి. దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బుల కోసం ఎక్కడ తిరిగినా రూపాయి కూడా పుట్టలేదు అని అంటుంది శృతి. దీంతో ఆ 5 లక్షలు నేను ఇస్తాను అంటుంది శృతి. దీంతో వద్దు నువ్వు ఇవ్వకూడదు అంటుంది తులసి. ఆంటి.. నేను డబ్బు ఇవ్వాలనుకుంటోంది.. ఇచ్చేది ప్రేమ్ కు.. మీకు కాదు. దయచేసి నాకు అడ్డు చెప్పకండి ప్లీజ్ అని అంటుంది అంకిత. అవసరానికి ఉపయోగపడని డబ్బు నా దగ్గర ఉండి లాభం ఏంటి ఆంటి. మీరు కనుక నో అంటే.. ఈ ఆస్తి మీద హక్కును వదులుకుంటాను. నేనే ఆస్తిని అభి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేయమంటాను. ఆ తర్వాత మీ ఇష్టం అంటుంది అంకిత. దీంతో నీ ఇష్టం అంకిత అంటుంది తులసి.

నీకేది మంచిదనిపిస్తుందో అలాగే చేయి అంటుంది తులసి. దీంతో హమ్మయ్య.. కోడలి హోదాలో మొదటి సారి నేను చెప్పిన దానికి ఆంటి ఒప్పుకునేలా చేశాను అంటుంది అంకిత. అంటే ఏంటి.. మీ అత్త గారు మొండిది మాట వినదు అని నీ ఉద్దేశమా అంటుంది. అయ్యో అలా కాదు ఆంటి అంటుంది అంకిత.

ఆ 5 లక్షలు.. నేను ఇస్తున్నట్టు ప్రేమ్ కు చెప్పకు. ఎవరో ఫ్రెండ్ దగ్గర ఆ డబ్బు తెచ్చినట్టుగా చెప్పు. అలాగే.. నువ్వు ఈ పనిమనిషిగా చేయడం కూడా మానేయ్ అని అంటుంది తులసి. దీంతో మానేస్తాను కానీ.. ఇప్పుడు కాదు.. ఆల్బమ్ రిలీజ్ అయ్యాక.. ప్రేమ్ కు పేరు వచ్చాక మానేస్తాను అంటుంది. దీంతో కనీసం నువ్వు పనిమనిషిగా చేస్తున్నావని అయినా చెప్పు అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 13 June Today Episode : నందుకు గుడ్ న్యూస్ చెప్పిన అభి

మరోవైపు ఆస్తి తన పేరు మీదికి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు అభి. సొంత పెళ్లాంతో మాట్లాడటానికి కూడా ఇంతలా వెయిట్ చేయాల్సి వస్తోంది అని మనసులో అనుకుంటాడు అభి. ఇంతలో అంకిత వస్తుంది. నీకోసమే ఎదురుచూస్తున్నాను.. మాట్లాడుదాం అని అంటాడు అభి.

దీంతో చెప్పు అంటుంది. ఈవెనింగ్ నుంచి ఇంట్లో లేవు.. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు ప్రేమ్. దీంతో ఆంటి దగ్గరికి వెళ్లాను అంటుంది అంకిత. ఆ తర్వాత అంకిత మూడీగా ఉండటం చూసి అంత అర్జెంట్ గా మామ్ ను ఎందుకు కలిశావు అని అడుగుతాడు అభి.

దీంతో అది నా పర్సనల్ అంటుంది అంకిత. దీంతో సరే కానీ.. నాకు ఒక విషయంలో నీ హెల్ప్ కావాలి. నేను నా వాళ్లకు కొంత ఎమౌంట్ హెల్ప్ చేద్దామనుకుంటున్నాను. అనవసరంగా నువ్వు ఇంకొకరి ముందు మాకోసం చేయి చాపాలి వద్దులే అన్నారు. కానీ.. పెద్దకొడుకుగా నా బాధ్యత అని అంటాడు అభి.

నీ వాళ్లకు, నీ ఫ్యామిలీకి నువ్వు హెల్ప్ చేస్తానంటే నేనెందుకు అడ్డు పడతాను. నీ వాళ్లు నా వాళ్లు కాదా.. ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను అంటుంది అంకిత. దీంతో థాంక్యూ సోమచ్ అంటాడు అభి. అంకిత.. మాత్రం ప్రేమ్ కు అభి హెల్ప్ చేస్తున్నాడేమో అని అనుకుంటుంది అంకిత. కానీ.. నందుకు సాయం చేయడం కోసం అంకితను డబ్బు అడుగుతున్నాడని అంకిత ఊహించదు.

మరోవైపు నందు మూడీగా ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. నందు.. నా వల్ల కావడం లేదు. ఈ టెన్షన్ ను నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది లాస్య. ఏదో ఒకటి అభి ఫోన్ చేసి అయినా చెప్పాలి కదా అంటుంది లాస్య. ఆవేశంగా అడుగుతానని అన్నాడు కదా.. అంటుంది లాస్య.

ఇంతలో అభి ఫోన్ చేస్తాడు. డాడ్ కంగ్రాట్స్ మన మిషన్ గ్రాండ్ సక్సెస్. మీ కంపెనీకి డబ్బులు ఇవ్వడానికి అంకిత ఒప్పుకుంది.. అంటాడు అభి. దీంతో నందు, లాస్య సంతోషిస్తారు. నేను నమ్మలేకపోతున్నాను అంటాడు నందు. మరోవైపు బొమ్మలను చూస్తూ బాధపడుతుంది తులసి.

నా కొడుకుకు ఇంత గతి పట్టించాను అని బాధపడుతుంది. నిన్ను ఇంట్లో నుంచి పంపించి తప్పు చేశాను. నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని బాధపడుతుంది తులసి. సారీ నాన్న ఈ అమ్మ మీద కోపం తెచ్చుకోకు.. అంటుంది.. తులసి.

అవన్నీ విన్న పరందామయ్య.. మాటలు రాని బొమ్మతో ఎంత మాట్లాడినా బదులు రాదు తులసి అంటాడు పరందామయ్య. ఎదగాలి అని అనుకొని నేను వాడిని దూరం పెట్టాను కానీ.. వేరే ఉద్దేశంతో కాదు. వాడు ఎదగడం పక్కన పెడితే వాడు చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది