Intinti Gruhalakshmi 8 Nov Today Episode : అంకితకు శృతి సీరియస్ వార్నింగ్.. తులసి వల్ల లాస్యకు మరో షాక్.. క్లయింట్ మీటింగ్ కు తులసికే విమాన టికెట్లు పంపించిన క్లయింట్

0
Advertisement

Intinti Gruhalakshmi 8 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 నవంబర్ 2021, సోమవారం 471 లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఊరుకుంటున్నా కొద్దీ తెగ రెచ్చిపోతున్నావు. పెద్ద కోడలువి కదా అని పరువు తీయకుండా మాట్లాడుతుంటే ఏంటి తెగ ఆవేశపడుతున్నావు. ఒక్క క్షణం నేను నీలా మారిపోయి ప్రవర్తిస్తే ఇంట్లో అందరూ నిన్ను ఛీ కొడతారు అని అంటుంది శృతి. అంకితకు వార్నింగ్ ఇస్తుంది. నేను ఆ నిజం చెబితే నీ సంగతి మొత్తం బయటపడుతుంది. నువ్వు ఆరోజు ఆంటికి ఇచ్చిన డబ్బులు ఎక్కడివి. అవి మీ అమ్మగారు ఇచ్చినవని నాకు తెలుసు.. అంటూ శృతి అంకితకు చెబుతుంది. కానీ.. నేను ఆంటికి చెప్పలేదు కదా. నాకు అలాంటి దురుద్దేశం లేదు. అందుకే నేను ఆ విషయం ఆంటికి చెప్పలేదు. ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. దాచుకుంటాను.. అని చెబుతుంది శృతి.

intinti gruhalakshmi 8 november 2021 full episode
intinti gruhalakshmi 8 november 2021 full episode

నువ్వు ఎన్ని వేషాలు వేసినా.. ఆంటి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయలేవు. ఆ ప్రయత్నాన్ని మానుకొని నువ్వు మంచిదానివి అనిపించుకోవడానికి ప్రయత్నించు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది శృతి. మరోవైపు ఆఫీసుకు వెళ్తారు అందరూ. తులసి, నందు, లాస్య.. ఆఫీసుకు వెళ్లాక.. ఉద్యోగులకు ఒక నెల ముందే జీతాలకు సంబంధించిన చెక్కులు ఇచ్చేస్తారు. ఇక నుంచి పని ప్రారంభించండి. ఈ ప్రాజెక్టు డెడ్ లైన్ లోపు పూర్తి చేయడం అందరి బాధ్యత అని చెబుతాడు నందు.

ప్రాజెక్టులో చిన్న ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ పోవడం లేదని ఓ ఉద్యోగి లాస్యను పిలుస్తాడు. లాస్యకు కూడా ఆ ఎర్రర్ పోదు. దీంతో నందు వచ్చి ఆ ఎర్రర్ ను తీసేస్తాడు. ఇవన్నీ తులసి చూసి సంతోషిస్తుంది. నందు తన రూమ్ లోకి వెళ్లి కూర్చుంటాడు. అంతలోనే కాఫీ తాగండి అని చెబుతుంది. అంతలోనే అక్కడికి లాస్య వస్తుంది. తులసి.. నందుకు కాఫీ ఇవ్వడం చూసి షాక్ అవుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు.

వర్క్ ఎంతవరకు వచ్చింది అని లాస్య.. ఓ ఉద్యోగిపై సీరియస్ అవుతుంది. ఇంకా పని పూర్తి కాలేదా.. కోడింగ్ కాలేదా అని అంటుంది. ఇంతలో తులసి వచ్చి లాస్య.. ఎందుకు అతడిని ఇంకా టెన్షన్ పెడుతున్నావు. అసలు ఏం జరిగిందో తెలుసుకొని సమస్య ఏంటో చూస్తే చాలు అంటుంది తులసి. దీంతో లాస్య.. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. చాలారోజులు అయింది కదా.. పని చేయక. కాస్త టైమ్ పడుతుంది.. అని వాళ్లకు సర్దిచెప్పి వచ్చేస్తుంది.

Intinti Gruhalakshmi 8 Nov Today Episode : లాస్య, తులసి మధ్య గొడవ

ఇంతలో నందు దగ్గరికి వెళ్లి లాస్య.. తులసి గురించి ఫిర్యాదు చేస్తుంది. అప్పుడే తులసి అక్కడికి వస్తుంది. ఏంటి లాస్య నా మీద ఫిర్యాదు చేస్తున్నావా అని అడుగుతుంది. తులసి నువ్వు లాస్య విషయంలో జోక్యం చేసుకోకు అని చెబుతాడు నందు. ఆఫీసులో ఉద్యోగులపై అరిస్తే వాళ్లు రేపటి నుంచి ఆఫీసుకు రాకపోతే ఎలా? అంటూ తులసి అంటుంది. అవును.. అది కూడా నిజమే లాస్య. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు నందు. సరే.. లంచ్ టైమ్ అయింది కదా.. లంచ్ చేద్దాం అంటాడు నందు. కానీ.. లాస్య తినకుండానే వెళ్లిపోతుంది.

సాయంత్రం అవుతుంది. అందరూ ఇంటికి వస్తారు. ఏమండి.. మీకు టీ తీసుకొస్తాను ఉండండి అంటుంది తులసి. ఇప్పుడు టీ కావాలని నందు అడిగాడా.. అంటుంది లాస్య. ఇంతలోనే నందుకు కోరియర్ వస్తుంది. క్లయింట్ బెంగళూరుకు రావాలంటూ నందుకు, తులసికే విమాన టికెట్లు పంపిస్తాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది.

intinti gruhalakshmi 8 november 2021 full episode
intinti gruhalakshmi 8 november 2021 full episode

నందు.. నాకు కూడా టికెట్ బుక్ చేయ్. నేను కూడా వస్తాను.. అంటుంది. మీటింగ్ కు వాళ్లు ఎవరిని పిలిస్తే వాళ్లే రావాలి.. అక్కడికి వెళ్లాక వాళ్లు వద్దంటే టైమ్ వేస్ట్ కదా అంటాడు నందు. దీంతో లాస్యకు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఒకసారి క్లయింట్ తో మాట్లాడి చూడండి. తులసి రావడం కుదరదు.. లాస్యను తీసుకొస్తామని చెప్పండి అంటుంది తులసి. కానీ.. నందు ఏం మాట్లాడుకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

వెంటనే క్లయింట్ కు ఫోన్ చేస్తాడు నందు. ఇద్దరికే టికెట్స్ పంపించారు అని నందు అడుగుతాడు. ఈ మీటింగ్ అరేంజ్ చేసిందే తులసి గారి కోసం. లాస్యతో మాకు అవసరం లేదు. తులసి గారితోనే ఈ మీటింగ్ ఉంటుంది.. అని క్లయింట్ చెబుతాడు. దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement