Intinti Gruhalakshmi 20 Oct Today Episode : అక్షరనే నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది అని అన్న శృతి.. షాక్ అయిన ప్రేమ్
Intinti Gruhalakshmi 20 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 20 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత.. ప్రేమ్ తో గొడవ పెట్టుకుంటుంది. ఇంతలో తులసి వచ్చి.. ప్రేమ్ నేనంతా విన్నాను. నాకేమీ చెప్పక్కర్లేదు. ఈ కొద్ది రోజుల్లో శృతిని తను ఎలా అర్థం చేసుకుంటుంది. తనకు కొంచెం టైమ్ ఇవ్వు. ఇంకెప్పుడు మీ వదినతో అలా మాట్లాడకు. సారీ చెప్పు.. అని అంటుంది తులసి. దీంతో ప్రేమ్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రేమ్ తెలిసీ తెలియక కోపంలో అలా మాట్లాడాడు. నువ్వు అవేమీ పట్టించుకోకు.. అని తులసి చెప్పి వెళ్లిపోతుంది. శృతి ఈ ఇంట్లో చేరగానే నేను చెడ్డదాన్ని అయిపోయాను అని అభితో అంటుంది అంకిత.

intinti gruhalakshmi 20 october 2021 full episode
కట్ చేస్తే నందు తన అప్పు గురించి, ప్రేమ్ పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి ఏమైంది నందు.. మన అప్పులను తులసి మీదికి తోసేశాం కదా.. ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు.. అంటుంది. మన అప్పు తులసి ఎందుకు తీర్చాలి అని అంటాడు నందు. అసలు ఇన్ని పరిచయాలు ఉండి కూడా నేను అంత అప్పు కట్టలేకపోతున్నాను. ఎటువంటి పరిచయం లేని తులసి ఎలా కడుతుంది అని అంటాడు నందు. తులసి ఎలా కడితే మనకెందుకు.. తల తాకట్టు పెట్టి కడుతుంది అని అంటుంది లాస్య.
మరోవైపు తులసి డబ్బులు ఎలా కట్టాలి అని టెన్షన్ పడుతుంది. ఇంతలో లాస్య వచ్చి.. నువ్వు గ్రేట్ తులసి.. నువ్వు అనుకున్నదే జరుగుతోంది కదా. ఎందుకు మరి అంత దిగులుగా ఉన్నావు అంటుంది. నేను వెక్కి వెక్కి ఏడిస్తే.. వచ్చి ఓదార్చుదామని అనుకున్నావా.. అని అంటుంది తులసి. నా కొడుకుకు నువ్వు స్వార్థంతో పెళ్లి చేయాలని అనుకున్నారు. నేనేమీ ఎవ్వరి మీద గెలవలేదు. నీకు తల్లి మనసు ఎలా తెలుస్తుందిలే.. అని అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 20 Oct Today Episode : నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు.. అని ప్రేమ్ ను అడిగిన శృతి
మరోవైపు శృతి పరధ్యానంలో ఉంటుంది. ప్రేమ్ కూడా మూడ్ ఆఫ్ లో ఉంటాడు. ఏ కోడలు అయినా అత్తారింట్లో సంతోషంగా కుడికాలు పెట్టి రావాలని అనుకుంటుంది. కానీ.. నేను కుడికాలు పెడుతూనే ఈ ఇంట్లో సంతోషాలను దూరం చేస్తున్నాను అని అనిపిస్తోంది. నాకు జీవితంలో ఏదీ కలిసి రాదు. మంచో చెడో నీ పెళ్లికి నేను దూరంగా ఉన్నాను. నన్ను ఇలాగే వదేలేయాల్సింది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి.. అంటుంది శృతి.

intinti gruhalakshmi 20 october 2021 full episode
అక్షరతో నీ పెళ్లి జరిగి ఉంటే.. అంకుల్ అప్పులు తీరి ఉండేవి కదా. ఆంటీకి కూడా అప్పుల బాధ ఉండేది కాదు కదా అంటే.. అక్షరను పెళ్లి చేసుకొని ఉంటే నేను లైఫ్ లాంగ్ నిన్ను తలుచుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది కదా అని అంటాడు ప్రేమ్. బంధాల కోసం వెంపర్లాడుతూ.. అన్ని బాధ్యతలను నెత్తిన వేసుకుంటోంది అమ్మ.. అని అంటాడు ప్రేమ్. మరోవైపు నందుపై మరోసారి సీరియస్ అవుతుంది తులసి. ఇంటి యజమానిగా నేను తీసుకునే నిర్ణయంలో ఏది తీసుకున్నా ఫైనల్ అని అంటాడు నందు. మీరు తీసుకునేవి సరైనవే అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.