Intinti Gruhalakshmi 8 Dec Today Episode : తులసి చెప్పినా వినకుండా లాస్యకు దూరం అయిన నందు.. లాస్యకు విడాకులు ఇచ్చి తులసికి దగ్గరవుతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : తులసి చెప్పినా వినకుండా లాస్యకు దూరం అయిన నందు.. లాస్యకు విడాకులు ఇచ్చి తులసికి దగ్గరవుతాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :8 December 2022,9:30 am

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 810 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు వేరే ఉంటున్నావు. నీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. మా కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నావు మామ్ అంటాడు అభి. దీంతో నాకు మీరే ప్రపంచం. మిమ్మల్ని కాదనుకున్న రోజు నేనుండను. మీకు నేనున్నాను అని గుర్తుచేయడం కోసమే ఇదంతా చేస్తున్నా అంటుంది తులసి. సారీ మామ్ అంటాడు అభి. ఇంతలో గట్టిగా అరిచినంత మాత్రాన నేను నీ మాట వింటానని అనుకుంటున్నావేమో నేను ఇదివరకు నందును కాదు అంటాడు నందు. ఇప్పుడు గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అంటుంది లాస్య. వీళ్ల మాటలు అందరికీ వినిపిస్తాయి. ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలుసా? మంచి బంధం దొరుకుతుందని. కానీ.. నువ్వు ఆ బంధాన్ని దిగజారేలా చేశావు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి అంటాడు.

intinti gruhalakshmi 8 december 2022 full episode

intinti gruhalakshmi 8 december 2022 full episode

దీంతో ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల అలా చేశాను అంటుంది లాస్య. దీంతో ఇక ఆపు లాస్య అంటాడు నందు. మనం చివరి సారిగా ఎప్పుడు సరదాగా ఉన్నాం చెప్పు లాస్య అంటాడు. దీంతో తులసికి ఒక రూల్.. నాకు ఒక రూలా అంటుంది. అవును అంటాడు. తులసితో 25 ఏళ్లు కాపురం చేశాను. కానీ.. నీతో ప్రేమ బంధం ఉంది అంటాడు నందు. చుట్టూ జనం మన ప్రేమను అప్పుడు తప్పు పట్టారు కానీ.. నేనెప్పుడూ ఆ కామెంట్స్ ను పట్టించుకోలేదు. ఎందుకంటే నాది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి అంటాడు నందు. దీంతో తప్పులు అందరూ చేస్తారు నందు అంటుంది లాస్య. దీంతో అవును తప్పులు అందరూ చేస్తారు కానీ.. నువ్వు ఏం చేశావు మా ఫ్యామిలీని బాధపెట్టావు అంటాడు నందు.

ఇల్లు తిరిగి ఇచ్చేస్తా అన్నా కూడా లాస్య మాటను నందు వినడు. అలసిపోయాను. నీతో గొడవ పడి గొడవ పడి అలసిపోయాను. నా మనసు అర్థం చేసుకునేలా నిన్ను మార్చుకోలేకపోయాను. వినడానికి నీకు బాధగా ఉండొచ్చు కానీ.. నాకు చెప్పడానికి కూడా చాలా బాధేస్తోంది.

నీకు దూరం అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ.. నీతో అడ్జెస్ట్ అవుదామని చాలా సార్లు అనుకున్నా కానీ.. ఇప్పుడు నావల్ల కావడం లేదు. చాలా కష్టంగా ఉంది లాస్య అంటాడు నందు. మన మధ్య బంధం లేదు అంటాడు నందు.

Intinti Gruhalakshmi 8 Dec Today Episode : నందును మళ్లీ బ్లాక్ మెయిల్ చేయబోయిన లాస్య

తులసి విషయంలో మా మధ్య ఎప్పుడూ ప్రేమ లేదు కానీ.. గౌరవం ఉండేది. నేను ఎప్పుడూ విలువ ఇచ్చేవాడిని కాదు.. కానీ గౌరవం ఉండేది. కానీ.. మన మధ్య అటు ప్రేమ లేదు. గౌరవం లేదు. ఇక నుంచి నీ జీవితం నీది.. నా జీవితం నాది అంటాడు నందు.

లోకం దృష్టిలో మాత్రమే నువ్వు, నేను భార్యాభర్తలం. నాలుగు గోడల మధ్య నువ్వు ఎవరో.. నేను ఎవరో అంటాడు నందు. దీంతో నీ ప్రేమను నేను దూరం చేసుకోలేను. నువ్వు నా వాడివి. నా వాడివి గానే ఉండిపోవాలి.

నేను చచ్చిపోతాను నందు అంటుంది లాస్య. దీంతో నీ కారణంగా నా మనసు కూడా ముక్కలు అయింది. కానీ నేను చచ్చిపోలేదు కదా. నువ్వు కూడా చచ్చిపోలేవు లాస్య అంటాడు నందు. వద్దు అన్నా కూడా వినదు లాస్య.

ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటినీ పడేస్తుంది. దీంతో నువ్వు ఎంత హంగామా చేసినా కూడా లొంగేది లేదు. మళ్లీ మోసపోయే ప్రసక్తి లేదు అంటాడు. దీంతో నా మాట విను లేకపోతే తల పగులకొట్టుకుంటాను అంటుంది లాస్య.

దీంతో ఎంత చెప్పినా వినడు నందు. నాకు ఏదైనా జరగకూడనిది జరిగితే బాధ్యత నీదే అని చెప్పి అందరి ముందే తల పగులకొట్టుకుంటుంది లాస్య. నందు మాత్రం అలా చూస్తూనే ఉంటాడు.

అక్కడికి వచ్చి ఆపావేం డ్రామా.. కమాన్ కంటిన్యూ చేయి అందరూ ఉన్నారు కదా.. ఇంకా పిలిపించమంటావా అంటాడు నందు. ఒరేయ్ నీకు పిచ్చెక్కిందా అంటాడు పరందామయ్య. దీంతో ఇలాంటి పెళ్లాం ఉంటే ఎవరైనా ఇలాగే చేస్తారు అంటాడు నందు.

తర్వాత లాస్యను పైకి తీసుకెళ్లి మాట్లాడుతుంది తులసి. నువ్వే మధ్యలో నన్ను లాగుతున్నావు అంటుంది తులసి. నీ మొగుడిని నీ దగ్గర కట్టేసి ఉంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు లాస్య. మనసు పెట్టు అంటుంది తులసి.

తర్వాత నందు దగ్గరికి కూడా వెళ్లి మాట్లాడుతుంది తులసి. నేను మీతో రాజీ పడినా మీకు నేను నచ్చలేదు. చదువు లేదు. పల్లెటూరు మొద్దు అన్నారు. చదువుకున్న పట్నం పిల్ల లాస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తను ఇప్పుడు మీకు నచ్చడం లేదు అంటుంది తులసి.

తను నచ్చకపోయినా భరించాలి. మనసుకు నచ్చజెప్పుకోవాలి అని చెబుతుంది తులసి. కానీ.. నందు మాత్రం వినడు. మా మధ్య ఇప్పుడు ప్రేమ లేదు తులసి అంటాడు నందు. కర్పూరంలా ఆరిపోయింది అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది