Sudgali Sudheer : సుడిగాలి సుధీర్ నిజ స్వరూపమిదే.. బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్
Sudgali Sudheer : సుడిగాలి సుధీర్ బుల్లితెరపై రోజురోజుకూ పాపులారిటీని పెంచుకుంటూ పోతోన్నాడు. సుధీర్ సంపాదించుకుంటున్న క్రేజ్ ఎన్నో ఏళ్ల శ్రమకు వచ్చిన ఫలితం. అయితే సుధీర్ మాత్రం ఎప్పుడూ కూడా బయట కనిపించడు. తెరపై మాత్రం ఎంటర్టైన్ చేస్తుంటాడు. సుధీర్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఎవ్వరితోనూ టచ్‌లో ఉండడు.
తన పని ఏదో తాను చూసుకుంటూ ఉంటాడు. బయటకు వెళ్లినా కూడా ప్రైవసీ మెయింటైన్ చేస్తాడు. ఇక హంగూ ఆర్భాటాలకు ఆమడ దూరంలో ఉంటాడు. అయితే తాజాగా వదిలిన జబర్దస్త్ ప్రోమో, అందులో సుధీర్ టీం చేసిన స్కిట్, అందులో కమెడియన్ బాబు వేసిన కౌంటర్లు గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. హీరోగా బాబు కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు.అయితే సుధీర్ గురించి ఓ నిజం కూడా చెప్పేశాడు. ఎవరి బర్త్ డే అయినా కూడా వీడయో బైట్‌లు సుధీర్ ఇవ్వడట.

Jabadasth Comedian Babu on Sudgali Sudheer
Sudgali Sudheer : సుధీర్‌పై బాబు కౌంటర్లు..
నువ్ అడిగావని ఇస్తే.. ఇంకొకరు అడుగుతారు.. వాళ్లకు ఇవ్వకపోతే ఫీలవుతారు అని ఓ డైలాగ్ కొట్టాడట సుధీర్. అదే డైలాగ్ ఇప్పుడు బాబు కొట్టాడు. ఇది ఎక్కడో విన్నట్టుంది అని సుధీర్ అంటే.. విన్నట్టు కాదు అన్నట్టుంది.. అని బాబు కౌంటర్ వేస్తాడు. అలా వీడియో బైట్‌లు ఇవ్వడం, దాని ద్వారా పబ్లిసిటీ చేసుకోవడం సుధీర్‌కు ఇష్టముండదన్న మాట.
