Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :26 August 2025,2:00 pm

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు సినిమా ఈవెంట్లలోనూ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన “సుందరకాండ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన మనోజ్, తన వ్యాఖ్యలతో వేడుకలో నవ్వులు పూయించారు. ఈ సినిమా ద్వారా ప్రభాస్ తొలి సినిమా హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈవెంట్‌లో ఆమె కూడా పాల్గొన్నారు.

#image_title

మనోజ్ స్ట‌న్నింగ్ కామెంట్స్

ఎప్పటిలాగే అదే అందంతో కనిపించిన శ్రీదేవిని చూసి ప్రేక్షకులు ఆనందంతో ముంచెత్తారు.”శ్రీదేవి గారు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మేమిద్దరం చెన్నైలో కలిసి పెరిగాము. ఆమె చాలా సింపుల్‌గా కనిపిస్తారు, కానీ అప్పట్లో పెద్ద రౌడీ. ఎవరో నన్ను బెదిరిస్తే ఆమెనే ముందుకొచ్చేది. నన్ను చెన్నైలో బాగా ర్యాగింగ్ చేసింది. అప్పట్లో నేను చాలా ఇన్నోసెంట్ వాడిని. ఇప్పుడు కూడా ఆమె ఫెంటాస్టిక్ గానే ఉన్నారు అని అన్నారు.

శ్రీదేవి ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె కాగా, మోహన్ బాబు కుటుంబం కూడా ఆ సమయంలో చెన్నైలోనే ఉండేదట. అదే పరిసరాల్లో పెరిగిన మనోజ్, శ్రీదేవి చిన్ననాటి స్నేహితులు. అందుకే ఈ ఈవెంట్‌లో పాత జ్ఞాపకాలను తెచ్చి, ముచ్చటలు పంచుకున్నారు.ఈ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి మళ్లీ తెలుగు తెరపైకి రావడం అభిమానులను ఎంతో ఉత్సాహపరిచింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది