రవితేజ ఖిలాడి కి కాపీ మరకలు అంటుకుంటున్నాయా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రవితేజ ” ఖిలాడి ” కి కాపీ మరకలు అంటుకుంటున్నాయా ..?

 Authored By govind | The Telugu News | Updated on :3 January 2021,12:53 pm

రవితేజ నటించబోతున్న లేటెస్ట్ సినిమా ఖిలాడి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. గతంలో రవితేజ తో వీర సినిమాని తీసిన రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. కాగా త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సమయంలో ఈ సినిమా కి కాపీ మరకలు అంటున్నాయి.

Team Khiladi brings back Theri remake rumors - tollywood

ఇప్పటి వరకు తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయిన చాలా సినిమాలకి ఇలా కాపీ మరకలు అంటుకోవడం కామన్ అయినా ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మోషన్ పోస్టర్ విషయంలో అలాగే కథ విషయంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. అలాగే ప్రభాస్ రాధే శ్యాం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయ్యాక కూడా పలువురు నెటిజన్స్ ఆ పోస్టర్ ని కంచె సినిమాతో పాటు మరికొన్ని సినిమాల తో పోల్చి ట్రోల్ చేశారు. అంతేకాదు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాని కాపీ కొట్టాడన్న వార్తలు వచ్చాయి.

ఇప్పుడు కూడా రవితేజ నటించబోతున్న ఖిలాడి సినిమా కూడా కోలీవుడ్ లో విజయ్ నటించిన సూపర్ హిట్ సినిమా తేరీ కి కాపీ అన్న టాక్ మొదలైంది. విజయ్ – సమంత – అమీ జాక్సన్ కాంబినేషన్ లో తెరకెక్కిన తమిళ సినిమా తేరీ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఖిలాడి అనౌన్స్ చేసినప్పటి మాత్రం ఒక తమిళ సినిమాకి రీమేక్ అని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తేరీ కి కాపీ అంటున్నారు. ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇస్తేగాని అసలు విషయం ఏంటన్నది తెలియదు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది