Intinti Gruhalakshmi 13 May Today Episode : నందు, తులసి మధ్య గొడవ.. ప్రేమ్ కు షాకిచ్చిన ఇంటి ఓనర్.. చెకప్ కు హాస్పిటల్ కు వెళ్లిన తులసికి భారీ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 13 May Today Episode : నందు, తులసి మధ్య గొడవ.. ప్రేమ్ కు షాకిచ్చిన ఇంటి ఓనర్.. చెకప్ కు హాస్పిటల్ కు వెళ్లిన తులసికి భారీ షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :13 May 2022,9:30 am

Intinti Gruhalakshmi 13 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 631 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు నా మీద చూపించే జాలి నాకు అవసరం లేదు. పెద్దమనసుతో ఇప్పించే ఉద్యోగమూ నాకు అవసరం లేదు. మళ్లీ నా విషయంలో ఇంకోసారి జోక్యం చేసుకోకండి నందుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. బయటికి రాగానే.. అక్కడ ప్రవళిక ఉంటుంది. ప్రవళిక ఏమైందో అని చూస్తుంటుంది. రాగానే.. తులసికి చాక్లెట్ ఇస్తుంది ప్రవళిక. దీంతో ఎందుకు.. ఇప్పుడు నేను ఏం గెలిచానని. రావాల్సిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను అంటుంది తులసి. దీంతో కానీ ఆత్మాభిమానాన్ని గెలిచావు అని ప్రవళిక అంటుంది.

intinti gruhalakshmi 13 may 2022 full episode

intinti gruhalakshmi 13 may 2022 full episode

అవును తులసి.. అన్నీ ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు.. అన్నీ లేనప్పుడు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు అంటుంది ప్రవళిక. నువ్వు సాధించావు అని చెప్పడానికి ఇది చాలు అంటుంది ప్రవళిక. దీంతో తులసి ఆ చాక్లెట్ తీసుకొని తింటుంది. మీ ఆయన మీద నీకు చాలా ద్వేషం ఉన్నట్టుంది అంటుంది ప్రవళిక. దీంతో ఎవరు మా ఆయన అంటుంది. మీ మాజీ భర్త అంటుంది. నాకు ఆయన మీద ఎందుకు ద్వేషం ఉంటుంది. అది వైరాగ్యం కావచ్చు. ఒకరిని ఒకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. పాతికేళ్ల తర్వాత ఆయనకు నా మీద ఇష్టం చచ్చిపోయింది అంటుంది. దీంతో కాదు.. ఇంకో మనిషి మీద ఇష్టం పుట్టుకొచ్చింది. అందుకే నీ మీద ఇష్టాన్ని చంపుకున్నాడు. తను అవకాశవాది అంటుంది ప్రవళిక.

దీంతో ఏమోలే.. ఆయనే వద్దు అనుకున్నాక.. ఆయన గురించి మాట్లాడుకోవడం ఎందుకు అంటుంది తులసి. అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా బతకాలని ఉంది అంటుంది తులసి. ఇంతలో పక్షలు ఎంతో స్వేచ్ఛగా ఎగురుతుండటం చూసి.. ఆ పక్షులు చూడు.. ఎంత స్వేచ్ఛగా.. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాయో అంటుంది తులసి.

దీంతో పదా.. నీకు కూడా స్వేచ్ఛ కావాలా అంటుంది. ఎలా అంటుంది తులసి. కారు ఎక్కు నీకే అర్థం అవుతుంది అంటుంది ప్రవళిక. దీంతో కారు టాప్ మీద నిలుచుంటుంది తులసి. కారు టాప్ మీద నిలబడి.. చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది.

మరోవైపు బారెడు పొద్దెక్కినా ప్రేమ్ లేవలేదని.. అనుకొని తన మీద నీళ్లు పోయాలని అనుకుంటుంది శృతి. కానీ.. తనకే మస్కా ఇస్తాడు ప్రేమ్. ప్రేమ్ ఎక్కడున్నావు అని అడుగుతుంది. దీంతో ఇక్కడున్నాను. ఈరోజు నీకు రెస్ట్ ఇస్తున్నాను. నేనే అన్ని పనులు చేస్తాను అంటాడు.

Intinti Gruhalakshmi 13 May Today Episode : నందుకు వార్నింగ్ ఇచ్చిన లాస్య

మరోవైపు నందు ఇంటికి వచ్చి చాలా కోపంగా ఉంటాడు. ఏమైంది అని అడుగుతుంది లాస్య. దీంతో అసలు విషయం చెబుతాడు. నువ్వు తులసికి ఎందుకు రికమెండ్ చేశావు అని అడుగుతుంది లాస్య. నువ్వెవరో తెలియదు అని ముఖం మీదే అన్నా కూడా నువ్వు ఎందుకు రికమెండ్ చేయాలి అంటుంది లాస్య.

మరిచిపో.. తనను ఇప్పటికైనా మరిచిపో అంటుంది లాస్య. నేను నీ భార్యను అంటుంది లాస్య. ప్రేమ చూపించాలని అనుకుంటే నా మీద చూపించు.. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.

మరోవైపు ప్రవళిక.. తులసిని డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం తీసుకెళ్తుంది. మా తులసి హెల్త్ పొజిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది ప్రవళిక. చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తోంది అంటుంది డాక్టర్. ఏ జబ్బునైనా మందులు ఒక స్టేజ్ వరకే క్యూర్ చేస్తాయి.. అంటుంది డాక్టరమ్మ.

కానీ.. మన లైఫ్ స్టైల్, మన నమ్మకం ఏ జబ్బునైనా నయం చేస్తాయి అంటుంది డాక్టర్. మీ విషయంలో కూడా అదే జరుగుతోంది అంటుంది డాక్టర్. నాకు ఇప్పుడు అర్థం అయింది. నా డాక్టర్ ఆవిడ కాదు.. నువ్వు అని అర్థం అయింది అని ప్రవళికతో అంటుంది తులసి.

బతుకు తెరువు కోసం వెతుక్కుంటున్నావు. నీ వాళ్ల కోసం కష్టపడాలనుకుంటున్నావు. ఆ పడే కష్టం.. నీకు నచ్చిందయితే బాగుంటుంది కదా. పాటలనే నువ్వు ప్రొఫెషన్ గా ఎందుకు మార్చుకోకూడదు.. అంటుంది ప్రవళిక. నీకు తెలిసిన విద్యనే వేరే వాళ్లకు నేర్పించు అంటుంది ప్రవళిక.

అది సాధ్యం కాని పని అంటుంది. దానికి సాధన చేయాలి అంటుంది. దీంతో సాధన చేయి అంటుంది. కట్ చేస్తే.. ప్రేమ్ ఇంట్లో వంట వండుతుంటాడు. ఇంతలో ఇంటి ఓనర్ అక్కడికి వస్తాడు. అద్దె వసూలు చేయడం కోసం వచ్చిన విషయమే మరిచిపోయి.. ప్రేమ్ తో డ్యాన్సులు వేస్తుంటాడు.

ఇంతలో ఇంటి ఓనర్ భార్య అక్కడికి వస్తుంది. డ్యాన్స్ వేస్తున్న తన భర్తను చూసి కోపం తెచ్చుకుంటుంది. ఇంతలో తన భార్యను చూసి షాక్ అవుతాడు. నువ్వు దేనికి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది అతడి భార్య. తర్వాత అద్దె అడుగుతుంది.

రెండు రోజుల్లో జీతం వస్తుంది. వచ్చాక అద్దె ఇస్తాను అంటాడు ప్రేమ్. ఇంకోసారి ఇలా కాకుండా చూసుకో అని చెప్పి ప్రేమ్ కు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఇంటి ఓనరమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది