Mokshagna Teja : బాల‌య్య కొడుకు ఎంట్రీని అడ్డుకుంది వారేనా.. వెలుగులోకి వ‌చ్చిన నిజం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mokshagna Teja : బాల‌య్య కొడుకు ఎంట్రీని అడ్డుకుంది వారేనా.. వెలుగులోకి వ‌చ్చిన నిజం..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Mokshagna Teja : బాల‌య్య కొడుకు ఎంట్రీని అడ్డుకుంది వారేనా.. వెలుగులోకి వ‌చ్చిన నిజం..!

Mokshagna Teja : స్టార్ హీరోల వార‌సులు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. బాల‌య్య వార‌సుడు ఎంట్రీ గురించి ఐదారు సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ న‌డుస్తుంది. అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోంది అనడమే కానీ అతనికి సంబంధించిన అప్ డేట్ గా ఏ వార్తా లేదు. అదిగో పులి అంటే ఇదిగో మేక అనేవారు. అయినా తమ హీరో శుభవార్త వినిపించకపోతాడా అంటూ బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. మోక్షజ్ఞ తన తొలి సినిమాను ఏ బ్యానర్ లో చేయబోతున్నారు? నిర్మాత ఎవరు? అతన్ని పరిచయం చేసే దర్శకుడు ఎవరు? అనేది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Mokshagna Teja : ఆ వ్య‌క్తే అడ్డుప‌డుతున్నాడా..

బాలయ్యకు సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తనకు బాలయ్య కూడా హామీ ఇచ్చారు. అది తొలి సినిమా అవుతుందా? లేదంటే రెండో సినిమా అవుతుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మోక్షజ్ఞకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉన్నప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాత్రం ఇప్పటికే అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.అయితే ఇప్పటికే ఆదిత్య 369 సినిమాకు సీక్రెట్ చిత్రంగా చేయబోయే సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ బాలయ్య వెల్లడించారు.ప్రస్తుత ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ ఈ ఎన్నికల సమరం పూర్తి అయిన తర్వాత తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.

Mokshagna Teja బాల‌య్య కొడుకు ఎంట్రీని అడ్డుకుంది వారేనా వెలుగులోకి వ‌చ్చిన నిజం

Mokshagna Teja : బాల‌య్య కొడుకు ఎంట్రీని అడ్డుకుంది వారేనా.. వెలుగులోకి వ‌చ్చిన నిజం..!

ఓ వ్యక్తి కారణంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కాస్త వాయిదా పడిందని తెలుస్తోంది.మోక్షజ్ఞ సినీ ఎంట్రీని అడ్డుకున్నది ఎవరు అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే బాలయ్య ఎంతగానో విశ్వసించే పండితులే అని చెప్పాలి.. బాలకృష్ణకు సెంటిమెంట్లు ఎక్కువ కాగా, ఈ పండితులు మోక్షజ్ఞ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా కలిసి రాదని చెప్పారట. మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఆయన 2025 సెప్టెంబర్ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే మంచి విజయం అందుకుంటారని చెప్ప‌డంతో బాల‌య్య పెండింగ్‌లో పెడుతున్నాడ‌ని స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది