Intinti Gruhalakshmi 23 June Today Episode : తులసి అరెస్ట్.. 20 లక్షలు కాజేసి కంపెనీ పెట్టిన లాస్య.. తులసి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ప్రేమ్ ఆల్బమ్ కల నెరవేరదా?

Intinti Gruhalakshmi 23 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 666 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి పిల్లలకు ఎండ పడకుండా ఉండేందుకు పైన టెంట్ కడుతూ ఉంటుంది. తను నిచ్చెనతో పైకి ఎక్కడం చూసి కుటుంబ సభ్యులు అందరూ భయపడతారు. నువ్వు అలా పైకి ఎందుకు ఎక్కావు. కిందికి దిగు ముందు అని అంటారు. నువ్వు ఒక్కదానివే ఎందుకు అంత కష్టపడుతున్నావు. మిమ్మల్ని కూడా పిలిస్తే సాయం చేసేవాళ్లం కదా అంటారు. మన తలరాత బాగోలేకపోతే ఏం చేస్తాం. నువ్వు కింద పడితే ఇంకా ఏమైనా ఉందా అని అంటుంది అనసూయ. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటుంది అనసూయ. ఇక.. ఏం చేయాలో చెబితే మేమంతా తలో చేయి వేస్తాం అంటారు. అందరూ కలిసి టెంట్ వేసేందుకు పనులు చేస్తారు.

Advertisement
intinti gruhalakshmi 23 june 2022 full episode
intinti gruhalakshmi 23 june 2022 full episode

ఇంతలో బ్యాంకు ఏజెంట్స్ వస్తారు. వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్లి మ్యూజిక్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాం అని చెబుతారు. దీంతో దర్జాగా తీసుకోండి. దానిలో ఏముంది అని అంటాడు బ్యాంక్ ఏజెంట్. ఎంత లోన్ వస్తుంది ఈసారి అని అడుగుతుంది అంకిత. దీంతో మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి అంటాడు. మాకు ఇన్ కమ్ ఏం లేదు కదా.. ఎలా ఇస్తారు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో మీకు మంచి పేరు ఉంది కదా.. అంటాడు బ్యాంక్ ఏజెంట్. తులసి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మళ్లీ వస్తాం అని చెప్పి బ్యాంక్ ఏజెంట్స్ వెళ్లిపోతారు. 20 లక్షల లోన్ రాగానే ముందు 5 లక్షలు ప్రేమ్ కు ఇవ్వాలి అని అనుకుంటుంది తులసి.

మరోవైపు ప్రేమ్ సంతోషంతో ఇంటికి వస్తాడు. శృతి అని పిలుస్తాడు. కానీ.. తను ఇంట్లో ఉండదు. అప్పుడే బయటి నుంచి బిందెలో మంచినీళ్లు తీసుకొస్తూ ఉంటుంది. తనను చూసి అదేంటి నువ్వు నీళ్లు తీసుకొస్తున్నావు ఇటు ఇవ్వు అంటూ తను బిందె తీసుకొని కింద పెడతాడు.

తర్వాత నాకు బంపర్ ఆఫర్ దొరికింది అంటాడు ప్రేమ్. నాకు ఒక షాపు అతడు పరిచయం అయ్యాడు. 25 శాతంలో అన్ని ఇన్ స్ట్రుమెంట్స్ ఇస్తా అన్నాడు అని చెబుతాడు ప్రేమ్. కానీ.. డబ్బు దొరకలేదని ప్రేమ్ కు ఎలా చెప్పాలో శృతికి అర్థం కాదు. నీ ఫ్రెండ్ కు ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు అరేంజ్ చేస్తారో అడుగు అంటూ ఫోన్ తెచ్చి ఇస్తాడు ప్రేమ్.

కానీ.. ఎవరికి ఫోన్ చేయాలో శృతికి అర్థం కాదు. ఇంతలో తనకే ఫోన్ వస్తుంది. తులసి నుంచి వచ్చే ఫోన్ అది. కానీ.. ఎవరు అంటే.. వందననే అని అబద్ధం చెబుతుంది. ఫోన్ ఎత్తుతుంది. చెప్పు వందన అంటుంది. వందన ఏంటి నేను తులసిని మాట్లాడుతున్నాను అంటుంది.

సరే చెప్పు అంటుంది. నీకో శుభవార్త అని అంటుంది. ప్రేమ్ ఆల్బమ్ కు డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అని అంటుంది తులసి. దీంతో శృతి షాక్ అవుతుంది. బ్యాంక్ లోన్ అప్లయి చేశాను.. త్వరలోనే డబ్బులు వస్తాయి అని అంటుంది తులసి. దీంతో శృతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు.

Intinti Gruhalakshmi 23 June Today Episode : తులసి సంతకం పెట్టిన బ్లాంక్ చెక్కును తీసుకున్న బ్యాంక్ ఏజెంట్

మరోవైపు అంకిత విషయం ఏం చేద్దాం అని అభిని గాయత్రి అడుగుతుంది. దీంతో ఏం చేద్దాం ఆంటి.. నాకు అర్థం కావడం లేదు. నేను కావాలంటే అదే ఇంటికి రావాలని నన్ను అంటోంది అంటాడు అభి. దీంతో వెళ్లు.. నువ్వు ఎలాగూ తనను దారిలోకి తెచ్చుకోలేకపోయావు కదా.. అంటుంది.

మీ పెంపకంలో 20 ఏళ్లలో మీ మాట వినని అంకిత.. 5 ఏళ్ల మా పరిచయంలో నా మాట ఎక్కడ వింటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు లాస్యకు భాస్కర్ ఫోన్ చేసి.. మీరు చెప్పినట్టే ఫేక్ డాక్యుమెంట్లతో అప్లికేషన్ రెడీ చేశాను మేడమ్ అంటాడు. మరి ఇంకేంటి.. వెంటనే అప్లికేషన్ ను బ్యాంక్ లో సబ్మిట్ చేయి అంటుంది లాస్య.

చేస్తా మేడమ్ అంటాడు భాస్కర్. మరోవైపు అనసూయకు ఒంట్లో నలతగా ఉంటే చెకప్ కోసం అంకితను తీసుకొని వెళ్తుంది. పరందామయ్య కూడా ఉండడు. ముగ్గురూ కలిసి హాస్పిటల్ కు వెళ్లడంతో ఎవరూ లేరని సమయం చూసుకొని బ్యాంకు వాళ్లు తులసి ఇంటికి వెళ్తారు. ఇంట్లో తులసి ఒక్కతే ఉంటుంది.

లోన్ డాక్యుమెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. ఈ ఫైల్స్ మీద సంతకం చేస్తే మేము తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేస్తాం అంటాడు. కానీ.. ఇంట్లో ఎవరూ లేరు.. వాళ్లు వచ్చి చూశాక నేను సంతకాలు పెట్టి ఇస్తా అంటుంది. దీంతో బ్యాంక్ మేనేజర్ లీవ్ లో ఉన్నాడని.. మీ అప్లికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాడని.. వారం రోజులు రాడని చెబుతాడు.

దీంతో లేట్ అయితే ప్రేమ్ కు ప్రాబ్లమ్ అవుతుందని అనుకొని వెంటనే తను ఎక్కడ చెబితే అక్కడ సంతకాలు పెడుతుంది తులసి. చివరలో ఒక బ్లాంక్ చెక్ కూడా కావాలి మేడమ్ అంటాడు. ఎందుకు అని ప్రశ్నిస్తుంది తులసి. మీకు అకౌంట్ ఉందని బ్యాంక్ వాళ్లకు ప్రూఫ్ కావాలి అంటాడు. దీంతో తెచ్చి దాని మీద సంతకం పెట్టి ఇస్తుంది.

అవన్నీ తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేస్తాడు ఏజెంట్. తులసి అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అవ్వగానే… వెంటనే లాస్య.. బ్లాంక్ చెక్ తో డబ్బులను తన అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటుంది. ఈ విషయం తెలిసి తులసి షాక్ అవుతుంది. మనం ఫేక్ డాక్యుమెంట్లతో లోన్ అప్లయి చేశామని తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ తో మనం ఎక్కడికి వెళ్లినా మన డబ్బు తిరిగి రాదు అని అంకిత చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement