Allu Arjun : కమలహాసన్ కంటే అల్లు అర్జున్ గొప్పనా .. స్వాతిముత్యం, సాగర సంగమం సినిమాలతో పోలిస్తే పుష్ప సినిమా ఎంత ??
Allu Arjun : పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun నటించిన ‘ పుష్ప ‘ సినిమా ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈమధ్యనే అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేశారు. అయితే కొందరు 69 సంవత్సరాల నుంచి దక్కని ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ కు దక్కిందా అంతలా పుష్ప సినిమాలో ఏముందని అంటున్నారు. 69 సంవత్సరాల కాలంలో జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడానికి కమిటీ సభ్యులు పాటించిన విధివిధానాలు, ప్రాంతీయవాదం, ప్రాంతీయ భాష సినిమాలకు చిన్నచూపు ఉండటం లాంటిది చూస్తూనే ఉన్నాం.
కమిటీ సభ్యులకు ప్రాంతీయ వాదం గుర్తుకు రావడంతో ఉత్తరాది, హిందీ నటులే ఆర్టిస్టులనే భావనలో ఉండేవారు. స్వాతిముత్యం, శంకరాభరణం, మాయాబజార్, సాగర సంగమం, నర్తనశాల, దేవదాసు, మూగమనసులు, అల్లూరి సీతారామరాజు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు తెలుగు తెరపై వెలిగాయి. ప్రతి తెలుగు వాడి గుండెల్లో స్వాతిముత్యం, సాగర సంగమం చిరస్థాయిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అందులో కమల్ హాసన్ నటనకు ఆస్కార్ అవార్డు కూడా పనికిరాదు. తెలుగు సినిమాలు అవార్డులతో సత్కరించాలంటే జాతీయ కమిటీకి ఎప్పుడు చిన్న చూపే. ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు సినిమాల్లో కమల్ హాసన్ నటన తో పోలిస్తే ఆస్కార్ అవార్డులు సాధిస్తున్న సినిమాలోని ఉత్తమ నటులు నటన కూడా చాలా తక్కువ.
దర్శకుడు కె. విశ్వనాథ్ ఇప్పుడు మన మధ్య లేరు కానీ ఆయన సినిమాలు అజరామరం. తెలుగు భాష జీవించు ఉన్నంతకాలం అవి సజీవంగా ఉండిపోతాయి. ఇకపోతే ఈ తరం నటుల నుంచి రాబట్టుకునే దర్శకులలో రాజమౌళి, సుకుమార్ ముందుంటారు. ఆర్టిఫిషియల్ గా కాకుండా సహజంగా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారని సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కించారు. అల్లు అర్జున్ నటన, హావభావాలు, వేషధారణ, మాటలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. స్వాతిముత్యం, సాగర సంగమం సినిమాల కంటే పుష్ప సినిమా గొప్పది కాదు. కానీ తెలుగు సినిమాకు జాతీయ అవార్డు తీసుకొచ్చింది పుష్ప సినిమాను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.