Manchu Manoj : మంచు బ్రదర్స్ మధ్య గొడవకు అసలు కారణం ఏంటీ? విభేదాలు నిజమే మనోజ్ మాటే సాక్ష్యం

 Authored By prabhas | The Telugu News | Updated on :10 March 2023,11:00 am

Manchu Manoj : మంచు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా అన్నదమ్ముల మధ్య ఆర్థిక సంబంధిత విభేదాలు ఉన్నాయి అనేది చాలా మంది వాదిస్తున్న విషయం. ఆ కారణాల వల్లే మంచు మనోజ్ యొక్క పెళ్లికి విష్ణు దూరంగా ఉంటూ వచ్చాడని, చివరి నిమిషంలో మోహన్ బాబు పిలవడం తో విష్ణు వచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అసలు మంచు విష్ణు మరియు మనోజ్ మధ్య ఉన్న విభేదాలు ఏంటి? ఇద్దరి మధ్య ఎందుకు పడడం లేదు? అనేది చాలా మందికి క్లారిటీ లేదు. అసలు విషయం ఏంటంటే

Is that the real reason for the quarrel between the manchu brothers

Is that the real reason for the quarrel between the manchu brothers

అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇదే… ఆస్తి తగాదాల కారణంగా ఇద్దరు మాట్లాడుకోవడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోహన్ బాబు ఆస్తి పంచి ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని ఇండస్ట్రీకి చెందిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని కొందరు కొట్టి పారేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు మోహన్ బాబు తన ఆస్తిని పంచి ఇవ్వలేదని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మనోజ్ విడాకులపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్.. | Manchu Vishnu  interesting comments on his brother Manoj divorce issue pk– News18 Telugu

మొత్తానికి రకరకాలుగా అన్నదమ్ముల విషయమై ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటి అనేది ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ విషయమై వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలని మంచు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచు అభిమానుల కోసం అయినా విష్ణు లేదా మనోజ్ ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మంచు మనోజ్‌ మరియు మంచు విష్ణు కలిసి నటిస్తారు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ విభేదాల నడుమ ఇద్దరి కాంబోలో సినిమా ఏం వస్తుంది అంటూ నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి