pushpa పుష్ప సినిమా బడ్జెట్ గురించి ఇంతకాలం ఎవరూ మాట్లాడుకోలేదు. పాన్ ఇండియన్ సినిమా.. 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప హ్యాట్రిక్ సినిమా అన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సుకుమార్ ఆర్య.. ఆర్య 2 లాంటి క్లాస్ సినిమాలని తీసి స్టైలిష్ స్టార్ అన్న ఇమేజ్ వచ్చేలా చేశాడు. కాని పుష్ప సినిమా మాత్రం అందుకు భిన్నంగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ని ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా సుకుమార్ చూపిస్తున్నాడు.
అంతేకాదు కథ కూడా యూనివర్సల్ ఎలిమిమెంట్స్ ఉన్న కథ. ఇక పుష్ప సినిమా తో ముఖ్యంగా అల్లు అర్జున్ .. సుకుమార్ బాలీవుడ్ లో సత్తా చాటాలని తాపత్రయపడుతున్నారు. అందుకే సుకుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంటే అల్లు అర్జున్ ఎన్ని టేకులు కావాలన్నా ఓపికతో చేస్తున్నాడట. మాసీవ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందుస్తున్నాడు.
కాగా ఇంతకాలం పుష్ప సినిమా బడ్జెట్ టాపిక్ రానిది తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి అంటున్నారు. అయితే పుష్ప సినిమా బడ్జెట్ 100 నుంచి 120 కోట్లు ఉంటుందని అందరు భావించారట. కాని ఇపుడు అసలు బడ్జెట్ తెలిసి షాకవుతున్నారట. సుకుమార్ రెమ్యూనరేషన్ తో పాటు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తో కలిపి 180 కోట్లు వరకు కేటాయించారని తాజా సమాచారం. అయితే సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం కూడా ఉందట. అయితే లాభాలలో వాటా కూడా కలుపుకొని సుకుమార్ – అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కే 80 నుంచి 100 కోట్లు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే మొత్తంగా 200 కోట్ల వరకు అవుతుందన్న టాక్ వినిపిస్తోది. ఏదేమైనా పుష్ప సినిమాకి ఇంత బడ్జెట్ అంటే తప్పదు మరి. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.