Intinti Gruhalakshmi 27 June Today Episode : ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నందుకు తులసిని అరెస్ట్ చేయించిన బ్యాంక్ అధికారులు.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 27 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 669 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని సక్సెస్ ఫుల్ గా మోసం చేశాను. అనుకున్నది సాధించాను. లాస్య నువ్వు గ్రేట్ అంటూ లాస్య చాలా సంతోషంగా ఉండటం చూసి నందు షాక్ అవుతాడు. ఏమైంది లాస్యకు అనుకుంటాడు. నందును చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది. ఏంటి ఇంత ఆనందం అంటాడు. మన ప్రియమైన శత్రువు తులసి మరోసారి రోడ్డు మీద పడింది అంటుంది. తులసికి 20 లక్షల బ్యాంక్ లోన్ సాంక్షన్ అయింది. డబ్బు అకౌంట్ లో క్రెడిట్ అయిన మరుక్షణంలోనే ఆ డబ్బు అకౌంట్ లో నుంచి మాయం అయ్యాయి అంటుంది లాస్య. దీంతో అలా ఎలా మాయం అయ్యాయి అంటాడు నందు. దీంతో ఎవరో కాజేసి ఉంటారు అంటుంది లాస్య.

Advertisement
intinti gruhalakshmi 27 june 2022 full episode
intinti gruhalakshmi 27 june 2022 full episode

ఇప్పుడు సంతోషంగా ఉంది నాకు అంటాడు నందు. మరి ఒకసారి సరదాగా తనను పరామర్శించి వద్దామా అంటాడు నందు. వద్దులే అని తర్వాత అంటాడు. తులసి ఇప్పుడు ఇదివరకు తులసి కాదు.. చాలా మారిపోయింది. తెలివితోనే అంకితను పక్కన పెట్టుకుంటుంది కదా అంటుంది లాస్య. తులసిని గట్టెక్కించడానికి అంకిత ఉంది కదా అంటుంది లాస్య. దీంతో అంకిత ఎలా తనకు డబ్బు ఇస్తుందో నేను చూస్తాను అని ఆవేశంగా వెళ్తాడు నందు. మరోవైపు ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఎవరినైనా అడ్వకేట్ ను సంప్రదిద్దామా అని అంటాడు పరందామయ్య. దీంతో ఎవరో ఎందుకు మన అల్లుడే ఉన్నాడు కదా అంటుంది అనసూయ. వద్దు.. ఈ విషయం నలుగురికి తెలియకూడదు అంటుంది తులసి.

Advertisement

ఇంతలో శృతికి ప్రేమ్ ఫోన్ చేస్తాడు. దీంతో నేను వెళ్లి వస్తా అంటుంది శృతి. దీంతో వెళ్లిరా.. వాడికి ఏం తెలియనీయకు అంటుంది తులసి. దీంతో సరే అని చెప్పి అక్కడి నుంచి శృతి వెళ్లిపోతుంది. మరోవైపు అంకిత కూడా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఆ బ్రోకర్ గాడు ఎప్పుడో ఒకప్పుడు నాకు కనిపించకుండా పోడు. వాడి బుర్ర పగులగొడతాను అంటుంది అనసూయ. అయినా ఒకరిని మోసం చేసి బతికేవాడు ఎప్పటికీ బాగుపడడు.. నాశనం అవుతాడు అంటుంది అనసూయ. ఇంతలో అక్కడికి వచ్చిన నందు.. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. ఒకరిని మోసం చేసి బతకాలనుకుంటే ఇలాగే అవుతుంది అని తులసిని ఎత్తిపొడుస్తాడు నందు.

Intinti Gruhalakshmi 27 June Today Episode : తులసిని హేళన చేసిన నందు

ఇంతవరకు నువ్వు ఏం సాధించావు. నీ చేతకానితనంతో నీతో పాటు నిన్ను నమ్ముకున్న వాళ్లను కూడా నట్టేట ముంచావు. ఏదో ఫ్యాక్టరీని ఉద్ధరిస్తానని బయలుదేరావు. ఆ తర్వాత మధ్యలోనే ఫ్యాక్టరీని వదిలేశావు. మా నాన్న ఆపరేషన్ కోసం అని అప్పు చేశావు. చివరకు ఆ ఇంటిని పోగొట్టావు.. తినడానికి సంపాదించుకోవడానికే కిందా మీదా పడుతున్నావు అంటాడు.

అదే అహంకారం ఇంకా పోలేదు. 20 లక్షల లోన్ తీసుకొని ఆ డబ్బు కూడా ఎటూ కాకుండా చేశావు. నా వల్లను కూడా కష్టపెడుతున్నావు అంటాడు నందు. దీంతో మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేహీ అంటూ మీ ముందు నేను చేతులు చాచానా అంటుంది తులసి.

ఎందుకు నా విషయంలో ఇంత ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకు నా ఇంటి మీద పడి గోల చేస్తున్నారు. లోన్ తీసుకున్నాను అది నా ఇష్టం. మోసపోయాను.. అది నా కర్మ అంటుంది తులసి. ఆలోన్ మిమ్మల్ని కట్టమని అడగలేదే.. అడిగినా మీరు కట్టలేరు కూడా. ఎందుకంటే.. ఎంతో పెద్ద చదువులు చదివినా నాకన్నా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు మీరు అంటుంది తులసి.

దీంతో నందుకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకు నా గురించి అంత ఆలోచిస్తున్నారు. నేను మీ మాజీ భార్యను అంటుంది. దీంతో నా వాళ్లంతా నీ దగ్గర ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నాను అంటాడు. దీంతో వాళ్లు నా వాళ్లు కూడా అంటుంది తులసి.

నా జీవితంలో మొట్టమొదటిసారిగా నన్ను మోసం చేసింది ఆయనే అని మీ అబ్బాయికి చెప్పండి మామయ్య అంటుంది తులసి. ఏవేవో ఊహించుకొని ఊరికే నిందలు వేయకండి నంద గోపాల్ గారు అంటుంది తులసి. నా అప్పు, నా బాధ్యత నేనే తీర్చుకుంటాను అంటుంది తులసి.

తులసికి తన కుటుంబ సభ్యులు అందరూ మద్దతు ఇస్తారు. మేమంతా తనకు ఉన్నాం అంటారు. మేమంతా కలిసి ఆ అప్పు తీరుస్తాం అంటారు. దీంతో నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు శృతి.. ఇంటికి వెళ్తుంది. ప్రేమ్ తనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

తను రాగానే చాలా ఎగ్జయిట్ అవుతూ ఉంటాడు. ఏ గిటార్ కొనాలి.. ఏ వాయిద్యాలు కొనాలి అంటూ శృతికి చెబుతుంటాడు. కానీ.. శృతి మాత్రం ఏం మాట్లాడదు. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ప్రేమ్ కు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు.

మరోవైపు తులసి లోన్ తీసుకున్న బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేసి.. ఈ మధ్య 20 లక్షల లోన్ తీసుకున్న తులసి.. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుందని చెబుతుంది లాస్య. దీంతో తులసి ఇంటికి వెళ్తారు బ్యాంక్ అధికారులు. అలా చేయడం తప్పు అని.. తను క్రిమినల్ అని అంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement