Intinti Gruhalakshmi 13 Oct Today Episode : రాజ్యలక్ష్మికి తులసి మాస్ వార్నింగ్.. బెడ్ రూమ్‌లో జాను, విక్రమ్ మధ్య ఏం జరిగింది.. మొత్తం వీడియో రికార్డు చేసిన దివ్య | The Telugu News

Intinti Gruhalakshmi 13 Oct Today Episode : రాజ్యలక్ష్మికి తులసి మాస్ వార్నింగ్.. బెడ్ రూమ్‌లో జాను, విక్రమ్ మధ్య ఏం జరిగింది.. మొత్తం వీడియో రికార్డు చేసిన దివ్య

Intinti Gruhalakshmi 13 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 13 అక్టోబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1074 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా భర్త తప్పు చేస్తే.. ఆ శిక్షను నేను అనుభవిస్తాను. శిక్ష పడాలి అంటే నేరం రుజువు కావాలి కదా అంటుంది దివ్య. దీంతో బాధితురాలు చెబుతోంది కదా.. అంటాడు జాను తండ్రి. దానికోసం ఇప్పుడు ఆసుపత్రికి, కోర్టు చుట్టూ […]

 Authored By gatla | The Telugu News | Updated on :13 October 2023,9:00 am

Intinti Gruhalakshmi 13 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 13 అక్టోబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1074 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా భర్త తప్పు చేస్తే.. ఆ శిక్షను నేను అనుభవిస్తాను. శిక్ష పడాలి అంటే నేరం రుజువు కావాలి కదా అంటుంది దివ్య. దీంతో బాధితురాలు చెబుతోంది కదా.. అంటాడు జాను తండ్రి. దానికోసం ఇప్పుడు ఆసుపత్రికి, కోర్టు చుట్టూ తిరగాలా అంటుంది రాజ్య లక్ష్మి. ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ తిరగడం నాకు కూడా ఇష్టం లేదు. ఒకరకంగా నా భర్తను అది అవమానించడమే అంటుంది దివ్య. దీంతో మరి ఇంకెందుకు అమ్మా ఆలస్యం.. ఆ పసుపు తాడు ఏదో కట్టించేస్తే అయిపోతుంది కదా అంటాడు జాను తండ్రి. దీంతో నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వండి. నా భర్త నిర్దోషితత్వాన్ని నిరూపిస్తాను అంటుంది దివ్య. అప్పటికీ నమ్మకం కుదరకపోతే మీ ఇష్టం అంటుంది దివ్య. లోపలికి వెళ్లి ఫోన్ తీసుకొచ్చి ఒక రెండు నిమిషాల పాటు అందరూ కళ్లు పెద్దవి చేసుకొని ఈ వీడియో చూడండి. ఆ తర్వాత ఏం చేయాలో మీరే చెప్పండి అని ఫోన్ లో విక్రమ్ బెడ్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోను చూపిస్తుంది దివ్య.

అందులో నాకు మందు అలవాటు లేదు జాను. నువ్వు అడిగావని, బాధపడతావని తప్పనిసరై తాగాను అంటాడు విక్రమ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు విక్రమ్. విక్రమ్ కు ముద్దు పెట్టడానికి రాబోతుండగా వద్దు. నాకు ముద్దు పెట్టే అర్హత దివ్యకు మాత్రమే ఉంది అంటాడు విక్రమ్. అవును.. నువ్వు ఎక్కడ పడుకుంటావు అంటే.. నీ పక్కన అంటుంది జాను. దీంతో నా పక్కన పడుకునే హక్కు కేవలం దివ్యకు మాత్రమే ఉంది. నువ్వు గెస్ట్ వి కదా. నువ్వు బెడ్ మీద పడుకో. నేను కింద పడుకుంటాను అని చెబుతాడు విక్రమ్. తనను నిద్రపుచ్చి విక్రమ్ కింద అలాగే పడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి పిన్ని. పసుపు తాడు దానికి అవసరం ఉందా? మీరు చెప్పండి బాబాయి. అన్యాయం మీ కూతురుకు జరిగిందా? నా భర్తకు జరిగిందా? అని ప్రశ్నిస్తుంది దివ్య. లేనిపోని నిందలు వేశారు. తాగిన మత్తులో తప్పు జరిగిందేమో అనుకొని విక్రమ్ నిందలను మౌనంగా భరించాడు. నేను సాక్ష్యం చూపించకపోయి ఉంటే ఎంత మంది జీవితాలు నాశనమయ్యేవి. అత్తయ్య మీ బిడ్డకు మీరంటే ఇష్టం కాదు.. ప్రాణం అత్తయ్య. మీరిప్పుడు అడగండి.. తన గుండె తీసి మీ చేతుల్లో పెడతాడు. సముద్రంలో దూకమంటే ఎందుకూ అని అడగకుండా దూకేస్తాడు. అంత గుడ్డి ప్రేమ.. అంటుంది దివ్య.

intinti gruhalakshmi 13 october 2023 friday full episode

#image_title

Intinti Gruhalakshmi 13 Oct Today Episode : దివ్యకు థాంక్స్ చెప్పిన విక్రమ్

దేవుడి కంటే మిమ్మల్నే ఎక్కువగా నమ్ముతాడు. నిద్ర లేచినప్పటి నుంచి మిమ్మల్నే తలుచుకుంటాడు. కానీ.. దురదృష్టం ఏంటంటే మీకు మాత్రం మీ కొడుకు మీద నమ్మకం లేదు. అందరితో కలిసి గుడ్డిగా నిందలు వేశారు. నిజం కూడా తెలుసుకోకుండా శిక్ష వేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇదేనా మీకు మీ బిడ్డ మీద ఉన్న ప్రేమ అంటుంది దివ్య. దీంతో ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని అనుకున్నాం అంటుంది రాజ్యలక్ష్మి. ఇంకో ఆడపిల్ల మీద నిందలు వేయడానికి రెడీ అయ్యారు. మీ కొడుకును దోషిగా అందరి ముందు నిలబెట్టారు.

ఇప్పటి వరకు తనకు ఏ కష్టం వచ్చినా మీకే చెప్పుకునేవాడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటాడు. మీ దగ్గర న్యాయం జరుగుతుందన్న నమ్మకం విక్రమ్ మనసులో చచ్చిపోయి ఉంటుంది అంటుంది దివ్య. ఏదో పొరపాటు జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకొని నాకు, నా కొడుకు మధ్య మనస్పర్థలు క్రియేట్ చేయొద్దు దివ్య ప్లీజ్. వాడు దూరం అయితే నేను బతకలేను అంటుంది రాజ్యలక్ష్మీ.

దీంతో అమ్మ.. జరిగిందంతా పీడకలగా మరిచిపోదాం అంటాడు విక్రమ్. జాను నువ్వు ఎప్పటికీ నాకు ఇష్టమైన మరదలివే అంటాడు విక్రమ్. దీంతో సారీ బావ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జాను. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందని జాను మాటిచ్చింది. చివరకు హ్యాండిచ్చింది అని అనుకుంటాడు జాను తండ్రి.

మరోవైపు నందు.. రాజ్యలక్ష్మి ఇంటికి వస్తాడు. కోపంతో తన ఇంటికి వస్తాడు. అప్పుడే తనకు కాఫీ ఇవ్వబోతుండగా కాఫీని కింద పడేస్తాడు. పక్కనే ఉన్న తన భర్తపై దాడి చేస్తాడు. నీ పెళ్లానికి చెప్పు.. రెచ్చిపోతోంది. ఆడదానివని నీ పీక పట్టుకోకుండా నీ భర్త పీక పట్టుకున్నా అంటాడు నందు. దీంతో తప్పు చేసిన ఆ తులసి పీక పట్టుకునే దమ్ము లేదు. హనీని తీసుకొచ్చే ధైర్యం లేదు. సిగ్గు లేకుండా మా ఇంటి మీద దౌర్జన్యం చేస్తావా అంటుంది రాజ్యలక్ష్మీ.

నువ్వు తీసుకొచ్చి అప్పగించనంత మాత్రాన హనీని వెనక్కి తెచ్చుకోలేను అనుకుంటున్నావా? అంటుంది రాజ్యలక్ష్మి. మా నాన్నను కొట్టించావు. మా ఫ్యామిలీకి హాని తలపెట్టాలని అనుకుంటున్నావు. ఇంకా ఏం చేస్తావు అంటూ ప్రశ్నిస్తాడు నందు.

ఇంతలో అక్కడికి లాస్య వస్తుంది. లాస్యను చూసి షాక్ అవుతాడు నందు. ఇక్కడ కూడా తయారయ్యావా? అంటాడు నందు. చీ కొట్టినా సిగ్గు లేకుండా ఎందుకు వెంట పడుతున్నావు అంటాడు నందు. నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అర్జెంట్ గా మీరు ఈవిడను బయటికి పంపండి అంటాడు నందు. దీంతో నువ్వు ఇప్పుడు కండిషన్లు పెట్టే స్థితిలో లేవు.. అంటుంది లాస్య.

వాళ్లు నా క్లయింట్స్ అంటుంది. లాస్య ఇప్పుడు చాలా ముదిరిపోయింది. నాటు బాంబులు పేల్చే స్థాయికి వెళ్లింది. ఈజీగా తీసుకోకు. మీ నాన్న తల పగులగొట్టడం జస్ట్ శాంపిల్ మాత్రమే అంటుంది లాస్య. నీ ఫ్యామిలీ మీద అటాక్ చేయించాలంటే పెద్ద పనే కాదు అంటుంది లాస్య.

హనీ విషయంలో తులసికి ఎందుకు నచ్చజెప్పలేకపోతున్నావు అని అడుగుతుంది లాస్య. మనకు కావాల్సింది హనీని తిరిగి తెచ్చి ఇవ్వడం మాత్రమే అంటుంది రాజ్యలక్ష్మి. టైమ్ వేస్ట్ చేయకు.. వెళ్లి హనీని తీసుకొచ్చేయ్ అంటుంది లాస్య.

ఈసారి రత్న వచ్చి తులసి గొంతు పట్టుకుంటుంది. అంత దూరం తెచ్చుకోకు.. అని లాస్య చెప్పడంతో నందు కోపంతో వెళ్లిపోతాడు. మరోవైపు విక్రమ్ వెళ్లి దివ్యను గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు. ఏమైంది విక్రమ్ అంటుంది దివ్య. నా కోసం నేనే ఆలోచించుకోను. నా మీద నీకు ఇంత నమ్మకం ఎలా సాధ్యం దివ్య అని అడుగుతాడు విక్రమ్.

తప్పు చేసి ఉండను అని ఎలా అనుకున్నావు. ఏ నమ్మకంతో అందరి ముందు వాదించావు. వీడియోలో ఏముందో చూడకముందే జడ్జిమెంట్ ఇచ్చేశావు అంటాడు. తాగిన మత్తులో ఉన్నాను.. తప్పు చేసి ఉండొచ్చు అనుకోవచ్చు కదా.. అంటే తాగిన మత్తులో కూడా నువ్వు ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో అంటుంది దివ్య.

హనీ బొమ్మ వేస్తానంటే కదలకుండా కూర్చుంటుంది. ఇంతలో నందు వస్తాడు. నందుకు కోపం వస్తుంది. హనీని తీసుకొని గదిలోకి వెళ్లు అంటాడు. ఏమైంది అని అడుగుతాడు పరందామయ్య. చిన్న పిల్ల అని కూడా చూడకుండా హనీ మీద దౌర్జన్యం ఏంటి అంటుంది.

హనీ గురించి, రాజ్యలక్ష్మి గురించి మొత్తం చెబుతాడు నందు. దీంతో డైరెక్ట్ గా తులసి.. రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తుంది. హనీ గురించి ఆలోచించడం మానేయండి. నాకు హనీ ముఖ్యం, నా ఫ్యామిలీ అంతకంటే ముఖ్యం.. అంటుంది తులసి. లాస్యకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...