Home » Entertainment » Is Chammak Chandra Re Entry In Jabardasth And Etv With Mallemala
Entertainment

Chammak Chandra : చమ్మక్‌ చంద్ర మళ్లీ ఈటీవీలోకి వస్తాడా? మల్లెమాల టీం రియాక్షన్‌ ఏంటీ?

Authored By
aruna
The Telugu News | Published on: September 17, 2022, 4:00 pm
Advertisement

Chammak Chandra : జబర్దస్త్ కార్యక్రమం ఈ స్థాయి సక్సెస్ అవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆ పలు కారణాల్లో ఒక కారణం చమ్మక్ చంద్ర అనడంలో నూటికి నూరు శాతం అనుమానం లేదు. ఆయన మొదట్లో వేసిన లేడీ గెటప్ జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో సందడి చేసేలా చేసింది. చమ్మక్ చంద్ర స్కిట్ ఒకానొక సమయంలో టాప్ రేటెడ్ స్కిట్ గా నిలిచింది. ఆయన స్కిట్ వస్తుంది అంటే ప్రేక్షకులు అలా నిలుచుని చూసేవారు. ఇప్పుడు సుడిగాలి సుదీర్, హైపర్ ఆది లకు ఏ స్థాయి క్రేజీ ఉందో అప్పట్లోనే చమ్మక్ చంద్ర కు ఆ స్థాయి క్రేజ్‌ దక్కింది అనడంలో సందేహం లేదు. ఇతర టీం లీడర్లకు 30,000 నుండి 40 వేలు పారితోషికం ఇచ్చిన సమయంలో చమ్మక్ చంద్రకు లక్ష నుండి లక్ష ఇరవై వేల రూపాయల పారితోషకం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి.

Advertisement

అంతటి ప్రాముఖ్యత చమ్మక్ చంద్ర కి మల్లెమాల వారి ఇచ్చారు, అలాగే చమ్మక్ చంద్ర కూడా మల్లెమాల కోసం అంతే కష్టపడేవాడు. కట్ చేస్తే నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లి పోతున్నాడని ఉద్దేశంతో చమ్మక్ చంద్ర కూడా వెళ్లి పోయాడు. తాను ఒకటి తలిస్తే మరోటి జరిగింది అన్నట్లుగా చమ్మక్ చంద్ర అనుకున్నది జరగలేదు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా కూడా సక్సెస్ అయ్యాడు. సినిమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ప్రతి ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో కూడా అతడు కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈటీవీ కి కూడా అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

is chammak chandra re entry in jabardasth and etv with mallemala

Advertisement

ఇటీవల జరిగిన రెండు కార్యక్రమాల్లో చమ్మక్ చంద్ర కనిపించడంతో రీ ఎంట్రీ కన్ఫామ్ అని అంతా భావించారు. కానీ మల్లెమాల వారి నుండి అందుకున్న సమాచారం ప్రకారం చమ్మక్ చంద్ర కేవలం గెస్ట్ మాత్రమే అని పర్మినెంట్ కంటెస్టెంట్ గా మల్లెమాలలో అతడికి వచ్చే అవకాశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. మరో వైపు చమ్మక్ చంద్ర కూడా గతంలో మాదిరిగా జబర్దస్త్ కి ఫుల్ టైం కేటాయించే పరిస్థితి లేదు. కనుక అప్పుడప్పుడు గెస్ట్ గా వచ్చినా కూడా పరవాలేదు అన్నట్లుగా ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చమ్మక్ చంద్ర వంటి ఎంతో మంది స్టార్ కమెడియన్స్ వెళ్లి పోవడం వల్లే జబర్దస్త్ రేటింగ్ దారుణంగా పడిపోయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే చమ్మక్ చంద్ర మళ్లీ రీఎంట్రీ ఇస్తే బాగుండు అని కొందరు కోరుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి