Intinti Gruhalakshmi 29 Nov Today Episode : తులసికి సీరియస్.. కంగారులో ఫ్యామిలీ.. తులసి కండిషన్ పై డాక్టర్లు ఏం చెప్పారు?
Intinti Gruhalakshmi 29 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్, 2021 సోమవారం 489 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, తులసి ఇద్దరూ వెల్ నెస్ సెంటర్ లో కాసేపు సరదాగా ఉంటారు. ఇంతలో వెల్ నెస్ సెంటర్ ఓనర్ అద్వైత కృష్ణ వేణుగానం ఊదుతుంటాడు. ఆ వేణుగానానికి తులసి మైమరిచిపోతుంది. అక్కడికి తీసుకెళ్లు నన్ను అంటుంది తులసి. దీంతో ఆయన దగ్గరికి తులసిని తీసుకెళ్తాడు ప్రేమ్.హాయ్ డియర్ అంటాడు అద్వైత కృష్ణ. మీరు నాదగ్గర ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేను మీకు గురూజీని. లేదంటే నేను కూడా మీలాగే సాధారణ వ్యక్తిని అంటాడు. మీరు గురూజీ అంటే నమ్మలేకపోతున్నాను అంటుంది తులసి. మా గురువు గారు అలా ఉండరు.
అందుకే నేను అలా ఉండను అంటాడు అద్వైత కృష్ణ. మీ గురువు గారు ఎవరు అంటే కృష్ణుడి వైపు చూపిస్తాడు. ఆయనే మా గురువు గారు తులసి అంటాడు. నా పేరు మీకెలా తెలుసు అంటుంది. నీలో ఉన్న స్వచ్ఛత, అమాయకత్వం చూసి నీకు అదే పేరు ఉంటుంది అని గెస్ చేశాను అంటాడు.ఇంతకీ నేను ఎవరో తెలుసా? నాపేరు అద్వైత కృష్ణ అంటాడు. అంటే మీరు ఫేమస్ డాక్టర్ అద్వైత కృష్ణ కదా అంటాడు ప్రేమ్. దీంతో అవును అంటాడు. మా అమ్మకు ట్రీట్ మెంట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాం అంటాడు ప్రేమ్. దీంతో తులసి షాక్ అవుతుంది. మీరు అంత పెద్ద డాక్టర్ అయి ఉండి.. అంత సింపుల్ గా ఉన్నారు అంటుంది తులసి.
మరోవైపు తులసి కుటుంబ సభ్యులంతా వెల్ నెస్ సెంటర్ లో సరదాగా గడుపుతుంటారు. శృతి, అంకిత, దివ్య.. ముగ్గురు కలిసి సరదాగా స్కిప్పింగ్ చేస్తుంటారు. కమాన్ దివ్య.. ఫాస్ట్ గా అంటూ దివ్యను ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు కూడా స్కిప్పింగ్ చేయండి అంటుంది దివ్య.
శృతి స్కిప్పింగ్ చేస్తుంది. తర్వాత అంకితను కూడా చేయమంటారు. కానీ.. అంకిత భయపడుతుంది. నేను చేయను అంటుంది. నేను అస్సలు ఆడలేను అంటుంది అంకిత. దీంతో ఇందులో భయపడటానికి ఏముంది.. ఇది వెల్ నెస్ సెంటర్.. ఏం కాదు స్కిప్పింగ్ చేయి అంటుంది దివ్య.
Intinti Gruhalakshmi 29 Nov Today Episode : స్కిప్పింగ్ చేయాలంటూ తులసిని బలవంతపెట్టిన దివ్య
ఇంతలో తులసి, ప్రేమ్ అక్కడికి వస్తారు. మేమంతా స్కిప్పింగ్ చేశాం. ఇప్పుడు నీ టర్న్. నువ్వు స్కిప్పింగ్ చేయి అని దివ్య అంటుంది తులసిని. దీంతో స్కిప్పింగ్ చేయి అని అందరూ అడుగుతారు. దీంతో సరే సరే.. అంటుంది తులసి. దీంతో తులసి స్కిప్పింగ్ చేస్తుంది.
ఇంతలోనే నందు, అభి అక్కడికి వస్తారు. తులసి స్కిప్పింగ్ చేయడం చూసి షాక్ అవుతారు. అదేంటి మామ్ స్కిప్పింగ్ చేస్తుంది. మమ్మీ స్కిప్పింగ్ చేయకూడదు. మనం వెంటనే ఆపాలి అని పరిగెత్తుకుంటూ వస్తారు నందు, అభి. ఇంతలో తులసి కళ్లు తిరిగిపడిపోబోతుంది. వెంటనే నందు తనను కిందపడకుండా పట్టుకుంటాడు.
తులసి స్పృహతప్పి పడిపోతుంది. అందరూ టెన్షన్ పడతారు. అభి అందరిపై సీరియస్ అవుతాడు. మీకు అసలు బుద్ధి ఉందా? తను పేషెంట్ అనే విషయం తెలియదా? అని అంటాడు. వెంటనే డాక్టర్ సునీతకు ఫోన్ చేస్తాడు అభి. అర్జెంట్ గా రండి డాక్టర్ అంటాడు అభి.
అయితే.. సునీతకు రావడం కుదరదట. వేరే డాక్టర్ ను ఏర్పాటు చేస్తా అన్నారు అంటాడు అభి. వెంటనే తులసిని తన రూమ్ కు తీసుకెళ్తారు. తర్వాత తులసిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. అన్ని టెస్టులు చేస్తుంటారు. మరోవైపు అందరూ టెన్షన్ పడుతుంటారు. తులసికి ఏమౌతుందో అని భయపడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.