Intinti Gruhalakshmi 31 March Today Episode : లాస్య చెంప పగులగొట్టిన మాధవి.. అనాథాశ్రమంలో చేరిన పరందామయ్య, అనసూయ.. ఇంతలో తులసికి భారీ షాక్

Authored By Varun G | The Telugu News | Published on: March 31, 2022, 9:30 am

Intinti Gruhalakshmi 31 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 594 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య.. అనాథ ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉండటానికి పర్మిషన్ అడుగుతాడు. మీరు ఇంట్లో గొడవపడి వచ్చారు కదా.. మీ మనవడు వచ్చి అన్నీ చెప్పాడు అంటాడు ఆ వ్యక్తి. అతడికి ఫోన్ చేయనా అంటాడు. దీంతో వద్దు బాబు.. నీకు దండం పెడతా.. నువ్వు ఆశ్రయం ఇవ్వకున్నా ఏంలేదు కానీ.. వాడికి మాత్రం చెప్పకు అంటాడు. పరందామయ్య వెక్కి వెక్కి ఏడవడంతో అక్కడ ఉండటానికి పర్మిషన్ ఇస్తాడు.

intinti gruhalakshmi 31 march 2022 full episode

intinti gruhalakshmi 31 march 2022 full episode

కట్ చేస్తే.. పరందామయ్య, అనసూయ దొరకకపోవడంతో ఇంటికి వస్తారు తులసి, మాధవి. వాళ్లు రాగానే.. మా అమ్మానాన్న ఎక్కడ అని అడుగుతాడు నందు. మేం వెతికాం కానీ.. దొరకలేదు అంటుంది. దీంతో ఇంట్లో మళ్లీ లొల్లి స్టార్ట్ అవుతుంది. మాధవి కూడా నందు, లాస్యపై సీరియస్ అవుతుంది. తులసిని మెచ్చుకోవాల్సింది పోయి నిందలు వేస్తావా.. ఇదెక్కడి అన్యాయం అన్నయ్య అంటుంది మాధవి. పిల్లలను నందుకు దూరం చేసింది తులసి.. అత్తయ్య మామయ్యలను నందుకు దూరం చేసింది తులసి. ఈ ఇంటి పెత్తనాన్ని మొత్తం తను తీసుకొని నందుకు విలువ లేకుండా చేసింది తులసి అంటుంది లాస్య.

మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితిని క్రియేట్ చేసింది తులసి అంటుంది లాస్య. అన్ని గొడవలకు తులసే కారణం అంటుంది లాస్య. దీంతో మాధవికి కోపం వస్తుంది. సిగ్గు లేకుండా మా వెంట పడుతోంది. అత్తయ్య మామయ్యలను కిడ్నాప్ చేసి దాచిపెట్టింది అంటుంది లాస్య.

దీంతో కోపంతో మాధవి వెళ్లి లాస్య చెంప చెళ్లుమనిపిస్తుంది. ఇంకొక మాట మా వదిన గురించి చెడుగా మాట్లాడావు అంటే నాలిక చీరేస్తా అంటుంది మాధవి. మాధవి.. అని నందు అనబోతే నువ్వు మధ్యలో మాట్లాడకు అంటుంది మాధవి. వదిన గురించి ఇంత మాట్లాడినా లేవని నీ నోరు ఇప్పుడు ఎందుకు లేస్తోంది అంటుంది మాధవి.

పరువు మీకే కాదు.. మాకూ ఉంటుంది అంటుంది. లాస్య ఇన్ని మాటలు అంటున్నా వదిన నోరు తెరిచి ఒక్క మాట అయినా చెప్పిందా. గొడవ ఎందుకు అనుకొని తన మాటను దిగమింగుకుంటోంది. అది సంస్కారం అంటే.. అది మంచితనం అంటే.

Intinti Gruhalakshmi 31 March Today Episode : మాధవి, తులసిని తిట్టిన లాస్య

మంచితనం ముసుగు వేసుకుంది మా వదిన కాదు.. నువ్వు అంటుంది మాధవి. మంచితనం ముసుగు వేసుకొని మా అన్నయ్యను వదినకు కాకుండా చేశావు అంటూ లాస్యపై సీరియస్ అవుతుంది మాధవి. మా వదిన కాళ్లు మొక్కడానికి కూడా అర్హత లేని నువ్వు నిందలు వేస్తావా అంటుంది మాధవి.

మరోవైపు ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లాస్య. వాళ్లు ఎక్కడున్నారో అనుకుంటుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు. వాళ్లు ఎక్కడికి పోయారో అర్థం కావడం లేదు అంటాడు ప్రేమ్. ఇదంతా నాన్న వల్లే అంటాడు ప్రేమ్. మళ్లీ వెళ్దువులే వెతకడానికి. భోం చేద్దువు పదా అంటుంది శృతి.

మరోవైపు తులసి.. పరందామయ్య, అనసూయ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అభి, దివ్య.. భోజనం తీసుకొచ్చి తులసికి తినాలని చెబుతాడు. నేను ఎలా తింటాను. నాకు ఎలా ముద్ద దిగుతుంది అంటుంది తులసి.

మీ చెల్లి నా చెంప పగులగొట్టింది. చూస్తూ నువ్వు ఊరుకుంటావా అంటుంది లాస్య. ఎలాగూ మనం వెళ్లిపోతున్నాం కదా.. వాళ్లతో మనకు ఏంటి సంబంధం అంటాడు నందు. ఈ ఇంట్లో గూడు పుఠానీ జరుగుతోంది నందు. అది నీకు అర్థం కావడం లేదు అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp