Intinti Gruhalakshmi 2 Oct Today Episode : ప్రేమ్ ను శృతి ప్రేమిస్తోందనే విషయం అక్షరకు తెలుస్తుందా? లాస్య అసలు గుట్టును కూడా అక్షర కనిపెడుతుందా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 October 2021,12:15 pm
intinti gruhalakshmi 2 october 2021 full episode

intinti gruhalakshmi 2 october 2021 full episode

Intinti Gruhalakshmi 2 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 2 అక్టోబర్ 2021, శనివారం ఎపిసోడ్ 440 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, అక్షర ఎంగేజ్ మెంట్ పూర్తవుతుంది. జీకేకు ఢిల్లీ వెళ్లే అవసరం ఉండటంతో.. ఢిల్లీ వెళ్లి వచ్చేసరికి నేను ప్రేమ్ ఇంట్లో ఉంటా అని చెబుతుంది అక్షర. దీంతో జీకే సరే అంటాడు. ఎంగేజ్ మెంట్ పూర్తికాగానే.. అక్షర.. ప్రేమ్ ఇంటికి వచ్చేస్తుంది.

అక్షర వచ్చి.. శృతి రూమ్ లో ఉంటానని చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. శృతి రూమ్ లో ఉంటావా? అంటారు. శృతి రూమ్ పెద్దది కాదు అని అందరూ అంటారు. అయినా కూడా వినదు అక్షర. శృతి రూమ్ లోనే ఉంటాను అంటుంది. తులసి కూడా ఓకే చెబుతుంది. లాస్య, నందు షాక్ అవుతారు.

intinti gruhalakshmi 2 october 2021 full episode

intinti gruhalakshmi 2 october 2021 full episode

అక్షర ఏంటి.. శృతి రూమ్ లో ఉంటానంటుంది. శృతి ఏం వాగదు కదా అని భయపడుతాడు నందు. లాస్య కూడా అదే భయపడుతుంది. శృతి ఏమైనా వాగితే ఇక అంతే అని అనుకుంటుంది లాస్య.

అక్షరను తన రూమ్ కు తీసుకెళ్తుంది శృతి. నీ రూమ్ బాగుంది అని చెబుతుంది అక్షర. ఇక్కడి మనుషులు అందరూ నచ్చారు. నువ్వు, ప్రేమ్ నాకు బాగా నచ్చారు అంటుంది. అయితే.. తన రూమ్ లో ప్రేమ్ ఫోటో ఉంటుంది. బెడ్ మీద ఉంటుంది. ఆ ఫోటోను అక్షర ఎక్కడ చూస్తుందోనని టెన్షన్ పడుతుంది శృతి.

అన్నట్టుగానే ప్రేమ్ ఫోటోను చూస్తుంది అక్షర. ప్రేమ్ ఫోటోను చూసి షాక్ అవుతుంది అక్షర. ఈ ఫోటో.. అని అనగానే అక్షర అది ఇది అని శృతి చెప్పబోతుండగా.. అవును ఈ ఫోటో బాగుంది అంటుంది అక్షర.

Intinti Gruhalakshmi 2 Oct Today Episode : మీరిద్దరు ఎందుకు విడిపోయారు అని నందు, తులసిని అడిగిన అక్షర

అక్షర.. నువ్వు ఏ విషయంలోనూ మొహమాపడకు.. అంటాడు నందు. నేను కాసేపు సమయం గడిపానంటే.. నేను అందరితో క్లోజ్ అవుతా అంటుంది అక్షర. అంకుల్ మీరు, ఆంటి ఎందుకు విడిపోయారు అని అడుగుతుంది అక్షర. దీంతో నందు ఏం మాట్లాడడు. అదేంటి అందరూ సైలెంట్ అయ్యారు అంటుంది.

intinti gruhalakshmi 2 october 2021 full episode

intinti gruhalakshmi 2 october 2021 full episode

ఏం లేదు.. ఇద్దరికీ సెట్ అవలేదు అందుకే విడిపోయారు అంటుంది అంకిత. సెట్ అవలేదు అంటే ఏ విషయంలో.. కారణం ఉండాలి కదా అంటుంది అక్షర. తులసి ఆంటీని వద్దు అనుకోవడానికి.. లాస్య ఆంటిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి బలమైన కారణం ఉండాలి కదా.. అంటుంది అక్షర.

ఇందులో బలమైన కారణం అంటూ ఏముంటుంది అక్షర.. తులసి ఆంటి చదువుకోలేదు.. ఏ పని చేతగాదు అంటుంది. కానీ.. లాస్య చదువుకుంది.. అన్ని పనుల్లో మామయ్యకు సాయపడుతుంది.. అంటుంది అంకిత. అంత చిన్న విషయానికి విడిపోయారా.. అంటుంది. ఇంట్లో పనులకైతే ఓకే కానీ.. ఆఫీసులో పనులు లాస్య చేస్తుంది అంటే.. ఆఫీసులో చేసే పనికి పీఏను పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటుంది అక్షర.

intinti gruhalakshmi 2 october 2021 full episode

intinti gruhalakshmi 2 october 2021 full episode

లాస్యను అంకిత పొగిడేసరికి.. లాస్యను ఎక్కువగా పొగిడేస్తున్నారు అంటుంది అక్షర. మీరు చెప్పినవన్నీ చేసేందుకు పీఏ చాలు.. దానికి పెళ్లి అవసరం లేదు అంటుంది అక్షర. దీంతో లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కోపం వచ్చిన తులసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

లాస్య.. తన రూమ్ లోకి వచ్చి చిరాకుగా ఉంటుంది. ఎందుకైనా మంచిది.. ఆ అక్షరతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని లాస్యతో చెబుతాడు నందు. తర్వాత.. తులసితో మాట్లాడుతుంది అక్షర. ఎప్పుడు చూసినా దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఆంటి.. అంటుంది. ఇంతలో శృతి అక్కడికి వస్తుంది. ముగ్గురూ కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుతుంటారు. ప్రేమ్ గురించి అన్ని విషయాలు తులసిని అడుగుతుంది అక్షర.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి