పూరి, త్రివిక్రం లను పక్కన పెట్టి వెంకీ కుడుముల కి వేయిట్ ఇచ్చిన మహేష్ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పూరి, త్రివిక్రం లను పక్కన పెట్టి వెంకీ కుడుముల కి వేయిట్ ఇచ్చిన మహేష్ ..?

 Authored By govind | The Telugu News | Updated on :7 December 2020,7:45 pm

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ప్రస్తుతం దర్శక, నిర్మాతలు క్యూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఎందుకున్నారు అంటే అందరూ అనుకునేది ఆయన సూపర్ స్టార్ కాబట్టి ఆయనతో సినిమా చేస్తే స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ వస్తుందన్న ఆలోచన అని. కాని అసలు విషయం వేరే. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా నుంచి నిర్మాణం లో భాగమవుతున్నాడు. కథ నచ్చితే తన జీఎంబి నిర్మాణ సంస్థ ని కలిపి సినిమాలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Saaho eyes for Sarkaru Vaari Paata - tollywood

ఒకవేళ ఆ కథ తనకి సూటవదు అనుకుంటే వేరే హీరోతో నిర్మిస్తున్నాడు. ఇప్పుడు చేయబోతున్న సర్కారు వారి పాట ప్రాజెక్ట్ కి మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ ప్లస్ తో కలిసి నిర్మిస్తూ.. నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టాలెంటెడ్ హీరో అడవి శేష్ తో మేజర్ అన్న సినిమాని నిర్మిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ కూడా ఈ సినిమాకి నిర్మాణంలో భాగమయ్యారు. ఇలా మహేష్ ని కథ తో ఒప్పిస్తే రెండు విధాలుగా ఉపయోగముంటుందని దర్శకులు భావిస్తున్నారు. కాని మహేష్ ని అంత సులభంగా కథ చెప్పి ఒప్పించడం సాధ్యపడటం లేదు అన్నది ఇటీవల వంశీ పైడిపల్లి అలాగే పూరి జగన్నాధ్ లను చూస్తే అర్థమవుతోంది.

Mahesh Babu's Maharshi Movie 40 Days Box Office Collections Report

పూరి గతంలో మహేష్ పోకిరి, బిజినెస్ మాన్ అన్న రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అయినా ఆయన మహేష్ కోసమే రాసిన జనగణమన కథ మాత్రం మహేష్ కి నచ్చలేదన్న టాక్ ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కి మహేష్ నో చెప్పాడట. ఇక మహర్షి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన వైంశీ పడైపల్లి తో సినిమా ఉండాల్సింది. కాని ఇక్కడ కూడా సేం సీన్. వంశీ చెప్పిన కథ మహేష్ కి నచ్చకనే డ్రాపయ్యాడట. అయితే సీనియర్ స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రం, పూరి కంటే కూడా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పిన కథ కి మహేష్ బాగా ఇంప్రెస్ అయ్యాడని.. దాదాపు ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఒకే అవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది