Intinti Gruhalakshmi 7 Jan Today Episode : నందు, లాస్య మధ్య టీ కోసం గొడవ.. నందుకు నో జాబ్.. లాస్యకు జాబ్.. తులసి విషయంలో లాస్య షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 7 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జనవరి, 2022, శుక్రవారం ఎపిసోడ్ 523 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందుకు జాబ్ రాదు. ఉత్త చేతులతోనే ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి రాగానే తులసి ఎదురుపడుతుంది కానీ.. ఇద్దరూ ఏం మాట్లాడుకోరు. ఒరేయ్ నందు.. నీ జాబ్ ఏమైందిరా అని అడుగుతాడు పరందామయ్య. దీంతో జాబ్ రాలేదు అంటాడు నందు. జాబ్ రాలేదని బాధపడకు. ప్రయత్నం మాత్రం ఆపకు. నీకు ఇంతకన్నా మంచి ఉద్యోగమే వస్తుందిలే అని అంటారు తన తల్లిదండ్రులు. ఇంతలో తులసి తన అత్తామామకు చాయ్ తెచ్చి ఇస్తుంది. ఇంతలో లాస్య వచ్చి హాయ్ ఎవర్రీబడీ అని చెప్పి వెళ్లి సోఫా మీద కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. దీంతో పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు.
నందు.. ఈరోజు నేను చాలా అలిసిపోయాను.. అంటుంది లాస్య. కాళ్లు టేబుల్ మీద పెట్టుకోవడం ఎందుకు. తెచ్చి నా నెత్తి మీద పెట్టు అంటుంది అనసూయ. అత్తయ్య నాకు చిరాకు తెప్పించకండి.. అంటుంది లాస్య. నీకు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతాడు నందు. బిజీగా ఉండి మరిచిపోయాను నందు అంటుంది లాస్య. అవును.. దేనికి ఫోన్ చేశావు అని అడుగుతుంది లాస్య. నీ ఇంటర్వ్యూ ఏమైందో తెలుసుకుందామని ఫోన్ చేశాను అంటాడు. నీకు ముందే చెప్పాను కదా.. జాబ్ వచ్చేసినట్టే అని. రేపు కాల్ చేసి చెబుతాం అన్నారు అంటుంది. మరి.. నా గురించి తెలుసుకోవాలని లేదా అంటాడు. నీ గురించి ఏంటి అంటుంది లాస్య. నేను కూడా ఇంటర్వ్యూకు వెళ్లాను కదా. దాని గురించి తెలుసుకోవా అంటే నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా అంటుంది లాస్య. సరే.. నాకు తలనొప్పి లేస్తుంది. నాకు టీ తీసుకురా అంటాడు నందు. దీంతో ఏంటి నేను నీకు టీ పెట్టుకు తీసుకురావాలా.. నువ్వే వెళ్లి పెట్టుకో అంటుంది లాస్య.
తులసి కూడా ఫ్యాక్టరీకి వెళ్లి అలసిపోయింది. అయినా కూడా వచ్చి అమ్మానాన్నకు టీ ఇచ్చింది. మరి.. నీకు ఏమైంది అని అడుగుతాడు నందు. నేను తులసిని కాదు. తులసిలా నేను ఉండను. తులసి వేరు.. నేను వేరు.. అంటుంది లాస్య. తులసి చేసే పనులు నచ్చకనే కదా.. నువ్వు నన్ను ప్రేమించింది అని అంటుంది లాస్య.
Intinti Gruhalakshmi 7 Jan Today Episode : ఇంట్లో పనులు చేయడం కోసం కొత్త పనిమనిషిని అరేంజ్ చేసిన లాస్య
మీకు అంతగనం టీ కావాలంటే చెప్పండి.. ఒక పనిమనిషిని పెట్టుకుందాం. తను ఇంటి పనులు అన్నీ చూసుకుంటుంది అంటుంది లాస్య. ఇదంతా అవసరమా అని తులసి అంటే.. ఖచ్చితంగా అవసరం. నేను నీలాగా గొడ్డు చాకిరి చేయలేను అంటుంది తులసి.
పనిమనిషి అనగానే అంత ఈజీ కాదు లాస్య. తనకు అన్నీ చెప్పాలి. అన్నీ నేర్పించాలి.. అని తులసి అంటే.. తనతో పని ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు అంటుంది లాస్య. తను నాకు మాత్రమే పని చేస్తుంది. నా కోసం మాత్రమే నేను తనను రేపే తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.
ఇవన్నీ విన్న తులసి.. ఆ విషయాన్ని ప్రేమ్ తో చెబుతుంది. రాములమ్మ ఉండగా మరో పనిమనిషి ఎందుకు అని అంటాడు ప్రేమ్. ఆ లాస్యను చూసి మీరు కూడా లాస్యలా ఎక్కడ మారిపోతారో అని భయమేస్తుంది అంటాడు ప్రేమ్. అవునా.. అంత లేదు.. బంధాలు ప్రేమతో నిలబడతాయి అంటుంది శృతి.
మరోవైపు లాస్య, నందు తమ రూమ్ లో గొడవ పడుతుంటారు. అందులో తప్పేముంది నందు. నువ్వు టీ పెట్టి నాకు తెచ్చిస్తే తప్పేముంది అంటుంది లాస్య. పాతికేళ్ల మా కాపురంలో ఏనాడూ నేను టీ పెట్టలేదు తెలుసా? వాళ్ల ముందు నన్ను అవమానించావు అంటాడు నందు.
ఈ లాస్యను మరో తులసిలా మార్చి పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ జరగదు. జరగనివ్వను. నువ్వు నా బాస్ వి కాదు. నా భర్తవు.. అంటుంది లాస్య. భర్తకు విలువ ఇవ్వని నువ్వు భార్యవు ఎలా అవుతావు అని అంటాడు నందు.
ఈ జనరేషన్ భార్యలు వేరు. ఈ లాస్య నీకు భార్య స్థానంలో వచ్చింది కానీ.. నీకు బానిసలా బతకడానికి కాదు. నేను ఎందులోనూ నీకంటే తక్కువ కాదు. నువ్వు నేను సమానం. నీకు తలవంచాల్సిన అవసరం నాకు లేదు.. అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు పరందామయ్య, అనసూయ.. ఇద్దరూ చాలా బాధపడుతుంటారు. లాస్యను నేను కోడలుగా ఒప్పుకోను అంటుంది అనసూయ. నువ్వు దానివైపు వకల్తా తీసుకొని మాట్లాడుతున్నావు అంటుంది అనసూయ. అస్సలు తీసుకోను అంటుంది తులసి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.