
intinti gruhalakshmi 14 september 2022 full episode
Intinti Gruhalakshmi 14 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 737 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాస్క్ చేస్తూ నిజంగానే తమ జీవితంలో ఇన్వాల్వ్ అయి నువ్వే తప్పు చేశావంటే నువ్వే తప్పు చేశావు అంటూ ప్రేమ్, శృతి ఇద్దరూ దెబ్బలాడుకుంటారు. దీంతో మీరు నటిస్తున్నారా.. లేక దెబ్బలాడుకుంటున్నారా అని అడుగుతుంది తులసి. దీంతో నటించాం అని అంటాడు ప్రేమ్. సూపర్ గా చేశారు అని అందరూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు మా తాతయ్య, నానమ్మ వంతు అంటుంది దివ్య. ఒక స్లిప్ తీయండి అంటుంది దివ్య. దీంతో పరందామయ్య ఒక స్లిప్ తీస్తాడు. ఒక హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేయాలి అని వస్తుంది. దీంతో కమాన్ డార్లింగ్ లెట్ అజ్ డ్యాన్స్ అంటాడు పరందామయ్య. ఇద్దరూ కలిసి రాను రాను అంటూనే చిన్నదో అనే పాటకు డ్యాన్స్ చేస్తారు. హుషారుగా డ్యాన్స్ చేస్తారు. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. దీంతో అందరూ చాలా సంతోషిస్తారు. విజిల్స్ వేస్తారు. క్లాప్స్ కొడతారు.
intinti gruhalakshmi 14 september 2022 full episode
ఆ తర్వాత చాన్స్ నందు, లాస్యకు వస్తుంది. నందు చిట్టీ తీస్తాడు. పాటకు డ్యాన్స్ చేస్తూ పార్టనర్ కు చేతుల్లోకి ఎత్తుకొని తిప్పాలి అని అందులో రాసి ఉంటుంది. వెంటనే ఇద్దరూ లేస్తారు. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలో చస్తున్నా అనే పాటకు నందు, లాస్య ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తారు. వాళ్లు డ్యాన్స్ వేస్తుంటే తులసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తనకు వాళ్ల డ్యాన్స్ చూడబుద్ధి కాదు. ప్రేమ్ కు కూడా చూడబుద్ధి కాదు. కానీ.. ఇద్దరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వా తనను ఎత్తుకొని కాసేపు అటూ ఇటూ తిరుగుతాడు నందు. ఆ తర్వాత అందరూ చప్పట్లు కొడతారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు అంటుంది దివ్య.
తులసి దగ్గరికి వెళ్లి ఒక చిట్టి తీయి అంటుంది దివ్య. అందులో తియ్యగా ఒక పాట పాడాలి అని ఉంటుంది. పాట తియ్యగా పాడాలి అంటే చెక్కర వేసుకోవాలా అంటుంది తులసి. దీంతో మీ మనసు తియ్యగా ఉంటే చాలు తులసి గారు అంటాడు సామ్రాట్.
ఆ తర్వాత ఒక పాత తెలుగు సాంగ్ ను పాడుతుంది తులసి. తు పాడుతుంటే అందరూ జాగ్రత్తగా వింటూ ఉంటారు. ఆ పాట పాడుతూ తన భర్తతో ఉన్న మెమోరీస్ ను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత తన పాట విని అందరూ సంతోషిస్తారు.
ఆ తర్వాత అంకుల్ మనం డ్యాన్స్ చేద్దామా అని అంటాడు లక్కీ. దీంతో చేద్దాం అంటాడు సామ్రాట్. ఇద్దరూ కలిసి కాసేపు డ్యాన్స్ చేస్తారు. డీజే టిల్లు పాటకు ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. వాళ్లతో పాటు హనీ కూడా డ్యాన్స్ చేస్తుంది.
ఆ తర్వాత సామ్రాట్ స్లిప్ తీస్తాడు. అందులో మీకు నచ్చిన కథ చెప్పాలి అని రాసి ఉంటుంది. దీంతో నేను చెప్పబోయేది కథ కాదు. కథ లాంటి నిజం. నిజం లాంటి కథ అంటాడు సామ్రాట్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు అంటాడు.
విఘ్నేశ్వరుడి మహిమలను తెలుసుకున్న రోజు. అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ఒక బాస్ కథ ఇది అంటాడు. బాస్ అంటే కేవలం బాసిజం చేసేవాడే కాదు. తనతో ఉండేవాళ్ల కష్టసుఖాలను, మంచి చెడ్డలను తెలుసుకొని సపోర్ట్ గా ఉండాలి.
తను చేసిందే నిజం అనుకోవద్దు. నా కథలో బాస్ గుడ్డివాడు. చెవిటివాడు. ఎదుటివాళ్లు చెప్పిందే నమ్మాడు కానీ.. నిజానిజాలు ఏంటో మాత్రం తెలుసుకోలేకపోయాడు. తన బిజినెస్ పార్టనర్ ను అర్థం చేసుకోకుండా ఇంటి మీదికి వెళ్లి రచ్చ చేస్తాడా అంటాడు సామ్రాట్.
పరువు, ఆత్మాభిమానం తనకే ఉంటాయా.. ఎదుటివాళ్లకు ఉండయా? తన బిజినెస్ పార్టనర్ ను తన మాజీ భర్త బతిమిలాడుకున్నాడు. తనే మాజీ భర్త అని ఆఫీసులో తెలియనీయొద్దని చెప్పాడు అంటాడు సామ్రాట్.
ఆ మాజీ భర్త మీద జాలితో తన మాటకు కట్టుబడి ఉంది. నిందను భరించింది. బాస్ ఆగడాలను సహించింది. కానీ మాజీ భర్తను మాత్రం ఎక్స్ పోజ్ చేయలేదు. నూటికో, కోటికో ఉంటారు.. ఇలాంటి మంచివాళ్లు.
చేసిన తప్పుకు ఆ మాజీ భర్త ఆమె కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పినా తక్కువే అంటాడు సామ్రాట్. ఆ బిజినెస్ మ్యాన్ తప్పున ఆ మహాతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అంటాడు సామ్రాట్.
దీంతో కోపంతో లేచి లక్కీని తీసుకొని నందు, లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. తులసి గారు.. ఈ బాస్ చేసిన తప్పులను క్షమిస్తూ రేపు ఆఫీసుకు రండి అంటాడు సామ్రాట్. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బై అని చెప్పి లక్కీని తీసుకొని సామ్రాట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో దేవుడి దగ్గర కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని వినాయకుడికి మొక్కుకుంటుంది తులసి.
కట్ చేస్తే తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి కన్ స్ట్రక్షన్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ గుంతలు ఉండటంతో తులసిని చేతుల్లో తీసుకొని తనను గుంత దాటిస్తాడు సామ్రాట్. అక్కడే ఉన్న లాస్య, నందు వాళ్లను చూసి అబ్బో అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.