SuperStar Krishna : ఆ దర్శకుడే సూపర్ స్టార్ కృష్ణ చావుకి కారణం..!
SuperStar Krishna : సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించారు. నిజానికి.. కృష్ణ అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పాటు.. గుండెపోటు రావడం, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అవడంతో తుదిశ్వాస విడిచారు. దీనికి సంబంధించి డాక్టర్లు కూడా రిపోర్టు విడుదల చేశారు. కానీ.. ఆయన మరణానికి అనారోగ్యం కారణం కాదు.. ఒక డైరెక్టర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు కృష్ణ చనిపోవడానికి,
ఒక డైరెక్టర్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అసలు ఆ డైరెక్టర్ ఎవరు? ఆయన ఎందుకు కారణం అయ్యారో తెలుసుకుందాం రండి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటున్నారు. ఎందుకంటే.. ఆయన దర్శకత్వంలో సినిమాలు తీస్తున్న హీరోల తండ్రులు ఆయనతో సినిమా తీస్తున్నప్పుడే మరణిస్తున్నారట. పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా తీస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తండ్రి వెంకటరావు మృతి చెందారు. జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా తీస్తున్నప్పుడు, ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాజాగా.. మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తీస్తున్నప్పుడు కృష్ణ చనిపోయారు అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
SuperStar Krishna : పవన్, ఎన్టీఆర్, మహేశ్.. ముగ్గురికీ ఒకేలా?
ఈ ముగ్గురు హీరోలతో సినిమాలు తీస్తున్న సమయంలోనే వాళ్ల తండ్రులు మరణించారని నెటిజన్లు అంచనాలు వేస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను మరికొందరు నెటిజన్లు కొట్టి పారేస్తున్నారు. చాలామంది హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు తీశారు. మరి వాళ్లందరి తండ్రులు బాగానే ఉన్నారు కదా.. అంటూ కొత్త జోస్యం చెబుతున్నారు. అది యాదృచ్చికంగా జరిగిందే తప్పితే అదేదో ఆయనతో సినిమాలు తీసినప్పుడే వాళ్ల తండ్రులు చనిపోవడం అనేది అసంబద్ధం అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.