Intinti Gruhalakshmi 8 June Today Episode : కన్నతల్లి తులసిపై విషం కక్కిన అభి.. ఈ విషయం అంకితకు తెలిసి షాకింగ్ నిర్ణయం.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on: June 8, 2022, 9:43 am

Intinti Gruhalakshmi 8 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 653 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆస్తి అంకిత పేరు మీద కాకపోతే.. అభి పేరు మీద రాయిద్దాం అని గాయత్రికి సలహా ఇస్తుంది లాస్య. దీంతో అభి సంతోషిస్తాడు. నువ్వు ఇఫ్పుడు మా మామ్ ప్లేస్ లో నిలబడ్డావు. నా కెపాసిటీ గుర్తించావు అంటాడు అభి. నువ్వు పైకి ఎదగడం నాకు కావాలి. ఇవి నా మనసులో నుంచి వస్తున్న మాటలు అంటుంది లాస్య. ఈ ప్రపోజల్ కు అంకుల్ ఒప్పుకోవాలి కదా అని అంటాడు అభి. దీంతో ఒప్పుకుంటాడు.. గాయత్రి ఒప్పిస్తుంది అని అభికి చెబుతుంది లాస్య. దీంతో అభి చాలా సంతోషిస్తాడు. మరోవైపు తులసి.. వంట చేస్తూ సరిగమపలు పాడుతూ ఉంటుంది. తను పాడుతున్న పాటలు అన్నీ వింటాడు పరందామయ్య. సంగీతం పాడుతూ నువ్వు వంట చేస్తే ఆ సంగీతం వల్ల వంట టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అంటాడు.

intinti gruhalakshmi 8 june 2022 full episode

intinti gruhalakshmi 8 june 2022 full episode

ఇంతలో ఇంటికి రామచంద్రయ్య వస్తాడు. మళ్లీ తులసి ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేస్తుందా అనే ఆశతో వచ్చాను అంటాడు పరందామయ్య. దీంతో నేను మీకు ముందే చెప్పాను కదా అంటుంది తులసి. అలాగే ఫ్యాక్టరీలో పని చేసే సుగుణ గురించి చెబుతుంది తులసి. ముందు నువ్వు ఈ డబ్బు తీసుకో అంటాడు రామచంద్రయ్య. దీంతో ఈ డబ్బును సుగుణకు ఇవ్వండి. తను చాలా కష్టాల్లో ఉంది అంటుంది తులసి. దీంతో పరందామయ్య, రామచంద్రయ్య షాక్ అవుతారు. తను అవిటిది. తను ఏ పని చేయలేదు. సాయం కావాల్సింద నాకు కాదు.. సుగుణకు అంటుంది తులసి. దీంతో సుగుణకు నేను సాయం చేస్తాను అంటాడు రామచంద్రయ్య. దీంతో మీ సాయంతో పాటు ఈ సాయం కూడా జత చేయండి అంటుంది తులసి. దీంతో సరే అంటాడు రామచంద్రయ్య.

దేవుడు నాకు ఒక పనికిరాని కొడుకును ఇచ్చాడు. దానికి బదులు నిన్ను కొడుకుగా పుట్టించి ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు పరందామయ్య. ఏంటి మామయ్య.. నేను మీ కూతురును కాదా అంటుంది తులసి. దీంతో అవును అమ్మ.. నువ్వు నా కూతురువే అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 8 June Today Episode :  శరత్, గాయత్రి మాటలు విని సంతోషించిన అభి

మరోవైపు అంకిత తండ్రి ఆస్తిని అంకిత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం కోసం బయలు దేరుతారు. ఈ విషయం తెలిసి గాయత్రి, అభి షాక్ అవుతారు. మరోవైపు గాయత్రి.. శరత్ కు కాఫీ ఇస్తుంది. నువ్వు కాఫీ తేవడం ఏంటి.. నాకు ఆశ్చర్యంగా ఉంది అంటాడు శరత్.

అంకిత పేరు మీద వద్దు.. అభి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిద్దాం అని శరత్ తో చెబుతుంది గాయత్రి. దీంతో శరత్ షాక్ అవుతాడు. పుట్టింటి ఆస్తి వద్దు అని అనుకొని ఉత్త చేతులతో అత్తింటికి వెళ్లిన క్యారెక్టర్ నా కూతురుది. దాన్ని ఎందుకు అనుమానిస్తున్నావు అంటాడు శరత్.

అంకిత మారి ఉండకపోవచ్చు కానీ.. అంకిత వెనకాల ఉండి నడిపిస్తున్న ఆ తులసి మారింది. అందుకే ఆస్తి విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటుంది గాయత్రి. తులసి చాలా మంచిది అంటాడు శరత్. దీంతో అయితే సన్మానం చేయండి అంటుంది గాయత్రి.

మీరు ఆస్తిని అల్లుడి పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేయండి అని అంటుంది గాయత్రి. మరి అంకితకు ఏం సమాధానం చెబుతారు అని అడుగుతాడు శరత్. దీంతో ఆస్తి తులసి పేరు మీద రాస్తాను.. ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరించింది అంటుంది గాయత్రి.

అది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు బాధ్యతగా, పద్ధతిగా ఉండాలి. మనం ఆస్తిని తన భర్త పేరు మీదకే కదా ట్రాన్స్ ఫర్ చేసేది. అభికి అంకిత అంటే ప్రాణం. ఏం చేసినా.. అంకితను అడిగే చేస్తాడు. అలాంటప్పుడు అంకితకు అభ్యంతరం చెప్పాల్సిన పని ఏంటి అంటుంది గాయత్రి.

ఆస్తి అల్లుడి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేయడానికి మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి. మనం అంటే గౌరవం ఉండబట్టే కదా.. వాళ్ల ఇంటిని వదిలి మన ఇంట్లో ఉంటున్నాడు అని గాయత్రి చెబుతుంది. దీంతో నువ్వ అల్లుడిని సంతోషపెట్టడం గురించి ఆలోచిస్తుంటే.. నేను కూతురును బాధపెట్టకుండా ఉండేందకు ఆలోచిస్తున్నా అంటాడు.

దీంతో మన కూతురు బాగు కోసం చేయాలి అని చెబుతుంది గాయత్రి. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు శరత్. తర్వాత ఆ విషయం తన తండ్రి నందుకు ఫోన్ చేసి చెబుతాడు అభి. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అభి. ఈ సక్సెస్ లో లాస్య ఆంటికి కూడా భాగం ఉంది అంటాడు అభి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp