Keerthi Suresh : కీర్తి సురేశ్ కెరీర్ ఇప్పుడు డైలమాలో ఉందా..?
Keerthi Suresh: కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అందుకున్న కీర్తి సురేశ్ మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించి ఏకంగా సౌత్‌లోనే టాప్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. అంతక ముందు కంటే మహానటి సినిమా తర్వాత కీర్తికి వచ్చిన కీర్తి రెట్టింపు అని చెప్పాలి. కానీ, కీర్తి ఆ తర్వాత ఎంచుకుంటున్న సినిమాలతో కొద్ది కొద్దిగా తన క్రేజ్‌ను పోగొట్టుకుంటుందని గత ఏడాది నుంచి టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం తన ప్రాజెక్ట్స్‌లో ఇప్పటి వరకు ఏ ఒక్కటీ సక్సెస్ సాధించినవి లేకపోవడమే. తన తర్వాత అవకాశాలు అందుకున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి ఇటు సౌత్ భాషలలో అటు నార్త్ భాషలో భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ పాన్ ఇండియన్ హీరోయిన్స్‌గా మారారు.
కానీ, ఈ విషయంలో కీర్తి వారిద్దరికంటే బాగా వెనకబడిందని చెప్పాలి. కీర్తికి మహానటి తర్వాత చేసిన సినిమాలలో కనీసం 3 చిత్రాలైనా భారీ సక్సెస్ సాధించి ఉంటే ఇప్పుడు తన రేంజ్ మరోలా ఉండేది. తెలుగులో చేసిన రంగ్ దే, ద్విభాషా చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, తమిళ సినిమా అణ్ణాత్త, మలయాళ సినిమా మరక్కార్..ఇలా చాలా సినిమాలు వాచాయి. కానీ, ఆమెకు ఒక్క హిట్ దక్కింది లేదు. పైగా కీర్తి ఉంటే సినిమా ఫ్లాప్ అనే ఆలోచనకి జనాలు వచ్చేశారు. ఈ విషయాన్ని ఆ మధ్య కీర్తి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు కూడా తన చేతిలో మంచి ప్రాజెక్ట్సే ఉన్నాయి.
Keerthi Suresh: రెండు సినిమాలు భారీ హిట్ సాధించినా చాలు..
కానీ, అవి హిట్స్ ఇస్తాయా అనేదే ఇప్పుడు అందరిలో కలుగుతున్న సందేహం. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న సర్కారు వారి పాట వచ్చే నెల భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా సక్సెస్ కీర్తికి చాల కీలకం అని చెప్పాలి. అలాగే, మెగాస్టార్ చిరంజీవి – మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. అయితే, ఈ సినిమా వల్ల కీర్తికి ఎంత క్రేజ్ వస్తుందనేది సినిమా రిలీజయ్యాక గానీ, చెప్పలేము. ఇక నాని సరసన రెండవసారి జత కడుతూ దసరా అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. తమిళంలో కూడా ఉదయనిధి స్టాలిన్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ నాలుగు సినిమాలలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న రెండు సినిమాలు భారీ హిట్ సాధించినా చాలు..కీర్తి కెరీర్‌కు ఇబ్బంది ఉండదు. లేదంటే డైలమాలో పడిపోతుందంటున్నారు.