Intinti Gruhalakshmi 21 June Today Episode : లాస్యపై ఉగ్రరూపం దాల్చిన తులసి.. దీంతో నందు, లాస్య, గాయత్రి షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 21 June Today Episode : లాస్యపై ఉగ్రరూపం దాల్చిన తులసి.. దీంతో నందు, లాస్య, గాయత్రి షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :21 June 2022,9:30 am

Intinti Gruhalakshmi 21 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 664 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత.. అభి గురించే ఆలోచిస్తూ ఉండటం చూసిన దివ్య.. తనను నవ్వించాలనుకుంటుంది. పరందామయ్య, అనసూయకు కూడా అదే చెబుతుంది. ఫోన్ తీసుకెళ్లి ఓ వీడియో చూపించి అంకితను నవ్వించే ప్రయత్నం చేస్తుంది కానీ.. అంకిత నవ్వదు. దీంతో ఏం చేయాలో దివ్యకు అర్థం కాదు. అనసూయ వచ్చి తనను నవ్వించే ప్రయత్నం చేస్తుంది కానీ.. తను మాత్రం అస్సలు నవ్వదు. తర్వాత పరందామయ్య వస్తాడు. తనను నవ్వించేందుకు విచిత్రమైన వేషధారణ వేసుకొని వస్తాడు కానీ.. తను మాత్రం నవ్వదు. ఆ తర్వాత అందరూ కలిసి తులసి దగ్గరికి వెళ్తారు. వాళ్ల వేషధారణ చూసి తులసి విచిత్రంగా చూస్తుంది. అభి అన్నయ్యనే ఆలోచిస్తూ వదిన డల్ గా కూర్చొంది. మేము ఎంత నవ్వించడానికి ట్రై చేసినా అస్సలు నవ్వడం లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి వదినను నవ్వించాలి అని చెబుతుంది దివ్య.

intinti gruhalakshmi 21 june 2022 full episode

intinti gruhalakshmi 21 june 2022 full episode

దీంతో తులసి.. అంకిత దగ్గరికి వెళ్లి ఒక జోక్ చెబుతుంది. అయినా కూడా అంకిత నవ్వదు. చివరకు ఏదో హెల్మెట్ గురించి తులసి చెప్పగానే అంకిత పక్కున నవ్వుతుంది. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అని అంటుంది తులసి. మరోవైపు తులసి అంటూ కోపంగా నందు తనను వచ్చి పిలుస్తాడు. నందుతో పాటు గాయత్రి, లాస్య కూడా అక్కడికి వస్తారు. తులసి చాలా తప్పు చేస్తున్నావు. గొడవ ముదరకముందే అంకితను గాయత్రితో తన ఇంటికి పంపించు అంటాడు. దీంతో నేను పిలిస్తే తను రాలేదు. తనను వెళ్లు అనే అధికారం కూడా నాకు లేదు అంటుంది. దీంతో వావ్.. ఏం మాట్లాడుతున్నావు. నీకు ఉన్న తెలివిని నాకు కూడా నేర్పించు.. అంటుంది లాస్య. తనను హేళన చేస్తుంది. మహారాణి గారు తలుచుకున్నారు కాబట్టే అందరూ ఎవరి దారి చూసుకున్నారు. ఆవిడ గారి పెద్ద కొడుకు, పెద్ద కోడలు గడప దాటి ఎందుకు వెళ్లారు.. మహారాణి గారు కోరుకున్నారు కాబట్టే కదా అంటుంది లాస్య.

చూడండి మహారాణి గారు.. మీ పెద్ద కోడలు ఈ ఇంటి గడప తొక్కడానికి వీలు లేదంటూ పబ్లిక్ గా అందరి ముందు శాసనం చేశారు కదా. అలాంటిది.. ఆఫ్టర్ ఆల్ ఒక పిల్ల కాకి మీ మాటను కాదని మీ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిందంటే మిమ్మల్ని ఎలా నమ్మమంటారు అంటుంది లాస్య.

అంకిత రాకకు మీకు సంబంధం లేదంటే నిజం అని ఎలా నమ్మమంటారు. ముసుగు తీసేయండి.. నాటకాలు వద్దు అంటుంది లాస్య. దీంతో నాటకాలు ఆడకుండానే తమరు ఆ నందగోపాల్ కు దగ్గరయ్యారా? నాటకాలు ఆడకుండానే మీరు ఈ ఇంటి కోడలు అయ్యారా? నాటకాలు ఆడకుండానే మీ ఆయన చేయి పట్టుకొని వెళ్లిపోయారా? నాటకాల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 21 June Today Episode : నందు బండారం బయటపెట్టిన తులసి

తులసి మాట మార్చకు అని నందు అనడంతో ఎందుకు మీ బండారం బయటపెడతాననా అంటుంది తులసి. నా అంగీకారం లేకుండానే అంకిత ఇక్కడికి వచ్చింది అంటుంది తులసి. మరి అయితే తనను మెడ పట్టుకొని బయటికి గెంటేయొచ్చు కదా అని గాయత్రి అంటే అది మీ సంస్కారం అంటుంది తులసి.

నేను కోరుకున్న ప్రేమ దొరకక నాకు కావాల్సిన ప్రేమను వెతుక్కుంటూ నేను వచ్చేశాను అంటుంది అంకిత. దీంతో ఈ ఇంట్లో వాళ్లు కేవలం నీ డబ్బును చూసి నిన్ను ఆదరిస్తున్నారు అంటుంది గాయత్రి. డబ్బు లేకుండా మీ జీవితాలే గడవవు. అలాంటిది.. నేను డబ్బు గురించి మాట్లాడితే మీకు వెటకారంగా ఉందా అంటుంది గాయత్రి.

ముందు మీరు మర్యాదలు నేర్చుకోండి తర్వాత నాకు బుద్ధి చెబుదురు కానీ అంటుంది గాయత్రి. దీంతో గాయత్రి అంటూ సీరియస్ గా మాట్లాడుతుంది తులసి. పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. వాళ్ల వయసుకు గౌరవం ఇవ్వు అంటుంది తులసి.

దీంతో ఇదే మాట నీ పెద్ద కోడలుకు కూడా చెప్పు. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి మా ఇంటికి పంపించొచ్చు కదా. నీకు మా తప్పులే తప్పు అంకిత చేసే తప్పులు కనిపించడం లేదా.. తనకు బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెనకేసుకొస్తున్నావు అంటుంది గాయత్రి.

ఇంతలో అభి అక్కడికి వస్తాడు. బిడ్డలను ప్రేమించే తల్లులను చూశాం కానీ.. కోడళ్లను బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిని నిన్నే చూస్తున్నా. నువ్వు నీ కోడలును ప్రొటెక్ట్ చేస్తలేవు.. నీ కోడలు జీవితాన్ని నాశనం చేస్తున్నావు అంటాడు అభి. నువ్వు పడ్డ కష్టాలన్నీ నీ కోడలు కూడా పడాలనుకుంటన్నావు అంటాడు అభి.

తను తన మొగుడికి విడాకులు ఇచ్చి.. నీలాగే ఒంటరి బతుకు బతికేలా చేస్తున్నావు. ఇంకో తులసిని తయారు చేస్తున్నావు. నీ మెండితనాన్నే నేర్పిస్తున్నావు అని తులసిని నిలదీస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది