Jabardasth Avinash : పెళ్లైన తరువాత మొదటి సారి అలా.. భార్యతో అవినాష్ రచ్చ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Avinash : పెళ్లైన తరువాత మొదటి సారి అలా.. భార్యతో అవినాష్ రచ్చ

 Authored By bkalyan | The Telugu News | Updated on :19 November 2021,2:40 pm

Jabardasth Avinash : జబర్దస్త్, బిగ్ బాస్, కామెడీ స్టార్స్ షోలతో అవినాష్ బాగానే పాపులర్ అయ్యాడు. ముక్కు అవినాష్‌గా స్థిరపడిపోయాడు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడు. అవినాష్ పెళ్లి సంగతులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి అవినాష్ పెళ్లి మ్యాటర్ నెట్టింట్లో వైరల్ అవుతూనే వచ్చింది. అరియానా అవినాష్ ట్రాక్ మీద నాగార్జున కామెంట్లు చేయడం, ఇలాంటి ఆరోపణలన్నీ చేయకండి సర్ అసలే బయట సంబంధాలు చూస్తున్నారంటూ అవినాష్ వాపోవడం అందరికీ తెలిసిందే

Jabardasth Avinash Shopping Video With Anuja

Jabardasth Avinash Shopping Video With Anuja

మొత్తానికి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత కష్టాలన్నీ తీరిపోయాయి. ఇళ్లు కట్టుకున్నాడు. షోలు చేస్తున్నాడు. సినిమాల్లో నటిస్తున్నాడు. అలా ఫుల్ బిజీగా ఉన్న అవినాష్.. మొత్తానికి పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. గత నెలలో వివాహాం చూసుకున్న అవినాష్ ఇప్పుడు భార్యతో కలిసి రచ్చ చేస్తున్నాడు. అవినాష్ తన యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను షేర్ చేశాడు. పెళ్లి తరువాత అవినాష్ మొదటి సారిగా తన భార్యను షాపింగ్‌కు తీసుకెళ్లాడట.

Jabardasth Avinash : భార్యతో అవినాష్ షాపింగ్..

ఇక షాపింగ్‌లో భార్య కొనే వస్తువుల మీద అవినాష్ కౌంటర్లు వేశాడు. డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు ఇలా రకరకాల వస్తువులను కొనేసింది. ఎంత బిల్ అవుతుందో అని అవినాష్ ముందు నుంచి కంగారు పడుతూనే వచ్చాడు. మొత్తానికి భార్య షాపింగ్ అంటూ అవినాష్ కూడా కొనుక్కున్నాడట. ఇలా పెళ్లైన తరువాత మొదటిసారి భార్యను షాపింగ్‌కు తీసుకెళ్లడం ఆనందంగా ఉందని, ఇంకా షాపింగ్ పూర్తి కాలేదని మళ్లీ చేయాలని చెప్పాడు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది