Intinti Gruhalakshmi 18 Nov Today Episode : నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ అంతు చూస్తా అంటూ నందును బెదిరించిన లాస్య.. అందరి ముందు నందుకు అవమానం
Intinti Gruhalakshmi 18 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 480 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. రూమ్ లో దగ్గరుండి చూసుకుంటాడు నందు. తనకు మెడిసిన్ వేస్తాడు. సిరప్ తాగిస్తాడు. తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మరోవైపు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అందరూ తులసికి ఏమైందో అని తెగ టెన్షన్ పడుతుంటారు. రాత్రంతా నిద్రపోకుండా తులసిని కంటికి రెప్పలా చూసుకుంటాడు నందు.

intinti gruhalakshmi 18 november 2021 full episode
తులసికి ఏం కాకూడదని దేవుడిని మొక్కుకుంటుంది అనసూయ. అర్ధరాత్రి అయినా ఎవ్వరూ నిద్రపోరు. నానమ్మ నువ్వు, తాత వెళ్లి పడుకోండి.. అని చెప్పి వాళ్లను పడుకోబెడతారు. తర్వాత ప్రేమ్, అభి ఇద్దరూ టెన్షన్ పడతారు. రాత్రి పూట తులసికి ఫుడ్ తీసుకొస్తాడు నందు. తనకు తినిపిస్తాడు. నందు తనమీద చూపిస్తున్న ప్రేమకు పరవశించిపోతుంది తులసి. మరోవైపు లాస్యకు టెన్షన్ ఎక్కువవుతుంది. నందుకు ఫోన్ చేస్తుంటుంది కానీ.. నందు ఫోన్ కట్ చేస్తుంటాడు.
అయినా రిపీటెడ్ గా ఫోన్లు చేస్తుంటుంది లాస్య. కానీ.. అలసిపోయి నందు నిద్రపోతాడు. తులసి కూడా నిద్రపోతుంది. ఉదయం అయ్యాక తులసి రికవరీ అవుతుంది. నందు కింద పడుకోవడం చూసి బాధపడుతుంది. అయ్యో.. నాకోసం నందు ఇంత చేశాడా అని అనుకుంటుంది. ఏమండి అని పిలుస్తుంది.. తులసి లేచావా.. ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటాడు.
సరే.. ఆసుపత్రికి వెళ్దాం టెస్టుల కోసం అంటాడు నందు. వద్దండి.. ఇంటికి వెళ్దాం నేను బాగానే ఉన్నాను అంటుంది తులసి. మరోవైపు తులసి, ప్రేమ్.. సరసాలు ఆడుతుంటారు. మన సరసాలు తర్వాత వెళ్లి ఆంటి వాళ్లను పికప్ చేసుకోపో అంటుంది శృతి. కాసేపు ఇద్దరూ ఇంట్లో సరసాలు ఆడుకుంటారు. సరదాగా గడుపుతారు.
నా కోడలు ఇంటికి వస్తోంది. ఇంటి తింటి కావాలి. తనకు మంచి ఫుడ్ వండి పెట్టు అంటూ రాములమ్మకు వార్నింగ్ ఇస్తుంది అనసూయ. దీంతో అనసూయ నోరెళ్లబెడుతుంది. మాట్లాడుతోంది మీరేనా అని అనుకుంటుంది రాములమ్మ. ఏంటి అమ్మమ్మ ఇన్ని షాకులు అని శృతి అంటుంది.
Intinti Gruhalakshmi 18 Nov Today Episode : ఇంటికి తిరిగి వచ్చిన నందు, లాస్య
ఇంతలోనే నందు, తులసి.. ఇంటికి తిరిగి వస్తారు. ఎలా ఉంది అని అందరూ తులసి బాగోగులు అడుగుతారు. తులసి మాత్రం రాగానే అనసూయను చూస్తుంది. అనసూయ కూడా ఎప్పుడు వెళ్లి తనతో మాట్లాడాలా అనుకుంటుంది.
ఇంతలో అనసూయ తులసి దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నావమ్మా తులసి అని అడుగుతుంది. బాగానే ఉన్నాను అత్తయ్య అంటుంది తులసి. రాములమ్మ బ్యాగు లోపల పెట్టు. పదమ్మా లోపలికి వెళ్దాం అంటుంది అనసూయ. అనసూయలో వచ్చిన మార్పును చూసి అందరూ షాక్ అవుతారు.
తొలిసారి ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం ఇంత సంతోషంగా ఉండటం చూసి లాస్య తట్టుకోలేదు. వెంటనే రెచ్చిపోతుంది. అప్పుడే లోపలికి వస్తున్న నందును అందరి ముందే నిలదీస్తుంది. ఈ ఇంట్లో నా స్థానం ఏంటి అని నిలదీస్తుంది.
అది ఇప్పుడే, ఇక్కడే తెలియాలి.. అని నందును అడుగుతుంది. తర్వాత అనే పదం నాకు వినపడకూడదు. ఇప్పుడే మ్యాటర్ తేలిపోవాలి అంటుంది. ఇక నేను ఆగలేను. అందరి ముందు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు అని నందును కడిగేస్తుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.