Intinti Gruhalakshmi 18 March Today Episode : ప్రేమ్ బర్త్ డే.. బాబూరావుకు తన భార్య కోటింగ్.. ఆటో నడిపి డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయిన ప్రేమ్.. శృతి ఒప్పుకుంటుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 18 March Today Episode : ప్రేమ్ బర్త్ డే.. బాబూరావుకు తన భార్య కోటింగ్.. ఆటో నడిపి డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయిన ప్రేమ్.. శృతి ఒప్పుకుంటుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :18 March 2022,9:30 am

Intinti Gruhalakshmi 18 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 583 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 10 లక్షలు తీసుకొని బిజినెస్ పెట్టి లాస్ వచ్చిందని చెప్పి ఇప్పుడు ఖాళీగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నీతో పాటు నేను కూడా బాధపడాలా అని బాబురావును తిడుగుతుంది తన భార్య. కడుపు కాలుతున్నప్పుడు ఆలోచించాల్సింది పరువు గురించి కాదు.. కడుపు నింపుకోవడం గురించి అంటుంది తన భార్య. ఆంటి.. మీరు చెప్పారు కదా.. బాబాయి ఇక నుంచి ఎలాంటి పొరపాట్లు చేయరు అంటుంది శృతి. నేను కష్టపడతాను.. అంటాడు బాబురావు. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సర్దుకుపోతే కాపురం సాఫీగా నడుస్తుంది అంటుంది శృతి.

intinti gruhalakshmi 18 march 2022 full episode

intinti gruhalakshmi 18 march 2022 full episode

సరేమ్మా.. వెళ్లొస్తాం.. పదండి అంటుంది తన భార్య. బాబూరావును తీసుకొని వెళ్తుంది. అయితే.. ప్రేమ్ తను మాట్లాడిన మాటలకు చలించిపోతాడు. ఆలోచనలో పడతాడు. నీకు ఆంటీలో కోపం కనిపిస్తోంది కానీ.. తన కూతురు ఎక్కడ దారి తప్పుతుందో అని తెలియడం లేదా అని దివ్యను నిలదీస్తుంది అంకిత. అదేదో తప్పు చేసిందని అందరూ తనకు మామ్ లా క్లాస్ లు పీకుతున్నారా అంటాడు అభి. నన్ను అందరూ విసిగిస్తున్నారు అంటుంది దివ్య. నువ్వు కూడా దివ్యను చెడగొడుతున్నావు ఎందుకు అభి అంటుంది అంకిత. నాకు ఇప్పుడు ఎవ్వరి మాటలు వినాలని లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.. అని చెప్పి దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

విన్నావు కదా అది ఏం చెప్పిందో అంటాడు అభి. దివ్య చెప్పడం కాదు.. దగ్గరుండి నువ్వే అనిపిస్తున్నావు అంటుంది అంకిత. మరోవైపు ప్రేమ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాములమ్మ వచ్చి.. ప్రేమ్ బాబు మీకు ఇష్టమని జున్ను తీసుకొచ్చాను అంటుంది రాములమ్మ.

కానీ.. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని తినడు. నా ఇష్టాల మీదనే నాకు విరక్తిగా ఉంది రాములమ్మ అంటాడు. నా వాళ్లు అంటే నాకు ఇష్టం. కానీ.. నేను ఇప్పుడు అందరికీ దూరంగా ఉన్నాను. చివరకు శృతి అంటే కూడా ఇష్టం. కానీ.. తనను కూడా నాతో పాటే ఇబ్బంది పెడుతున్నాను అంటాడు ప్రేమ్.

మీ బస్తీలో అద్దెకు ఆటో దొరుకుతుందని చెప్పావు కదా. ఇప్పిస్తావా.. నడుపుకుంటాను అంటాడు ప్రేమ్. దీంతో కార్లలో తిరగాల్సిన వాడివి.. నువ్వు ఆటో నడుపుకోవడం ఏంటి బాబు.. వద్దు అంటుంది రాములమ్మ. కానీ.. నాకు ఇష్టమైన సంగీతం ఇప్పుడు నాకు అవకాశాలు ఇవ్వలేనప్పుడు మనం వేరే దారి వెతుక్కోవాలి కానీ.. ప్రయాణం ఆపకూడదు అనే నిజం ఇప్పుడే తెలుసుకున్నాను రాములమ్మ అంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi 18 March Today Episode : శృతికి చెప్పకుండా.. ఆటో నడపుతానని రాములమ్మతో చెప్పిన ప్రేమ్

మీరు ఆటో నడపడం నాకు ఇష్టం లేదు బాబు కానీ.. మీకోసం మాట్లాడుతా అంటుంది రాములమ్మ. మరి.. శృతి అమ్మకు ఈ విషయం చెప్పారా అని అడుగుతుంది రాములమ్మ. దీంతో చెప్పలేదు అంటాడు ప్రేమ్. ఇంతలో శృతి వచ్చి.. ఏంటి శృతికి చెప్పొద్దు అంటున్నావు అంటుంది శృతి.

పెళ్లానికి తెలియకుండా ఏం సీక్రెట్ దాచిపెడుతున్నావు అని అడుగుతుంది శృతి. నిన్నే అడుగుతున్నాను ప్రేమ్.. ఏంటి నాకు అంతగా చెప్పకూడని విషయం అంటుంది. చెప్పరా.. సరే నేనే వెళ్తాను అంటుంది. అయితే.. నేను చెబుతాను అమ్మ. జున్ను తెచ్చాను.. మొత్తం నేనే తినేస్తాను.. శృతికి చెప్పకు అంటున్నాడు అంటుంది రాములమ్మ.

దీనికే ఇంత సీన్ అవసరమా. నీకు జున్ను ఇష్టం అనే విషయం నాకు తెలుసు ప్రేమ్. ఒకవేళ నాకు ఇచ్చినా కూడా నీకే పెట్టేదాన్ని అని అంటుంది శృతి. దీంతో ప్రేమ్ సంతోషిస్తాడు. పిల్లలు బాధపడితే ఓదార్చడానికి అమ్మ ఉంది. మరి.. అమ్మే బాధపడితే ఓదార్చడానికి ఎవరు ఉన్నారు అత్తయ్య అని అనసూయతో అంటుంది తులసి.

బయట వాళ్లు ఎలాంటి మాటలు అన్నా మనసు పట్టించుకోదు. అదే.. మన అనుకున్న వాళ్లు చిన్న మాట అన్నా తట్టుకోలేదు. ఇప్పుడు నా సంఘర్షణ అదే అత్తయ్య. దివ్య నన్ను పూర్తిగా పరాయిదాన్ని చేసింది అని అంటుంది తులసి.

దివ్యను నా దారిలోకి తెచ్చుకోవడానికి లేకుండా లాస్య అడ్డం పడుతోంది అంటుంది తులసి. దీంతో నందును ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెబుదాం అంటుంది అనసూయ. ఎలాగైనా ఆ లాస్యను వదిలించుకోవాలంటే.. నందును ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అంటుంది అనసూయ.

దీంతో.. వద్దు అత్తయ్య.. ఇప్పటికే అయిన గొడవలు చాలు.. అంటుంది తులసి. మరోవైపు అర్ధరాత్రి శృతి క్యాండిల్స్ వెలిగించి ప్లమ్ కేక్ తెచ్చి హ్యాపీ బర్త్ డే చెబుతుంది. దీంతో సంతోషిస్తాడు ప్రేమ్. ఆ తర్వాత కేక్ తినిపిస్తుంది. నా బర్త్ డే మరిచిపోయావని అనుకున్నా అంటాడు ప్రేమ్.

దీంతో నా జీవితంలో నిన్ను, నీ మాటలను, నీ బర్త్ డేను ఎప్పటికీ మరిచిపోను అంటుంది శృతి. ఒక్క ప్రేమను తప్ప ఇంకేం ఆలోచించకుండా జీవితాంతం భర్త కోసం బతికేదే భార్య.. నేను అలాంటి భార్యనే అంటుంది శృతి. దీంతో తన లాస్ట్ ఇయర్ బర్త్ డేను గుర్తు చేసుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది