Mokshagna Teja : లక్కీ భాస్కర్ హిట్‌తో వెంకీ అట్లూరి ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్స్.. బాలయ్య తనయుడితో కూడానా..!
ప్రధానాంశాలు:
Mokshagna Teja : లక్కీ భాస్కర్ హిట్‌తో వెంకీ అట్లూరి ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్స్.. బాలయ్య తనయుడితో కూడానా..!
Mokshagna Teja : టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌లో వెంకీ అట్లూరి ఒకరు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. వెంకీ అట్లూరి తో బలమైన అరంగేట్రం చేసింది వరుణ్ తేజ్ తొలి ప్రేమ చిత్రం కానీ తర్వాత వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. మిస్టర్ మజ్ను మరియు ర్యాంక్ చిత్రాలు వెంకీ అట్లూరికి దారుణమైన పరాజయం అందించాయి. అయితే ఇటీవల సార్, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్లతో వెంకీ మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య.. ‘సితార..’ బ్యానర్లో ‘డాకు మహారాజ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ టైంలో మోక్షజ్ఞ ప్రస్తావన నాగవంశీ వద్ద బాలకృష్ణ ప్రస్తావించగా, అతను వెంకీ అట్లూరి వద్ద మంచి కథ ఉందని చెప్పడం.. తర్వాత వెంకీ ప్రత్యేకంగా బాలయ్యని మీట్ అయ్యి.. కథ వినిపించడం జరిగిందట.
Mokshagna Teja వెంకీకి గోల్డెన్ ఛాన్స్
వెంకీ అట్లూరి వద్ద ఉన్న కథ బాలయ్యకి నచ్చిందట. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని బాలయ్య.. వెంకీతో చెప్పారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘సితార..’ లోనే ఈ ప్రాజెక్టు ఉండొచ్చు. అయితే ముందు.. మోక్షజ్ఞ తన డెబ్యూ ఫినిష్ చేసుకోవాలి మరోపక్క వెంకీ అట్లూరి సూర్యతో సెట్ చేసుకున్న సినిమా కూడా కంప్లీట్ చేయాలి. రీసెంట్ గా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కంగువా చిత్రం భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాని నుంచి కోలుకుని సూర్య మరిన్ని చిత్రాలు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీని పూర్తి చేశారు సూర్య. అలాగే ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అని తెలుస్తోంది.
సూర్యకి చెప్పిన కథలో మంచిపాయింట్ ఉండటంతో వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి, నేపధ్యం గురించిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. మారుతి కారు ఇండియాకు ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే బ్యాక్ డ్రాప్ లో వెంకీ అట్లూరి కథ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. చాలా ఇంట్రస్టింగ్ గా జరిగే కొత్త తరహా కథ అంటున్నారు. అలాగే సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 796 CC అనే టైటిల్ ని పెట్టారని తెలుస్తోంది. 796 CC ఇంజన్ తో మారుతి కార్లు ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించి ఓ కొత్త చరిత్రను సృష్టించాయి. ఇండియన్ ఆటో మెబైల్ ఇండస్ట్రీలో మారుతి కార్లు ఎలా గేమ్ ఛేంజర్ గా మారాయన్నదే అసలు పాయింట్ అని తెలుస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ రానుంది