Puri Jagannath : కాన్‌ఫిడెన్సే పూరిని ఇంత దూరం తీసుకొచ్చిందా..?
Puri Jagannath: కాన్‌ఫిడెన్సే పూరిని ఇంత దూరం తీసుకొచ్చిందా..? అంటే ఆయన జర్నీ చూస్తున్న వారికి ఎవరికైనా అదే అనిపిస్తుంది. వాస్తవంగా పూరి జగన్నాథ్‌లా బ్రతకడం చాలా కష్టం. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి మొదటి సినిమానే పవన్ కళ్యాణ్‌తో తీసి ఓవర్ నైట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా మారాడు. బద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన పూరి ఆ తర్వాత బాచి సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. దాంతో తను చేసిన మిస్టేక్ ఏంటో వెంటనే పట్టేశాడు. ఆ తర్వాత రవితేజ హీరో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి లాంటి సినిమాలు తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్‌గా మారాడు.
పూరి కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. పోకిరి సినిమాతో 75 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డ్స్ మొత్తం బ్రేక్ అయ్యాయంటే పూరి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. పవన్‌కు బద్రి..మహేశ్‌కు పోకిరి, రవితేజకు ఇడియట్, నాగార్జునకు శివమణి, కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు అప్పు, రామ్ కి ఇస్మార్ట్ శంకర్…ఇలా ప్రతీ హీరోకు ఓ మాస్ హిట్ ఇచ్చి పూరి తన రేంజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. సాధారణంగా ఓ ఫ్లాప్ వస్తేనే దర్శకుడు గానీ, నిర్మాత గానీ ఇండస్ట్రీలో మళ్ళీ కనిపించడం చాలా కష్టం.అలాంటిది దర్శక, నిర్మాతగా సెటిలయిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎవరూ సంపాదించలేనంత డబ్బు సంపాదించాడు.
Puri Jagannath: అందుకు ఉదాహరణ అమితాబ్ బచ్చన్.
అది మొత్తం పోగొట్టుకొని అప్పులపాలయ్యాడు. రూ.100 కోట్లు పోగొట్టుకోవడం అంటే ఎలాంటి వాడికైనా ఆయన తీసిన సినిమాలా హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. కానీ, పూరి దీని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆయన చేతి మీద ఉన్న టాటూకు అర్థం ఏదీ శాశ్వతం కాదు అని. అలాగే, సక్సెస్ ఫెల్యూర్‌లలో ఏదీ సక్సెస్ కాదూ అని పూరి నమ్మిన సిద్దాంతం అందుకే..పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని కసితో మళ్ళీ లేచి నిలబడ్డాడు. ఇప్పుడు రెట్టింపు సత్తాతో అదే దర్శక నిర్మాతగా కొనసాగుతున్నాడు. పూరితో సినిమా చేయాలంటే కావాలసింది కమిట్‌మెంట్. అది అందరు హీరోలకు ఉంది. అందుకే, ఆయన తలుచుకుంటే బాలీవుడ్‌లో ఎంత పెద్ద హీరోతో అయినా సినిమా చేయగలడు. అందుకు ఉదాహరణ అమితాబ్ బచ్చన్. ఇక పూరి నుంచి ప్రస్తుతం రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అవే లైగర్, జనగణమన.