Singer sunitha : సింగర్ సునీత నెటిజన్‌కి వాట్సాప్ నంబర్ ఇచ్చిందా..?

Authored By vamana sai | The Telugu News | Updated on : 10 May 2021, 4:59 pm

Singer sunitha : సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, హోస్ట్‌గా దేశ విదేశాలలోని ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. ఇండియాతో పాటు అమెరికా సహా పలు దేశాలలో ఎన్నో లైవ్ షోస్ ఇచ్చిన సునీత పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. కొన్ని వందల పాటలతో ప్రేక్షకులను.. ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంది. సాంగ్స్ పరంగా పోటీ ఎక్కువైనప్పటికి తను పాడాల్సిన పాట తనకోసమే ఎదురు చూస్తుంటుంది.

ఇక గత కొన్నేళ్ళుగా బుల్లితెర మీద బాగా సందడి చేస్తోంది. కొన్ని సింగింగ్ ప్రోగ్రాంస్‌కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సునీత రీసెంట్‌గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని షాకిచ్చింది. పెళ్ళి తర్వాత కూడా షోస్‌ కంటిన్యూ చేస్తున్న ఈమె కరోనా కారణంగా ఈ మధ్య షోస్‌లో పాల్గొనడం లేదు. కానీ అభిమానులకోసం ప్రతీరోజూ ఓ అరగంట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఇటీవల ఒక నెటిజన్ సునీతని షాకింగ్ గా ఒక క్వశన్ అడిగాడు.

singer-sunitha gave whatsapp number to netizen

singer-sunitha gave whatsapp number to netizen

Singer sunitha : సునీత వాట్సాప్ నెంబర్ అడిగాడట.

సినీ సెలబ్రిటీలు అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతుండటం ఈ మధ్య కాలంలో ఒక వ్యాపకంలా మారిన సంగతి తెలిసిందే. హీరో, హీరోయిన్స్ సహా పలువురు సెలబ్రిటీలు ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ లలో కాంటాక్ట్ అవుతున్నారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. సునీత కూడా ఇటీల కాసేపు ఇలానే చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంలో ఒక నెటిజన్ సునీత వాట్సాప్ నెంబర్ అడిగాడట. అందుకు సునీత సో సారీ అండీ అంటూ కూల్‌గా సమాధానమిచ్చింది. మరొకరైతే మరో యాంగిల్‌లో రాష్‌గా ఆన్సర్ ఇస్తారు. కానీ సునీత ఇలా ఇచ్చిన సమాధానానికి అందరు ప్రశంసిస్తున్నారు.

Advertisement

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి