Jabardasth Geetu : జబర్దస్త్ లో ‘పుష్ప’ తో ఎంట్రీ ఇచ్చిన గీతూ సంగతి ఏంటీ.. ఆమె పారితోషికం ఎంత?
Jabardasth Geetu : జబర్దస్త్ లో ఈమద్య కాలంలో లేడీ కమెడియన్స్ ఎక్కువ అయ్యారు. జబర్దస్త్ 9 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన సమయంలో ఒక్కరు అంటే ఒక్క లేడీ కమెడియన్ లేరు. లేడీ పాత్రలు కావాల్సి వచ్చినప్పుడు మగవారితోనే ఆడవారిగా లేడీ గెటప్స్ వేయించే వారు. లేడీ గెటప్స్ తో మరింత కామెడీ వచ్చేది. వారి పై జనాల్లో ఆసక్తి తగ్గుతున్న సమయంలో మెల్ల మెల్లగా లేడీ గెటప్స్ ల ప్లేస్ల ఓ ఒరిజినల్ లేడీస్ వచ్చారు.జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ సందడి మొదలు పెట్టింది హైపర్ ఆది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్కిట్స్ ల్లో లేడీస్ ను తీసుకు వచ్చేవాడు.
ఆయన వల్ల ఇతర కంటెస్టెంట్స్ కూడా తీసుకు రావడం జరిగింది. అమ్మాయిలు అయినా కూడా ఎలాంటి ఈగోలకు పోకుండా పంచ్ లు వేయించుకుంటూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో దూసుకు పోతున్న లేడీ కమెడియన్ గీతూ.టిక్ టాక్ ద్వారా వెలుగు లోకి వచ్చిన ఈ రాయలసీమ అమ్మాయి తన రాయలసీమ యాస వల్ల బాగా ఫేమస్ అయ్యింది. తన యాస మరియు భాష తో పాటు చూడ్డానికి చక్కగా ఉండి మంచి యాక్టివ్ గా ఉంటూ ప్రతి ఒక్కరి తో కూడా వావ్ అనిపించుకునేంత చలాకీతనం ఉంది.

jabardasth comedian galatta geetu interesting news
ఈమె చూడ్డానికి చిన్న అమ్మాయిలా అనిపిస్తుంది. కాని ఈ అమ్మడి పెళ్లి అయ్యి చాలా రోజులు అయ్యింది. ఈమె యూట్యూబ్ ద్వారా మొదట్లో హడావుడి చేసేది.ముఖ్యంగా బిగ్ బాస్ కు రివ్యూలు చెప్పడం ద్వారా ఈమె బాగా పాపులారిటీని దక్కించుకుంది. దాంతో ఈమె కు మంచి ఇమేజ్ దక్కింది. ఆ ఇమేజ్ తో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ల్లో నటించి ఇప్పుడు ఏకంగా జబర్దస్త్ లో కనిపిస్తుంది. ఈమె ఒక్కో కాల్షీట్ కు ఏకంగా 50 నుండి 75 వేల రూపాయల వరకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీరియల్స్ లో కూడా నటించే అవకాశం వస్తే చేస్తానంటోంది. ఈమె జబర్దస్త్ లో పుష్ప స్కిట్స్ చేసి బాగా పాపులర్ అయిన విషయం తెల్సిందే.