Getup Srinu : జబర్దస్త్ రేటింగ్.. గెటప్ శ్రీను రావడంతో ఏమైనా పెరిగిందా?
Getup Srinu : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను దాదాపుగా దశాబ్ద కాలంగా జబర్దస్త్ కామెడీ షో అలరిస్తూనే ఉంది. ఆ షో జోరు చూస్తూ ఉంటే మరో పదేళ్లు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో మంది కమెడియన్స్ పోయినా.. ఎంతో మంది జడ్జ్ లు వచ్చి పోయినా.. యాంకర్స్ కూడా వెళ్లి పోయినా కూడా రేటింగ్ కాస్త తగ్గితే తగ్గుతుంది తప్ప పూర్తిగా డౌన్ అయితే కావడం లేదు. తాజాగా జబర్దస్త్ కు కొత్త కళ వచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
జబర్దస్త్ నుండి అనసూయ వెళ్లి పోవడంతో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మరో వైపు ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో బుల్లి తెర కమల్ హాసన్ గా పేరు దక్కించుకున్న శ్రీను అలియాస్ గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపుగా మూడు నెలల నుండి గెటప్ శ్రీను కనిపించడం లేదు. సుధీర్ ఇతర కమెడియన్స్ మాదిరిగానే గెటప్ శ్రీను కూడా స్టార్ మా లో ప్రత్యక్ష్యం అవ్వబోతున్నాడేమో అంటూ అంతా అనుకున్నారు. కాని ఆయన మళ్లీ మల్లెమాల లో ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ ప్రైజ్ చేశాడు.
తాజా ఎపిసోడ్ లో గెటప్ శ్రీను సందడి చేశాడు. ఆయన కనిపించిన ఎపిసోడ్ కు మంచి రేటింగ్ వచ్చింది. ఈటీవీలో భారీ ఎత్తున ప్రేక్షకులు చూడటంతో పాటు యూట్యూబ్ లో కూడా ఆ స్కిట్ ను రెట్టింపు సంఖ్యలో చూశారు. దాంతో జబర్దస్త్ కు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. గెటప్ శ్రీను దారిలోనే గత కొన్నాళ్లుగా జబర్దస్త్ కు దూరంగా ఉన్న హైపర్ ఆది రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆది ఇన్నాళ్లు దూరం అయ్యాడు. మరో రెండు మూడు వారాల్లో లేదా ఆ తర్వాత అయినా రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు.