Intinti Gruhalakshmi 29 Oct Today Episode : శృతిని ఇంట్లో బ్యాడ్ చేయడం కోసం అంకిత ప్లాన్స్.. తులసి మాట విని ఆఫీసుకు వచ్చిన స్టాఫ్.. ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 29 October 2021, 1:18 pm

Intinti Gruhalakshmi 29 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 463 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత, శృతి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. నా పనులన్నీ చేయాలంటూ శృతికి ఆర్డర్ వేస్తుంది అంకిత. నా బట్టలు ఉతకాలి.. నా రూమ్ క్లీన్ చేయాలి అని చెబుతుంది అంకిత. దీంతో చేస్తాను అని చెబుతుంది శృతి. నేను కూడా చూస్తాను.. నువ్వు మాట మీద ఎంత వరకు నిలబడతావో అని చెప్పి వెళ్లిపోతుంది అంకిత.

intinti gruhalakshmi 29 october 2021 full episode

intinti gruhalakshmi 29 october 2021 full episode

కట్ చేస్తే.. తులసి, నందు, లాస్య.. ముగ్గురు కలిసి ఆఫీసుకు వస్తారు. ఆఫీసులో ఉద్యోగులు రాకపోవడంతో షాక్ అవుతుంది తులసి. ఎవరూ రాలేదా వరుణ్ అని అక్కడున్న ఆఫీస్ బాయ్ ని అడుగుతుంది తులసి. ఎవరూ రాలేదు సార్ అంటాడు. ఎందుకు ఇంకా ఎవరూ రాలేదని అనుకుంటుంది తులసి. కంపెనీ నడపడం అంటే కుట్టు మిషన్ నడిపించినంత ఈజీ కాదు. ఎంప్లాయిస్ ను డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు పిలవగానే వచ్చేస్తారని అనుకున్నావా? అంటూ లాస్య తులసిపై ఫైర్ అవుతుంది.

మొన్నటి వరకు నేను ఆఫీసుకు రాగానే.. స్టాఫ్ నన్ను చూసి విష్ చేసేవాళ్లు.. ఇప్పుడు నేను స్టాఫ్ వచ్చేవరకు చూసి వెయిట్ చేయాల్సి వస్తోంది అని నందు అంటాడు. స్టాఫ్ కోసం ఇలా వెయిట్ చేయడం నాకు సిగ్గుగా అనిపిస్తోంది అంటాడు. తప్పు చేసినప్పుడు సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. అంటే ఇక నావల్ల కాదు.. వెళ్దాం పదా అంటాడు నందు. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దామండి అంటుంది తులసి. స్టాఫ్ వచ్చేవరకు క్యాబిన్ లో వెయిట్ చేద్దాం పదా నందు అంటూ క్యాబిన్ కు వెళ్లిపోతారు నందు, లాస్య. స్టాఫ్ ఎందుకు రాలేదని టెన్షన్ పడుతుంటుంది తులసి.

కట్ చేస్తే అంకిత పనులన్నీ శృతి చేస్తుంది. ఇక నేను వెళ్లిపోతాను అని శృతి అనగానే.. వాషింగ్ మిషన్ లో బట్టలు వేశాను.. కాస్త ఆ పని కూడా చేసి పెట్టవా? అంటుంది అంకిత. సరే.. అని చెప్పి వెళ్తుంది శృతి. తన రూమ్ లోకి వెళ్లి అభి ల్యాప్ టాప్ ను కింద పడేసి పగులగొట్టేస్తుంది అంకిత. శృతిని ఇరికించడం కోసం ఈ పని చేస్తుంది అంకిత. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అభి స్నానం చేసి బయటికి వచ్చి చూస్తాడు. తన లాప్ టాప్ పగిలిపోయి ఉంటుంది. చూసి షాక్ అవుతాడు. అంకిత.. అంకిత అని పిలుస్తాడు. నా లాప్ టాప్ ను పగులగొట్టింది ఎవరు నువ్వేనా అని అడుగుతాడు. అసలు ఏం జరుగుతోంది ఈ ఇంట్లో.. అంటాడు. ఇంతలో అందరూ వస్తారు. ఏమైంది అని అడుగుతారు. నా లాప్ టాప్ ను ఎవరో పగులగొట్టారు అని అడుగుతాడు.

Intinti Gruhalakshmi 29 Oct Today Episode : మరోసారి అభి ముందు శృతిని ఇరికించిన అంకిత

ఇందాక రూమ్ ను క్లీన్ చేయడం కోసం శృతి వెళ్లింది అభి అని అంకిత అంటుంది. అవునా.. నా మీద కోపంతో లాప్ టాప్ పగులగొట్టావా? అంటాడు అభి. నేను వద్దన్నా కూడా రూమ్ క్లీన్ చేస్తా అని చెప్పింది అంటూ అంకిత… శృతి మీద ఆరోపణలు చేస్తుంది. మా మీద కోపం ఉంటే మా రూమ్ కు రావద్దు కానీ.. వచ్చి లాప్ టాప్ పగులగొట్టడం ఏంటి అంటూ సీరియస్ అవుతాడు అభి. ఇంకోసారి మా రూమ్ కు రావద్దు అని అంటాడు అభి. అందరూ వెళ్లిపోయాక.. ఎలా ఉంది నా ప్లాన్ అని అంటుంది అంకిత. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా.. నువ్వు మారేదాకా నీ పనులు చేస్తూనే ఉంటాను అంటుంది శృతి.

ఉద్యోగుల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తులసి. కానీ.. ఇంకా రారు. ఓవైపు టైమ్ అయిపోతూ ఉంటుంది కానీ.. వాళ్లు రారు. దీంతో ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఇంతలో మేనేజర్.. ఆఫీసుకు వస్తాడు. గుడ్ మార్నింగ్ మేడమ్ అంటాడు. దీంతో తులసి షాక్ అవుతుంది. మిగిలిన వాళ్లు రాలేదా అని అడుగుతుంది. మీరు చెప్పినట్టు చేశాను మేడమ్.. ఇక రావడం రాకపోవడం వాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. మనం వెయిట్ చేద్దాం అంటాడు. ఇంతలో అందరు ఉద్యోగులు వస్తారు. దీంతో తులసి ఫుల్ ఖుషీ అవుతుంది. వెంటనే నందు దగ్గరికి వెళ్లి ఉద్యోగులు వచ్చారు అని చెబుతుంది.

intinti gruhalakshmi 29 october 2021 full episode

intinti gruhalakshmi 29 october 2021 full episode

వెంటనే నందు కూడా బయటికి వస్తాడు. స్టాఫ్ ను చూసి ఆశ్చర్యపోతాడు. తులసి మేడం అందరినీ రమ్మని పిలిచారు అని చెబుతాడు మేనేజర్. ఈనెల నుంచి శాలరీ తనే ఇస్తా అన్నారు. ఈనెల శాలరీ కూడా ముందే ఇస్తా అన్నారు.. అని చెబుతారు ఉద్యోగులు. ఆ తర్వాత ప్రాజెక్టు గురించి నందు.. ఉద్యోగులకు వివరిస్తాడు. ఇది.. స్టాటస్ అని చెప్పి 3 డేస్ లో ఒక డెమో ఇవ్వాలి అని చెబుతాడు. 3 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటాడు.

కట్ చేస్తే.. లంచ్ టైమ్ అవుతుంది. తులసి.. ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్ తింటుంది. లాస్య.. పిజ్జా ఆర్డర్ చేస్తుంది. నందు, లాస్య కలిసి పిజ్జా తింటారు. తులసి మాత్రం శృతి ఇచ్చిన బాక్స్ నే తింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp